మా రెండో బావగారు
కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు.
కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది.
స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా
పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు
గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద
వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఓరోజు బంధువుల ఇంట్లో
జరిగిన కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే
రామచంద్ర రావుగారి కుమారుడు కొలిపాక రాంబాబు ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి
ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం
వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో
మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము.
టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి
మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా
వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే
జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని
లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం
ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో
మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'
(ఫోటోలో మా బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు)
విచారం కలిగించే భావన.
రిప్లయితొలగించండివ్యాఖ్యలకి వర్డ్ వెరిఫికేషన్ తీసేసినందుకు సంతోషం. వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ Vinnakota Nnarasimharao garu - Thanks. But I dont know how the word verification was removed.
రిప్లయితొలగించండిఅదేమిటీ, మరి ఇక్కడ నేను ఇంతకు ముందే వ్రాసిన పై రెండు వ్యాఖ్యలకీ వర్డ్ వెరిఫికేషన్ అడగలేదే? దాన్నిబట్టి "ఎటు పోయాయి ఆ రోజులు?" అనే మీ టపా క్రింద లక్కరాజు రావు గారు సూచించిన పద్ధతిలో మీరు కొత్త పోస్టులకి వర్డ్ వెరిఫికేషన్ తీశేసారనుకున్నాను.
రిప్లయితొలగించండికాని ఇప్పుడు మళ్ళా వ.వె. అడుగుతోంది. అంతా విష్ణుమాయ అన్నమాట :)
(నేను బ్లాగు రీడర్ని మాత్రమే, బ్లాగర్ని కాను. కనుక ఆ సాంకేతిక వివరాలు నాకు తెలియవు)
రిప్లయితొలగించండినెహ్రూ గారు మళ్ళీ పుట్టేరు !!
జిలేబి
@విన్న కోట వారు,
మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఈ బ్లాగు కి వచ్చి ఉంటె, వరడు వెరిఫికేషన్ అడగడు ! అలా కాకుంటే లాగిన్ కాకుండా ఈ బ్లాగు కి వచ్చి ఉంటె వరడు వెరిఫికేషన్ బాక్సు కనబడును !!
అదియే కదా 'గూగుల్ వారి 'బిష్ణు' మాయ !!
జిలేబి
వివరణకి థాంక్సండి జిలేబీ గారూ. Very nice of you.
రిప్లయితొలగించండిఏమైనా శ్రీనివాసరావు గారు ఈ వ.వె. తొలగిస్తే బాగుంటుంది.
@జిలేబి - థాంక్సండీ - వర్డూ వెరిఫికేషన్ ఇవేవీ నాకు తెలవ్వు. దాన్ని తీసేయమని విన్నకోట వారు అడుగుతున్నారు. మీకన్ని విషయాలు తెలుసనిపిస్తోంది, మీ కామెంటు చూస్తే. కాబట్టి వ.వె. తీసేయడం గురించి ఓ సలహా పడేద్దురూ, పుణ్యం వుంటుంది. - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిclikck below link to remove word verification
రిప్లయితొలగించండిhttps://support.google.com/blogger/answer/42520?hl=en
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిSrinivasa Rao gaaru,
రిప్లయితొలగించండిCheck these
http://www.markspcsolution.com/2013/03/blogger-comment-verification.html
https://www.indiblogger.in/forum/topic.php?id=10856
@Thanks narendar Reddy garu and Dilip garu - Bhandaru Srinivas rao
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిభండారు వారు,
'వరడు' వెరిఫికేషన్ ఎట్లా తీసి వేయవలె అనుటకు ఈ టపా చూడవలె !!
https://support.google.com/blogger/answer/42520?hl=en
జిలేబి