పాతికేళ్ళ క్రితం ఉద్యోగ రీత్యా ఓ
అయిదేళ్ళ పాటు మాస్కోలో వున్న నాలుగు కుటుంబాల వాళ్ళం నిన్న ఆదివారం కలుసుకున్నాం.
మేము మాస్కో వెళ్ళే నాటికి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తోంది.
తిరిగొచ్చేనాటికి కాంగ్రెస్ పాలన. నేను మాస్కో రేడియోలో పనిచేస్తే మిగిలిన
ముగ్గురు ఇండియన్ ఎంబసీలో ఉన్నతోద్యోగులు. వారికీ, వారి కుటుంబాలకి తెలుగుదేశం
అన్నా, చంద్రబాబునాయుడు అన్నా విపరీతమైన అభిమానం. ఆ అయిదేళ్ళ కాలంలో ఎప్పుడు
కలుసుకున్నా వాళ్ళ నోటి నుంచి బాబుగారి గురించిన ప్రశంసావాక్యాలే. 1989 లో ఆ పార్టీ ఓడిపోయినప్పుడు, రేడియో వాడిని కనుక, ఆ రోజుల్లో ఇంత
సమాచార విస్పోటనం లేదు కనుక, ఆ వార్తను వారికి ముందుగా చెబితే, ఇంటిల్లిపాదీ బాధపడడం నాకు తెలుసు. వాళ్ళ అభిమానం చూసి, ‘ఎన్నారైలకి ఓటు హక్కు
ఇస్తే బాబు గారే రాష్ట్రానికి శాశ్విత ముఖ్యమంత్రి’ అని నేను సరదాగా జోక్
చేసేవాడిని. మధ్యలో ఒకసారి మాస్కో నుంచి వచ్చినప్పుడు నేనే
స్వయంగా ఈ మాట ఆయన చెవినవేసాను. నవ్వి ఊరుకున్నారు.
గత ఇరవై ఐదేళ్ళలో బాబు గారి వెంట ఆనాడు
వున్న అనేకులు, పార్టీ ప్రముఖులు,
ముఖ్యంగా ఆయన నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందినవాళ్ళు మొహం చాటేశారు. వాళ్ళెవళ్ళు అన్నది అందరికీ తెలిసిందే.
కానీ మాస్కో బ్యాచ్ లో మాత్రం ఎలాంటి
మార్పు లేదు. బాబు గారంటే అదే ఆప్యాయత, అదే ఆదరణ.
ఆయన గుర్తింపుతో నిమిత్తం లేని అభిమానం
వారిది. ఇది నాకెలా తెలుసంటే, హైదరాబాదు వచ్చిన తరువాత ఇన్నేళ్ళలో ఆయన్ని కలిపించమని ఎన్నడూ అడగలేదు.
రిప్లయితొలగించండిఏదో ఆస్తి ఉందని వస్తే ఇట్లా అస్తికలు కూడా లేకుండా టపా రాస్తే ఎట్లా సుమండీ :)
జేకే !
బాబు గారి చిరునవ్వే వారికి పెద్ద ఆస్తి అని జిలేబి భోగట్టా :)
చీర్స్
జిలేబి
Srivas garu,
రిప్లయితొలగించండిBabu garu is not CM at 1989,N.T.R.
@naveen - నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది అనే రాసాను, బాబు గారు ముఖ్యమంత్రి అని కాదు. గమనించండి. - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి