ఇందాక ఓ ఛానెల్ విలేకరి ఫోను చేసాడు. ‘ఓ
ప్రోగ్రాం చేస్తున్నాం, అభిప్రాయం కావాలి’అని.
రోజూ ఇది మామూలే కనుక ఇంటికి రమ్మన్నాను. రమ్మంటూనే
విషయం ఏమిటని వాకబు చేసాను. ప్రస్తుతం సాగుతున్న యోగా ప్రచారం మీద అని చెప్పాడు. దానికి
వ్యతిరేకంగా ప్రోగ్రాం చేస్తున్నాము కాబట్టి నా అభిప్రాయం కూడా అలాగే ఉండాలన్నాడు. బహుశా
వృత్తిలోకి కొత్తగా వచ్చినట్టున్నాడు. అభిప్రాయం పలానా విధంగా వుండాలి అని అతడు
అడగడం, నేను అలానే చెప్పడంజరిగితే, అది అతడి అభిప్రాయం అవుతుంది కానీ, నాది కాదు
కదా!
అదే అతడితో అన్నాను. అంతే! రెండు గంటలు
అవుతున్నా పత్తా లేడు.
ఈ రోజుల్లో నైతిక విలువలు ఏమి ఉండట్లేదు. ఎంత సేన్సషన్ సృష్టిస్తే అంత బావుంటుంది అనుకుంటున్నారు
రిప్లయితొలగించండి