ఎక్కడో చదివినట్టు, ఏదో
సినిమాలో చూసినట్టు అనిపించే ఓ కధ ఇది.
అనగనగా ఓ అమ్మడు.
పొద్దున్న బెంగళూరు వెళ్ళి ఆఫీసు పనిచూసుకుని సాయంత్రానికల్లా
హైదరాబాదు తిరిగొద్దామని శంషాబాదు ఎయిర్ పోర్ట్ కు
వెళ్ళింది. కాస్త వ్యవధానం వుండడంతో ఓ ఇంగ్లీష్ నవలను,
దాంతో పాటే ఓ బిస్కెట్ ప్యాకెట్టును కొనుక్కుని వెయిటింగ్
హాలు కుర్చీలో తీరుబడిగా చేరగిలపడి పుస్తకం చదువుతూ ఒక్కో బిస్కెట్ తీసుకుని
నోట్లో వేసుకుంటున్నతరుణంలో ఆ అమ్మడికి వున్నట్టుండి ఓ అనుమానం పొడసూపింది. పక్కన
కూర్చున్న కుర్రాడు కూడా తాపీగా తన ప్యాకెట్ నుంచే ఒక్కో బిస్కెట్టు
తీసుకుని తింటున్నట్టు అనిపించి అతడివైపు తేరిపార చూసింది. అతగాడు ఆమెను, ఆమె
చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్యాకెట్ లోనుంచి బిస్కెట్లు తీసుకుని
తింటూ చదువుతున్న పేపరులో మునిగిపోయాడు. అలా
ఇతరుల ప్యాకేట్ నుంచి తింటూ కూడా ఏమీ తెలియని నంగనాచిలా పేపరు
చదువుకుంటున్న అతడి తరహా చూసి ఆమెకు చిరాకేసింది.
మొహం మీదే కడిగేయాలన్నంత కోపం వచ్చినా సభ్యతకోసం పైకి ఏమీ అనకుండా మిగిలిన
ప్యాకెట్ ను అక్కడే వొదిలేసి, చరచరా
అడుగులు వేసుకుంటూ వెళ్ళి బెంగుళూరు విమానం
ఎక్కి తన సీట్లో సర్దుకుని కూర్చుంది. రీడింగ్ గ్లాసులకోసం హ్యాండ్ బ్యాగు
ఓపెన్ చేస్తే ఓపెన్ చెయ్యని బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. అప్పుడు కాని ఆమెకు
జరిగిన పొరబాటు అర్ధం కాలేదు. నిజానికి తానే అతడి ప్యాకెట్ లోనుంచి బిస్కట్లు
తీసుకున్న సంగతి తెలిసివచ్చి ‘అయ్యో ఇంకా ఏదన్నా మాట
తూలాను కాదు’ అని మధనపడింది.
ప్రతికధకు ఏదో ఒక నీతి
వున్నట్టే ఈ కధనుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా వుంది.
జీవితంలో వెనక్కు
తీసుకోలేని విషయాలు మూడు వున్నాయి. అవేమిటంటే:
1.
రాయి : ఒకసారి విసిరితే దాన్ని మల్ళీ వెనక్కు
తీసుకోవడం కష్టం.
2.
మాట : ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.
3.
కాలం : క్షణం గడిచిందంటే అది
శాశ్వితంగా గతంలో కలసిపోయినట్టే.
ఇంకా ఇలాటివి
మరికొన్ని వుండవచ్చు. నేర్చుకునే తీరిక వుండాలే కాని జీవితమే ఈ మాదిరి నీతి
పాఠాలను నేర్పుతుంది.
ఈ సీను శెఖర్ కమ్ముల గొదావరి సినిమా లొ వుంది:-)
రిప్లయితొలగించండి@అజ్ఞాత : మొదట్లోనే మనవి చేసాను. ;ఎక్కడో విన్నట్టు, ఏదో సినిమాలో చూసినట్టు ...'
రిప్లయితొలగించండి