7, డిసెంబర్ 2013, శనివారం

కలగంటి కలగంటి



'నిన్న కలలో ఒక పెద్ద తప్పు చేసాను"
 ఏకాంబరం  తన మిత్రుడితో బాధ పడుతూ చెప్పాడు. 
'కలలో తప్పు చేసావా? అదెలా!' ఆశ్చర్యపోతూ అడిగాడు స్నేహితుడు.
'కలకంటూ స్వర్గానికి  వెళ్లాను. ఇంద్రుడు  తన  చేతులతో స్వయంగా నాకు తేనీరు కలిపి తీసుకువచ్చారు.
ఇలాగే తాగుతావా? వేడి చేసి తీసుకురానా’ అని అడిగారు.
‘నేనలాగే తాగి ఉండవచ్చుకదా. కానీ వేడిచేసి తెమ్మన్నా’ను.
‘ఆయన వెచ్చబెట్టి తెచ్చేలోగా మెలకువ వచ్చేసింది.'
బాధ పడ్డాడు ఏకాంబరం.
చాలామంది ఇంతే.
కలలోకూడా తమ గుణం మార్చుకోరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి