కోళ్ళ ఫారం వంటి అపార్ట్ మెంట్లలో వుంటే ఇలానే వుంటుంది.
హోరు గాలికి టపటపా కొట్టుకునే కిటికీ
తలుపులు మూసుకోవడం, పిక్కటిల్లేలా వినబడే ఉరుములు, పిడుగుల చప్పుడు వినబడకుండా చెవులు మూసుకోవడం, ఈ
వర్షంలో పైన మొక్కలకి నీళ్ళు పోసే పని తప్పిందని సంతోష పడడం, కరెంటు, నెట్టూ వుంటే
ఆ అనుభూతుల్ని కవితలుగా చెక్కడం. అంతే!
వాన పడితే కరెంటు పోతుంది. జనం అలవాటు పడ్డ ఓ వాస్తవం. వాన వస్తుందేమో
అనుకున్నా సరే, కేబుల్ టీవీ ఆగిపోవడం అనేది అలాంటి మరో పచ్చి నిజం.
గాలి వానకి రాత్రి చాలా సేపు కరెంటూ లేదు, రాత్రంతా టీవీ లేదు.
పొద్దున్న పేపర్లో చూసేదాకా రాత్రి
నగరంలో గాలి వాన సృష్టించిన బీభత్సం
తెలియదు. అంచేతే, ఆకాశంలో యుద్ధం కవితలో అర్జునుడి పేర్లలో ఫల్గుణ, పార్ధివ వరకు రాసి,
బీభత్స అనే మరో పేరు రాయలేదు.
ఇప్పుడు తెలుస్తోంది, పత్రికల్లో
ఫోటోలు చూసిన తరువాత.
విరిగిపడ్డ చెట్లు, కూలిన కరెంటు
స్తంభాలు, నడిరోడ్లపై కార్లపై పడ్డ హోర్డింగులు.
రాత్రి యుద్ధంలో బీభత్సుడు కూడా
పాల్గొన్నాడని, పేరుకు తగ్గట్టే విధ్వంసం సృష్టించాడని.
(21-05-2016)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి