15, డిసెంబర్ 2016, గురువారం

పలుకే బంగారమాయెరా! బాపూ నీ పలుకే......


(ఈరోజు బాపూ గారి జయంతి)
Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన  నాలాగే బాపూ రమణలవీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా.  ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన  విషయాలు అందులో  వున్నాయి.  కానీ శ్రీనివాసులు  గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో,  కింద ఇస్తున్నాను.

నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక ...యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన చెప్పిన మాటలు....అక్షరాలా ....కొన్ని మాటలు....’ “
(26-08-2013నాటి నా బ్లాగునుంచి)


1 కామెంట్‌:


  1. ఇటువంటిదే మరొక కథ. స్వాతంత్ర్యం రాక ముందు రోజుల్లో అప్పటి మద్రాసులో జరిగిన ఓ సభకి ఓ ప్రముఖ వ్యక్తి అధ్యక్షత వహించారట (పేరు మరచిపోయాను). నిర్వాహకులు "Now we request Sri xxxx to give his address" అని మైకులో అన్నారట. అధ్యక్షోపన్యాసం ఇవ్వమని నిర్వాహకుల భావం. ఆయన లేచి మైకులో తన ఇంటి "అడ్రస్" చెప్పి కూర్చున్నారట 😀.
    ఈ ప్రముఖుడు గాని, బాపు గారు గాని చేసిన పని వారి హాస్యప్రియత్వానికి ఉదాహరణలు, నిర్వాహకుల ఉద్దేశ్యం వారికి తెలియక కాదు 🙂. కానీ ఏదైనా బాపు గారిని మితభాషి అనే అనేవారు.

    రిప్లయితొలగించండి