6, ఏప్రిల్ 2015, సోమవారం

సొరకాయ


'మీ ఇంట్లో కరెంటు ఉందా శంకరం?'
ముగ్గురు స్నేహితుల్ని కాన్ఫరెన్సు కాల్ లో పెట్టి అడిగాడు ఏకాంబరం.
'లేదు. పోయి రెండు గంటలు అవుతోంది' చెప్పాడు శంకరం.
' కామేశం మీ ఇంట్లో?'
'డిటో'
'మరి నీ సంగతి ప్రభాకరం'
'నేను మాత్రం సింగపూర్లో వున్నానా, హైదరాబాదులోనే కదా! అదే పరిస్తితి'
'అది సరే కానీ మీ ఇంట్లో కరెంటు ఉందా?'  ఏకాంబరాన్ని అడిగారు ముగ్గురూ ఒకేసారి.
'వుంది. కాకపొతే ఇన్వర్టర్ కరెంటు'
'అలాటప్పుడు ఈ ఆరాలన్నీ ఎందుకు?'



'ఎందుకా! అందుకే. ఇన్వర్టర్ కరెంటు వుంది. ఎదురుగా 'ఈనాడు' పేపరు  వుంది. అందులో   'వచ్చే  ఏడాది  కూడా విద్యుత్  కోతలుండవ్' అంటూ  ట్రాన్స్ కొ సీ.ఎం.డీ. ఇచ్చిన ఇంటర్వ్యూ తాటికాయంత అక్షరాల్లో కనబడుతూ వుంది. ఇప్పుడు అర్ధమయిందా నా బాధ'  చెప్పాడు ఏకాంబరం. (05-04-2015 , 9 PM)

5 కామెంట్‌లు:

  1. మా ఇంట్లో "మామూలు" కరెంట్ (ఇన్వర్టర్ కరెంట్ కాదు) ఉంది. నేను అడిగిన ముగ్గురు మిత్రుల ఇళ్ళలోనూ ఇదే పరిస్తితి. విశేషం ఏమిటంటే మేము ఎవరమూ "ఈనాడు" పత్రిక చదవము.

    ఈ ఏడాది అడపా తడపా (ఉ. వర్షం పడ్డాక) 15-30 నిముషాల పాటు తప్ప మా ఇంట్లో కరెంట్ పోలేదు. ఎన్నో ఏళ్ల తరువాత ఏప్రిల్ నెలలో ఇంత మంచి సరఫరా చూస్తున్నాను. ప్రతి ఏడాది 3-4 ఘంటల కరెంట్ కోత చూసిన నాకు ఈసారి హాయిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. మీవ్యాసం కొద్దిగా మారుస్తున్నాను...

    'మీ ఇంట్లో కరెంటు ఉందా శంకరం?'
    ముగ్గురు స్నేహితుల్ని కాన్ఫరెన్సు కాల్ లో పెట్టి అడిగాడు ఏకాంబరం.
    'ఉంది కదా' చెప్పాడు శంకరం.
    ' కామేశం మీ ఇంట్లో?'
    'డిటో'
    'మరి నీ సంగతి ప్రభాకరం'
    'నేను ఉందీ హైదరాబాదులోనే కదా! నాక్కూడా వుండి. ఎందుకూ?'
    '...'
    'అది సరే కానీ మీ ఇంట్లో కరెంటు లేదా?' ఏకాంబరాన్ని అడిగారు ముగ్గురూ ఒకేసారి.
    'వుంది. కాకపొతే ఇన్వర్టర్ కూడా వుందీ
    'అలాటప్పుడు ఈ ఆరాలన్నీ ఎందుకు?'

    'ఎందుకా! కొత్తగా ఇన్వర్టర్ పెట్టిచ్చా. పోయినేడాది గుర్తొచ్చి ఎందుకైనా మంచిదని. ఉహూ! సంతోషిద్దామంటే ఒక్కరోజు కూడా కరెంట్ పోవడం లేదు. ఎదురుగా "ఈనాడు" పేపరు వుంది. అందులో "వచ్చే ఏడాది కూడా విద్యుత్ కోతలుండవ్" అంటూ ట్రాన్స్ కొ సీ.ఎం.డీ. ఇచ్చిన ఇంటర్వ్యూ వుంది. ఇప్పుడు అర్ధమయిందా నా బాధ?' చెప్పాడు ఏకాంబరం.

    రిప్లయితొలగించండి
  3. @శ్రీకాంత్ చారి:

    పాపం ఏకాంబరం, కిరణ్ కుమార్ రెడ్డి ఏడుపు/శాపనార్తాలు నమ్మి ఇన్వర్టర్ కొనుక్కున్నాడు!

    సీరియస్ విషయానికి వస్తే, తాను పరిశ్రమ పెట్టిన ఇన్నేళ్ళలో మొట్ట మదటి సారి కరెంట్ కోత లేకుండా హాయిగా ఉన్నానని ఒక పారిశ్రామికవేత్త మిత్రుడు చెప్పాడు.

    రిప్లయితొలగించండి
  4. జై గారు,

    నేనూ అలాంటి ఏకాంబరాన్నే. ఈమధ్యే ఓ ఇన్వర్టరు కొన్నా!!

    రిప్లయితొలగించండి
  5. I hope this year there is no powercut in Hyderabad. And you are not buying "Sorakayalu"

    రిప్లయితొలగించండి