అంజయ్య గారిని మార్చాలని
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి
ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ
జ్వాలా కలసి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్
లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు బాగా పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ
లేదు. మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు
వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ,
ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి
వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో
కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో
నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని
నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు
ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ
గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ
గడ్డ”.
ఓక సత్తా గల ముఖ్య మంత్రి ని మనం ఇక చూడ గలమా ??
రిప్లయితొలగించండిsweet. యాదగిరి గారితో కొద్ది కాలం కలిసి పని చేశాను. పాతకాలపు అసెంబ్లీ కబుర్లు చెబుతుండెవారు.
రిప్లయితొలగించండి