27, మార్చి 2015, శుక్రవారం

మగాడి నిర్ణయం


తెలివిగలవాడు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు ఇంట్లో అందర్నీ సంప్రదిస్తాడు. ఆ నిర్ణయం వల్ల తలెత్తగల సమస్యలను క్షుణ్ణంగా వారికి వివరిస్తాడు. వారు చెప్పేది జాగ్రత్తగా వింటాడు. వాటిని గురించి నింపాదిగా  ఆలోచిస్తాడు. అనవసరమైన కంగారు పడడు. ఇతరులను పెట్టడు. అన్నీ సాకల్యంగా బేరీజు వేసుకుంటాదు. చివరికి భార్య చెప్పిందే వింటాడు. 


దట్ సింపిల్ !
NOTE: Courtesy Image Owner

2 కామెంట్‌లు:

  1. అలా చెయ్యటం ఎందుకయినా మంచిదని. మగాడు కదా :)

    నాకొక (విదేశీ) జోక్ గుర్తొచ్చింది. జ్ఞాపకమున్నంత వరకు దానికి నా స్వేచ్చానువాదమిది.
    దూరప్రయాణాల్లో భాగంగా ఓ ఊరు వెళ్ళిన వ్యక్తి "ఈ ప్రాంతపు నీరు మంచిదేనా?" అని ఓ స్ధానికుడిని అడుగుతాడు. "అంత మంచిది కాదు" అని అంటాడు ఆ స్ధానికుడు. "మరయితే ఆ నీళ్ళే తాగుతారా?" అని ప్రయాణీకుడు అడుగుతాడు. దానికి ఆ స్ధానికుడు "అబ్బో మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ముందు నీటిని బాగా మరిగిస్తాం. తర్వాత దాన్ని రెండు మూడు సార్లు వడగడతాం" అని చెబుతాడు. "అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తర్వాతే ఆ నీటిని తాగుతారన్నమాట. బాగుంది" అని మెచ్చుకుంటాడు ప్రయాణీకుడు. అప్పుడు ఆ స్ధానికుడు అంటాడు కదా - "కాదు, కాదు. ఎందుకయినా మంచిదని ఆ నీటి బదులు బీరు తాగుతాం" :)

    రిప్లయితొలగించండి
  2. @ విన్నకోట నరసింహారావు - ఇదీ ఆ బాపతే. మూలం ఆంగ్లమే. కాకపోతే కాస్త 'తెలుగయిజ్'

    రిప్లయితొలగించండి