26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పిపీలికం


అధికారం, హోదా, చదువు, డబ్బు, బ్యాంక్ బాలన్సులు ఇవి వ్యక్తుల స్తితిగతులకు కొలమానాలు కావచ్చు. కానీ అవేవీ వారిని ఈ ప్రపంచంలో పెద్దవారిని చేయలేవు. నిజానికి మనం యెంత చిన్నవాళ్ళమో, ఒకరకంగా చెప్పాలంటే పిపీలికాలమో తెలుసుకోవడానికి ఓ చిన్న చిట్కా వుంది. ఆకాశం నిర్మలంగా వున్న రాత్రి డాబా మీద వెల్లకిలా పండుకుని పైకి చూడండి. వేల కోట్ల మైళ్ళ దూరంలో వున్న నక్షత్రాలు మిణుకుమిణుకు మంటూ కానవస్తాయి. వాస్తవానికి అవి యెంత పెద్దవో ఈరోజుల్లో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి కూడా తెలుసు. 


గగనాంతర రోదసిలో, అనంత  నక్షత్ర రాశుల నడుమ,  మనం వున్న ఈ సమస్త భూ మండలమే ఓ పిపీలికం. ఆ భూమండలంలోని ఒక దేశంలో, ఆ దేశంలోని ఓ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలోని ఓ నగరంలో, ఆ నగరంలోని ఓ ప్రాంతంలో, ఆ ప్రాంతంలోని ఓ నివాసంలో, ఆ నివాసంలోని డాబాపై పడుకుని పైకి చూస్తున్న మనం  పిపీలికాలమా, లేక అంత కంటే చిన్నవాళ్ళమా?

NOTE: COURTESY IMAGE OWNER

2 కామెంట్‌లు:

  1. మీరు చెప్పిన కొలమానం ప్రకారం ఐతే -
    పిపిళికం అబ్బో చాలా పెద్దజంతువు.

    మనం నానోమీటర్లపరిమాణంలో ఉండే చిన్నచిన వైరస్‍ల వంటి వాళ్ళం అన్నమాట!

    రిప్లయితొలగించండి
  2. @ శ్యామలీయం - నా ఉద్దేశ్యం, ఎంతో గొప్పవాళ్ళం అనుకునే మనుషులు నిజానికి ఎంతటి అల్పులో తెలియచేయాలని మాత్రమె.

    రిప్లయితొలగించండి