ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు,కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు.ఇంటర్వ్యూ రోజున విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి, అభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.
తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు : ("నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని... ) విశ్వనాథ సత్యనారాయణ.
తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) “నేనేం కావ్యాలువ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంతకాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను” ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)
తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం దురదృష్టం
చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ
కొసమెరుపు :
విశ్వనాథ వారు ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇదినిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం –
“ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడాఅభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు."
ఆయన ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.
సేకరణ: ఆచార్య ఫణీంద్ర
నేను ఉస్మానియా లో చదవు కున్నాను... దివాకర్ల . నారయణ రెడ్డి గారు, రామరాజు గారు మా గురువులు.... ఈ సేకరణ సత్య దూరం... విజయవాడ లో సత్యనారయణ గారు SRR colleage లో పందితలు....ఇది ఒక కల్పితం...
రిప్లయితొలగించండినేను ఉస్మానియా లో చదవు కున్నాను... దివాకర్ల . నారయణ రెడ్డి గారు, రామరాజు గారు మా గురువులు.... ఈ సేకరణ సత్య దూరం... విజయవాడ లో సత్యనారయణ గారు SRR colleage లో పందితలు....ఇది ఒక కల్పితం...
రిప్లయితొలగించండిఅవును కల్పితమే కావచ్చు. విశ్వనాథ వారు విజయవాద యస్.ఆర్.ఆర్ లో పని చేసారు. యన్.టి.రామారావు ఆయన స్తూడెంట్.
రిప్లయితొలగించండి