కంటి చూపుతో కాల్చేస్తా, వొంటి చేత్తో
ఇరగదీస్తా అనే మాటలు చప్పట్లు కొట్టించుకునే డైలాగులు మాత్రమే. నిజానికి ఈ శక్తి
ఒక్క ప్రకృతికే వుంది.
మొన్న గురువారం అర్ధ రాత్రి జనాలు గాఢ
నిద్రలో వున్నప్పుడు నగరంలో గాలి వాన సాగించిన బీభత్స దృశ్యాలు ఒక్కటొక్కటిగా బయట
పడుతున్నాయి. ఆ రాత్రి మేలుకుని వుండే అవసరం పడి జరిగిన అనర్ధాన్ని బయటకి వెళ్లి
కనులారా చూడలేకపోయినా, ప్రచండ వేగంతో వీచిన గాలికి తలుపులు, కిటికీలు టపటపా కొట్టుకున్న
ధ్వనులు చెవుల్లో ఇంకా మారుమోగుతూనే వున్నాయి. వున్నట్టుండి పైన డాబా మీద పిడుగు పడ్డ చప్పుడు. తెల్లారి లేచి చూస్తే, పైన
వాటర్ ట్యాంక్ కు అమర్చిన ఇనుప నిచ్చెన విరిగి పడివుంది. నలుగురు చేయి వేస్తేకాని కదల్చలేని బరువైన
నిచ్చెన, ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా యెగిరి పడింది.
మనిషి అల్పత్వానికి మరో ఉదాహరణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి