వీర వెంకట నరసన్న పంతులుకి ఒక్కడే కుమారుడు,
నారాయణ మూర్తి.
తండ్రి వరస కొడుక్కి ఏమాత్రం నచ్చేది కాదు. ‘ఉత్త
చాదస్తపు మనిషి, మనం చెప్పింది వినిపించుకోడు’ అనేది నారాయణ మూర్తి అభిప్రాయం,
కానీ పైకి అనేవాడు కాదు. తండ్రి అంటే వున్న గౌరవం వల్ల. అలానే ఏండ్లు గడిచిపోయాయి.
మూర్తికి కొడుకు పుట్టాడు. తండ్రి పోయాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి పేరు
కలిసివచ్చేలా వీరభద్రరావు అని పేరు పెట్టుకున్నాడు. అతడికి వయస్సు వస్తూనే తండ్రి
మాటలు, చేతలు చాదస్తంగా అనిపించేవి. పైకి
తండ్రితో అనలేకపోయినా తల్లితో చెప్పేవాడు తండ్రి చాదస్తం గురించి.
అదేమిటో వీరభద్రరావుకు కూడా ఒక్కడే కొడుకు.
తండ్రి చాదస్తం తెలిసిన వాడు కనుక తాను భిన్నంగా నడవాలనుకున్నాడు. కొడుక్కి ఇంటావంటా
ఎరుగని పేరు, ఇంద్రజిత్ అని పెట్టాడు. తన
ఆధునిక భావజాలానికి తానే మురిసి పోయాడు.
ఇంద్రజిత్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు వీరభద్రరావుకు జీవితానికి సరిపడా
జ్ఞానోదయం అయింది. కళ్ళముందు పెరిగిన పిల్లాడు ఇంద్రజిత్ తన స్నేహితులతో అంటుంటే అది ఆయన చెవిలో పడింది. ‘మా నాన్నది అంతా ఉత్త చాదస్తం. చెబితే ఒక
పట్టాన అర్ధం కాదు’
NOTE: Courtesy Image Owner
Generation gap అంటే ఇదే గాబోలు
రిప్లయితొలగించండిGeneration gap అంటే ఇదే గాబోలు
రిప్లయితొలగించండి