1987లో రేడియో మాస్కోలో పనిచేయడానికి నేను కుటుంబంతో కలిసి మాస్కో వెళ్ళాను. అంటే దాదాపు 29 ఏళ్ళు. అప్పటికే ఆ నగరంలో అన్నీ
బహుళ అంతస్తుల భవనాలే. ఊలిత్స వావిలోవాలో మేమున్న నివాసం వున్నది పద్నాలుగు
అంతస్తుల భవనం. ప్రతి ఫ్లోర్ లో వుండేవాళ్ళు ఎవ్వరూ ఇంట్లో చెత్త పారేయడానికి
కిందికి వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదు. పై నుంచి కింది వరకు లిఫ్ట్ ఏర్పాటుకు
వుండే వెంట్ మాదిరిగా ఒక గొట్టం వుండేది. ఏ అంతస్తులో వాళ్ళు ఆ అంతస్తులోనే పొడి
చెత్త, తడి చెత్త విడివిడిగా బ్యాగుల్లో నింపి ఆ గొట్టానికి వున్న తలుపులాంటిది
తెరిచి అందులో వేసేవాళ్ళు. ఆ చెత్తంతా భవనం అడుగు భాగంలో ఏర్పాటుచేసిన
ట్రాలీల్లోకి చేరేది. చెత్తను తీసుకువెళ్ళే మునిసిపల్ వాహనం వాటిల్లోని చెత్త
సంచులను యంత్రాలతో తీసి పట్టుకు వెళ్ళేది. ఈ మొత్తం వ్యవహారం అంతా తెల్లవారేసరికి
జరిగిపోయేది. రోడ్ల పక్కన చెత్త కుండీలు
కనబడేవి కావు. బయట ఎక్కడా చెత్తాచదారం కంట పడేది కాదు.
మన దగ్గర కూడా భవన నిర్మాణ సమయంలోనే
ఇటువంటి ఏర్పాట్లు ఖచ్చితంగా చేసి తీరాలని నిబంధన విధిస్తే ఎలా వుంటుంది?
అధికారులూ ఆలోచించండి.
చేయగలిగితే ఏర్పాటు బాగానే ఉంటుంది శ్రీనివాస రావు గారూ. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అపార్ట్‌మెన్‌ట్ల భవనాల్లో ఇటువంటి ఏర్పాటు నేనూ గమనించాను. మనదేశంలో ఇంట్లోనుంచి చెత్తసంచులు తీసుకొచ్చి ఫుట్‌పాత్ ల మీద పడేసే అలవాటు మనది.
రిప్లయితొలగించండిమరో సంగతి చెప్పనా? చిన్నదే అనుకోండి, కానీ మన సివిక్ సెన్స్ ఏపాటిదో చూపిస్తుంది. అపార్ట్‌మెంట్ల భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ రోజూ నీళ్ళ పైపుతో కడిగి ఆ నీళ్ళన్నీ రోడ్డు మీదకి కొట్టేస్తుంటారు ఆ భవనం వాచ్‌మన్ / అతని కుటుంబం. తమ భవనం చాలా శుభ్రంగా ఉంచుతున్నామని వాళ్ళ ఉద్దేశ్యం కావచ్చు. కానీ ఆ నీళ్ళు రోడ్డు మీద మడుగు కట్టి బురదగా తయారయ్యి రోడ్డుమీద వెళ్ళే వాళ్ళకి మహా ఇబ్బంది కలిగిస్తాయి (రోడ్డు మీదే నడవాలి. ఫుట్‌పాత్‌లు నడవడానికి యోగ్యంగా ఉండవన్న సంగతి మీకు తెలుసుగా). దీన్ని అరికట్టే ప్రయత్నాలు జరగవు. భవన నిర్మాణ సమయంలోనే తగిన మార్గం ఉండాలని విధించవచ్చుగా. జరగదు. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెన్‌ట్ ఓ అవినీతి కూపం.
మరొకటి చెబుతాను. కృష్ణకాంత్ పార్క్ తెలుసుగా మీకు. దాని కాంపౌండ్ గోడ చుట్టూ చెత్త తీసుకువెళ్ళే లారీలు పార్కింగ్ చేసుంటాయి గమనించండి. ఇంక జనం ఆ పార్కుకి వెళ్ళడం ఎందుకు?
హేంవిటో మీ చాదస్తం శ్రీనివాసరావు గారు. మనం ఎక్కడో దారి తప్పాం. .
ఉన్న సౌకర్యం దేనినీ సవ్యంగా ఉపయోగించుకోకపోవడమే మన గొప్పతనం. :) మీరు చెప్పిన విషయం బాగుంది, సౌకర్యం కలగజేస్తే సవ్యంగా ఉపయోగించుకుంటారా అనేదే అనుమానం...
రిప్లయితొలగించండిమరోమాట, మన దేశంలో చట్టాలకి లోటుందంటారా? అమలుకి లోటుందంటారా?
India is the dirtiest country. More than govt. It is citizens attitude that sucks.
రిప్లయితొలగించండి