ఆంధ్రప్రదేశ్
కు ప్రత్యేక హోదా విషయంలో టీవీల్లో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు మునిమాపు వేళల్లో చిన్నపిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'ఊ' కొడుతూ, కధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'ఊ' అనేవాళ్ళు పిల్లలు.
'ఆ ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'ఊ' అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'ఆ' అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'ఆ' అంటే వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని, ఆ కధ మాత్రం అలా అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'వై ఎస్ ఆర్ సీపీ వాళ్ళు
బందులు చేస్తే వస్తుందా?
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా? అమరావతిలో కూర్చుని ప్రెస్ వాళ్ళతో ఆగ్రహాలు, నిరసనలు వ్యక్తం చేస్తే వస్తుందా?‘కేంద్ర ప్రభుత్వానికి రాం రాం చెబితే వస్తుందా’
'రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తే వస్తుందా’
'అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో పడ్డ సూది ముసలమ్మ చేతికి
దొరికినప్పుడు'
ఉపశృతి
“ప్రమోషన్ రాగానే కంచి పట్టు చీరె కొనిపెడతామన్నారు. రెండేళ్ళయింది. అది ఒట్టి మాటేనా?”
“భలేదానివే. దాని విషయమే కదా నేను ఇన్నాళ్ళు ఆలోచిస్తోంది. కాకపోతే ఒక సంగతి చెప్పాలి. చీరెదేముంది, ఈరోజు కడతావు, కలరు మాసిపొతే రేపు బయట పడేస్తావు. అదే నెక్లెసు కొన్నాననుకో. నాలుగు కాలాలపాటు వుంటుంది. నీకూ నలుగుర్లో గొప్పగా
వుంటుంది. ఏమంటావ్!”
సరే, మరి నెక్లెస్ ఎప్పుడు కొంటున్నారు?
రిప్లయితొలగించండి@Kishore :కొనిపెట్టే మొగుళ్ళు చెప్పి కొనిపెట్టరు.
రిప్లయితొలగించండి‘‘ఉపశృతి’’ కాదేమోనండి అది ’’ఉపశ్రుతి‘‘ అని వుండాలి.
రిప్లయితొలగించండి.....శ్రీనివాసుడు
@శ్రీనివాసుడు - కావచ్చేమో . అయితే మా కంప్యూటర్ మొండిది. దాని తెలుగు దానిది టీవీ యాంఖర్ల తెలుగులాగా.
రిప్లయితొలగించండిఉపశ్రుతి [permalink]
రిప్లయితొలగించండిఉపశ్రుతి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report an error about this Word-Meaning గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. ఇ. స్త్రీ.
1. తమ భాషణమప్పుడు డబ్బాటునఁగలిగెడి శుభాశుభసూచకమగు అన్యసంభాషణ శ్రవణము;
2. ఒడఁబాటు.
ఉపశ్రుతి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
upa-ṣruti
[Skt.] n.
A good or bad omen gathered from overhearing a conversation.
ఉపశ్రుతి : ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953 Report an error about this Word-Meaning
సం.వి.ఇ.స్త్రీ.
1. తమ భాషణమప్పుడు డబ్బాటునఁ గలిగెడి శుభసూచకమగు అన్యసంభాషణ శ్రవణము : చూ, వినికిడి;
2. ఒడఁబాటు : చూ, సమ్మతి.1.
ఉపశ్రుతి : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966 Report an error about this Word-Meaning
సం.వి.ఇ.స్త్రీ.
1. సమ్మతి.
2. వినికి.
3. ప్రసంగవశమున పలికినదియు, శుభాశుభములను సూచించునదియునగు వాక్యము.
సం.అవ్య.
చెవిదగ్గఱ.
వ్యు. శ్రు = శ్రవణే-ఉప + శ్రు + క్తిన్. (కృ.ప్ర.)
ఉపశ్రుతి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report an error about this Word-Meaning
n.
1. a good or bad omen regarding any matter, as gathered from the words of others accidentally over heard, just when a conversation on the subject is going on;
2. a supernatural voice heard at night which is supposed to reveal the future;
3. fortune-telling, judicial astrology.
ఉపశ్రుతి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 Report an error about this Word-Meaning
సంస్కృత విశేష్యము
1. ప్రసంగవశమున ఇతరులు పలికిన శుభాశుభసూచక మగు వాక్యము.
2. సమ్మతి.
3. వినికి.
దేశ్య అవ్యయము
చెవిదగ్గర.
ఉపశ్రుతి : వావిళ్ల నిఘంటువు 1949 Report an error about this Word-Meaning
సం.వి.ఇ.స్త్రీ.
1. సమ్మతి.
2. వినికి.
3. శుభాశుభముల నొకదేవత చెప్పు వాక్యము.
అవ్య.ఇ.న.
కర్ణ సమీపమున, చెవిదగ్గఱ.
ఉపశ్రుతి : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 Report an error about this Word-Meaning
స్త్రీ.
తమ భాషణమప్పుడు డబ్బాటునఁ గలిగెడి శుభాశుభసూచకమగు అన్యసంభాషణశ్రవణము; ఒడఁబాటు.
ఉపశ్రుతి : శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956 Report an error about this Word-Meaning
సం.వి.
వినికి, ఒడఁబాటు, చెవివద్ద.
@శ్రీనివాసుడు గారు వేనవేల ధన్యవాదాలు
రిప్లయితొలగించండి"కావచ్చేమో . అయితే మా కంప్యూటర్ మొండిది. దాని తెలుగు దానిది టీవీ యాంఖర్ల తెలుగులాగా"
రిప్లయితొలగించండిఎందుకండీ పాపం కంప్యూటర్లని అవమానిస్తారు? వాటి తెలుగుని తెలుగనవచ్చు. యాంఖర్స్, ..హుం.. నాకు తెలుగులో ఇక్కడ రాయగల మాట దొరకడంలేదు.
@అజ్ఞాత : బాగా చెప్పారు. కరక్టే.
రిప్లయితొలగించండి