రాత్రే మా వాడికి చెప్పాను ఉదయమే శాస్త్రి
గారింట్లో పెళ్లి, డ్రైవర్ కు చెప్పమని.
పొద్దున్నే లేచి ఛానల్లో ఉదయ సంకీర్తన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి డ్రైవర్
రెడీగా వున్నాడు. అల్పాహారం ముగించుకుని కారెక్కాను. మాదాపూర్ నుంచి మల్లాపూర్
వెళ్ళాలి. చాలా దూరం. అందుకే ముందుగా బయలుదేరాను. కార్లో చదువుదామని సిటీ ఎడిషన్
పేపర్లు పెట్టుకున్నాను. మెయిన్ ఎడిషన్
టీవీ ఛానల్లోనే అయిపోతుంది. చాలా దూరం వెళ్ళిన తరువాత 'ఫోటో వార్త' కనిపించింది.
"నాచారంలోని నామా ఫంక్షన్ హాల్లో గురువారం
జరిగిన ఆంద్ర భూమి ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి కుమార్తె తన్మయి, దిలీప్ కుమార్
వివాహానికి హాజరయిన ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకరరావు"
మళ్ళీ చదివినా అదే వార్త. పైగా ఫోటో. మరి నేను
బయలుదేరింది, ముందుగా ఏర్పాట్లు చేసుకున్నది అప్పటికే అయిపోయిందన్న మాట.
తిరుగు టపాలో ఇంటికి చేరిన నన్ను చూసి మా ఆవిడ ఒకే
నవ్వు.
నేనూ నవ్వు కలిపాను
ఏడవలేక.
ఒక రోజు లేటుగా బయల్దేరారన్న మాట,బాగుంది!
రిప్లయితొలగించండిరైల్వే వారి టైమింగ్సు ఫాలో అవుతున్నట్టున్నారు?