(ఇంతవరకు ఈ రచన చదవనివారి కోసం)
జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం
చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు. గ్రంధ ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకూ
జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే- ఇంచుమించు రెండున్నర దశాబ్దాల క్రితం -
మాస్కోలో గడిపివచ్చిన సుమారు అయిదేళ్ళ అనుభవాలను
అక్షర బద్దం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.
ఏకధృవ ప్రపంచ వ్యవస్థను ప్రశ్నిస్తూ- లెనిన్ నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ- ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ యూనియన్' కమ్యూనిస్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం.
ఆ నాడు నేను చూసింది మరో ప్రపంచం.
అప్పటికీ యిప్పటికీ యెంతో తేడా.
రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి
వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు
పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన 'స్వర్ణ యుగాలు' చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే -
ఆ నాటి నా అనుభవాలు కూడా.
ఏకధృవ ప్రపంచ వ్యవస్థను ప్రశ్నిస్తూ- లెనిన్ నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ- ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ యూనియన్' కమ్యూనిస్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం.
ఆ నాడు నేను చూసింది మరో ప్రపంచం.
అప్పటికీ యిప్పటికీ యెంతో తేడా.
మాస్కో అనుభవాలు గురించి నేను రాసిన 'మార్పు చూసిన కళ్ళు' పుస్తకాన్ని తమిళనాడు గవర్నర్ శ్రీ కె.రోశయ్య ఆవిష్కరించిన సందర్భంలో వార్తా కధనం)
నేను కమ్యూనిష్టుని కాను. వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో
అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ ఏ రకమయిన రాజకీయ
వాసనలను నేను వొంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలు మోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం'
నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం. నేనూ, నా భార్యా పిల్లలూ -
అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన
రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం
చెప్పినా గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించకత ప్పదు. అందుకే 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతొ నా అనుభవాలను అక్షరబద్ధం చేయడానికి ఇంతగా
తటపటాయించాల్సివచ్చింది.
అంతేకాదు. కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం. తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది. విషయానికి న్యాయం చేయలేకపోతున్నామేమో అన్న సంశయం మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
( రష్యన్ లో 'దస్వి దానియా' అంటే 'మళ్ళీ కలుద్దాం' అని అర్ధం.)

మీరు పాతికేళ్ళ క్రితం మాస్కో పున:ప్రచురిస్తున్నందుకు ధన్యవాదాలు. లేబుళ్ళకు నామకరణం చేసేప్పుడు, పాతికేళ్ళ క్రితం మాస్కో అని మాత్రమే ఈ సిరీస్ లో వ్రాసే అన్ని వ్యాసాలకు (పేరాలకు) పేరు ఇవ్వండి. అప్పుడు అన్ని ఒక్క సారే చదువుకుందామనుకునేవాళ్ళు, ఆ లేబుల్ నొక్కితే మీరు ఆ లేబుల్ కింద వ్రాసిన వ్యాసాలన్నీ ఒక వరుసలో వచ్చి ఒకదాని తరువాత మరొకటి చదువుకునే సౌకర్యం కలుగుతుంది. మీరు ఈ విషయంలో వ్రాసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, హాయిగా అది కొనుక్కుని ఒక్కసారిగా చదువుకోవచ్చు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శివరామకృష్ణ గారు. విశాలాంధ్ర ప్రచురణాలయంలో.
రిప్లయితొలగించండి