జూల్స్ వెర్న్ రాసిన ‘ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం’ (Around
the World in Eighty days) నవల్లో కధానాయకుడు.
అలాటివాడు ఒకాయన మా బంధువర్గంలోనే వున్న సంగతి ఈరోజు తెలిసింది. ఆయన పేరు కూరపాటి
సీతారామారావు. వయస్సు ఏడు పదులపైనే. దేవాదాయ శాఖలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి
ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన స్వయంగా చెప్పిన ఆయన సొంత అనుభవం.
తెల్లవారితే
హైదరాబాదులో అల్లుడి ఇంట్లో శుభకార్యం. జరూరుగా ఒక స్నేహితుడితో కలిసి శృంగేరి
వెళ్ళాల్సిన సందర్భం. ముందు జాగ్రత్తగా మెంగుళూరునుంచి హైదరాబాదుకు విమానం
టిక్కెట్టు కొనుక్కున్నారు. తీరా వెళ్ళిన సమయానికి విమానం చక్కా యెగిరి పోయింది.
బస్ స్టాండుకు వెళ్లి కనుక్కుంటే
హైదరాబాదు వెళ్ళే ఆఖరి బస్సు అప్పుడే బయలు
దేరి వెళ్లిపోయింది. ఆ స్థితిలో మామూలుగా ఉసూరుమంటూ నిట్టూర్చి ఏమి దారి అని
వాపోయే పరిస్తితి. కానీ మన సీతారామారావు గారు ఫిలియాస్ ఫాగ్ వ్యవహారం కదా! వెళ్లి
వాకబు చేసారు, వెళ్ళిపోయిన బస్సులో టిక్కెట్లు ఏమైనా మిగిలాయా, ఫుల్లుగా వెళ్ళిందా
అని. పోయిన బస్సులో టిక్కెట్లు గురించి అడుగుతాడేమిటి ఈ పెద్దమనిషి అని కన్నడంలో
ఆశ్చర్యపోతూ, ‘రెండు సీట్లు ఖాళీ’ అని
ఇంగ్లీష్ లో చెప్పాడు కౌంటర్ మనిషి. ఈయన
వెంటనే డబ్బు తీసి ఇచ్చి ‘నాకో టిక్కెట్టు ఇవ్వండి’ అన్నాడుట. ఈయనగారి వరుస చూసి అప్పటికే
తల తిరిగి పోయి వున్నాడేమో కౌంటరు ఉద్యోగి మారుమాట్లాడకుండా టిక్కెట్టు తీసి ఇచ్చాడు. ఈయన అంతకంటే మర్యాదగా
అడిగారు. “ఒక్క సాయం చేయండి, నేను వచ్చిన టాక్సీలో వెళ్లి ఆ బస్సు పట్టుకుంటాను,
కాస్త ఆ బస్సు డ్రైవర్ కు సెల్ ఫోనులో చెప్పండి కాస్త నెమ్మదిగా పోతుండమని”. అలా
చెప్పడమేమిటి, టాక్సీ ఎక్కి రయ్యి రయ్యిమని వెళ్లి, వెళ్లి పోతున్న ఆ బస్సును పట్టుకోవడం ఏమిటి,
తెల్లారేసరికల్లా హైదరాబాదులో దిగి ఎంచక్కా అల్లుడు గారి ఇంట్లో వ్రతానికి హాజరు కావడం ఏమిటి అంతా జూల్స్
వెర్న్ నవల్లో మాదిరిగా చకచకా జరిగిపోయాయి (ట)
కార్యసాధన అంటే ఇదే కదా!
రిప్లయితొలగించండి