మూడేళ్ళ కిందటి
ముచ్చట.
లండన్ నగరంలోని
భూగర్భ మార్గంలో వెళ్ళే మెట్రో (ట్యూబు) రైల్లో ఇరవై ఏడేళ్ళ భారతీయ యువతి ప్రయాణం చేస్తోంది. వెంట భర్త,
వొళ్ళో మూడు నెలల పసి పిల్లాడు వున్నారు. అదే రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి
ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు. తన వొడిలో వున్న పిల్లవాడిని చూస్తూ 'చాలా
ముద్దొస్తున్నాడు మీ బాబు' అన్నాడు. ఆమె ఆయన్ని తేరిపార చూసింది. ఎక్కడో చూసినట్టు
అనిపిస్తున్న ఆ పెద్ద మనిషిని ఎక్కడ చూసింది చప్పున గుర్తురాలేదు. పక్కన వున్న
భర్తను అడిగింది, ఆయన ఎవరని. అప్పటిదాకా ఆయన్ని గమనించని ఆవిడ భర్త ఒక్క క్షణం
విభ్రమానికి గురయ్యాడు. వెంటనే అన్నాడు, 'ఆయన
ఎవ్వరా! బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కేమెరాన్!'
'చాల్లే నీ
పరిహాసం. ప్రధాని రైల్లో ఎందుకు వస్తాడు. నన్ను వెర్రిదాన్ని చేయాలని చూడకు'
అందామె మొగుడితో.
'అయితే నువ్వే
వెళ్లి అడుగు' అనేశాడు సంభాషణ ముగిస్తూ.
ఆమె ముందుకు కదిలి
వెళ్లి మొహమాట పడుతూనే అడిగింది, 'మీరు ప్రధాని డేవిడ్ కేమెరాన్ కదా!' అని.
'అవును' అన్నాడు
ఆయన, నిలబడి చదువుతున్న పేపర్ ని మడుస్తూ.
'నేనో అర్జంటు
మీటింగుకు వెళ్ళాలి. కారులో సమయం పట్టేట్టు వుంది. మెట్రోలో అయితే త్వరగా చేరుకోవచ్చనిపించి
రైలెక్కాను' అన్నాడాయన చిరునవ్వుతో. ప్రధాని వెంట ఒక బాడీ గార్డు వుండడం
గమనించింది ఆమె.
'ఇది తను పుట్టిన
భారత దేశంలో సాధ్యమా?' అన్న ప్రశ్న ఆమె మెదడును తొలిచేసింది.
ఢిల్లీలో, ముంబై లో
రైళ్ళలో తిరిగిన అనుభవం ఆమెకు వుంది. కానీ లండన్ రైల్లో ఇలాటి అరుదయిన అనుభవం
ఎదురుకాగలదని తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పినట్టు
ఆమెను ఉటంకిస్తూ డైలీ మిర్రర్ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.
చూసి నేర్చుకోవాలని
అంటారు మరి.
చూస్తాం, చదువుతాం
కాని, నేర్చుకోవడం అంత వీజీ ఏమీ కాదు.
Note: Courtesy Image Owner
ప్రస్తుతం మన వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు ఊహించలేము. పూర్వకాలంలో రాజులు మారువేషంలో ప్రజలమధ్య తిరిగేవారని కధల్లో చదివావాళ్ళంకదా, కనీసం అలానైనా మన ఇప్పటి నాయకులు ప్రజలమధ్య ఉండగలిగితే మనం బాగుపడే అవకాశంఉంది.
రిప్లయితొలగించండి< " పూర్వకాలంలో రాజులు మారువేషంలో ప్రజలమధ్య తిరిగేవారని కధల్లో చదివావాళ్ళంకదా, కనీసం అలానైనా మన ఇప్పటి నాయకులు ప్రజలమధ్య ఉండగలిగితే మనం బాగుపడే అవకాశంఉంది. " >
రిప్లయితొలగించండిఎంత అమాయకులండీ మీరు అజ్ఞాత (21 డిసెంబర్, 2014 2:33 [PM] ) గారు :) ఇప్పటి నాయకులకి కావలసినదే హంగూ, ఆర్భాటం, పటాటోపం. మంత్రులయితే ఎర్రబుగ్గ కారు, ముందు పైలట్ వాహనం లేందే బయటకు రారు గదా. వారి వాహనానికి ముందు వెడుతున్న పోలీస్ జీపులోంచి పోలీసు గారు తల బయటకు పెట్టి తప్పుకో / సైడుకి పో అంటూ రోడ్డు మీద వెడుతున్న సామాన్య జనాన్ని అమర్యాదగా అదిలించటం. ప్రతివారికీ గన్మన్ ని ఇచ్చిన ప్రభుత్వాలు మనవి. గన్మన్ వుండటం ఒక స్టేటస్ సింబల్. ఇంకా పక్కన, వెనకాల కార్యకర్తలు తదితర అనుయాయులు. వీళ్ళు నాయకుడితో పాటు ఎక్కడికయినా వస్తే అక్కడ నిలబడున్న వారిని విసిరేసినట్లుగా భుజాలు పట్టుకుని మరీ పక్కకు తోసేయటం. ఇలా జరుగుతున్నది చూస్తూ కూడా చిద్విలాసంగా నవ్వులు చిందుస్తూ వచ్చే నాయకుల్ని చూసాను కొన్నిచోట్ల. ఇలా ప్రవర్తిస్తున్న తన మనుష్యుల్ని కనీసం వారించినట్లు కూడా కనిపించరు ఈ నాయకులు
. కొంతకాలం క్రితం ఓ నాయకుడి కొడుకు పెళ్ళికి వెళ్ళాను. ముహూర్తం టైముకి అక్కడికి ఆ పార్టీ యువరాజు గారు వచ్చాడు. పెళ్ళి హాలులోకి రావటమే గుంపులకొద్దీ పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తుండగా మహా ఆర్భాటంగా ప్రవేశించాడు. పెళ్ళికి వచ్చాడా, పార్టీ సమావేశానికి వచ్చాడా? పెళ్ళి మణ్డపాన్ని పూర్తిగా కమ్మేసారు. ఈ ఆర్భాటం వల్ల తతిమ్మా ఆహూతులు పెళ్ళి కార్యక్రమం సరిగ్గా చూడ్డానికి కూడా వీల్లేకపోయింది.
విళ్ళా మారువేషంలో జనాల మధ్య తిరిగేది? దారి తప్పిన దేశం ఇది.