పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణా
ముఖ్యమంత్రి కేసీఆర్, కొద్దిసేపటి క్రితం ముగిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు గమనిస్తే, ఆర్ధిక
గణాంకాలను ఆశువుగా పేర్కొన్న తీరును పరిశీలిస్తే ఆయన ఈ అంశంపై చాలా కసరత్తు చేసినట్టు, సంపూర్ణ అవగాహనతో వున్నట్టు మొదటి అభిప్రాయం
కలుగుతుంది.
ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ
మద్దతు అధికారికంగా ఓ పక్క ప్రకటిస్తూనే మరో పక్క వినయపూరితమైన హెచ్చరిక చేశారు.
“నూటికి నూరు శాతం అవినీతి రహిత, వందకు
వంద శాతం నల్ల ధనం రహిత భారతం లక్ష్యంగా ఈ పధకం అమలు జరగాలి. అప్పుడే ఇది సఫల
ప్రయోగం అనిపించుకుంటుంది. లేదా విఫల ప్రయోగం అనే అపప్రధను మోయాల్సి వుంటుంది. అలా
జరగడం జాతికి మేలు చేయదు” అని స్పష్టంగా చెప్పారు.
ఈ నిర్ణయం అమలు పర్యవేక్షణకు కేంద్రం
నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి
నేతృత్వం అప్పగించడం పై అడిగిన ప్రశ్నకు ‘మంచిదేగా’ అంటూ ఇచ్చిన కేసీఆర్ సమాధానం
హుందాగా వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి