25, జులై 2013, గురువారం

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా?


ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు – నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు  గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.
సంపుటం - 43  సంచిక - 4  బుధవారం   4-4-1956   6 పేజీలు  1 అణా
‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి   
కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం
అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన
(ఆంధ్ర పత్రిక ప్రతినిధి)
కర్నూలు, ఏప్రిల్ 3
‘ఆంధ్ర ప్రదేశ్’ అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర – తెలంగాణా నాయకులు తీర్మానించారు.
ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.
ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో –ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.
నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.
హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్’ అని కానీ, ‘తెలంగాణా’ అని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.
ఆంధ్ర లో దోషం లేదు
తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా – ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.
‘ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం – ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే – ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు’
చివరికి ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
ముస్లిం అవసరాలు
సమావేశానికి ముందు హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు ‘ఆంధ్ర పత్రిక’ ప్రతినిధితో ప్రసంగిస్తూ – ‘తెలంగాణా’ అనే పేరు రెవిన్యూ అవసరాలకోసం ముస్లిం పరిపాలకులు వ్యవహారం లోనికి తెచ్చినదన్నారు. ‘ఆంధ్ర ప్రదేశ్’ అనే పేరే అందరికీ సమ్మతం కాగలదన్నారు.
(విషయసేకరణకు తోడ్పడిన అనేకమందికి ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు,

13 కామెంట్‌లు:

  1. అలాంటి పరిస్థితి వస్తే మీ పేరు మార్చుకుంటారా ?
    ఐతరేయం అయినా భండారీయం అయినా మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చినవే. ఒకసారి అస్తిత్వం అంటూ వచ్చాక మరుగున పడేస్తే ఇలాగే అవుతుంది. విప్లవం పుట్టక తప్పదు.

    రిప్లయితొలగించండి
  2. కాయ గారు,
    మీ logic ప్రకారం...
    ఆంధ్రప్రదేశ్ కి కూడా అర్థ శతాబ్దం పైబడిన అస్తిత్వం ఉందిగదా. మరి దాన్ని మరుగునపడేస్తే, మరో విప్లవం పుట్టక తప్పదంటారా?

    రిప్లయితొలగించండి
  3. @కాయ - (ఈ వాక్యం వ్యాసంలో వుంది) రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో 'మరో రకం ఆలోచనకు' తావివ్వరాదని నా అభ్యర్ధన.- భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  4. అమర్:
    తప్పకుండా..నిజంగా ఆంధ్రోళ్ళకి, తెలంగాణ వాళ్ళకి పెళ్ళిల్లు జరగటం కానీ, వీళ్ళు వాళ్ళు ఏ భేషజాలు లేకుండా కలిసి మెలిసి జీవించటం కాని జరిగి ఉంటే తప్పక విప్లవం వస్తుంది.. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వట్టి అతుకుల బొంత. కలసి ఉన్నప్పుడు కాపురం చేయని వాళ్ళు విడిపోయాక విప్లవం తెస్తారా.. ?.. ఎంత గుడ్డి కాన్సెప్ట్ అయినా మరీ ఇంతగా ఫిక్షన్ లని నిజాలుగా నమ్మొద్దండి.. ఆంధ్ర ప్రదేశ్ ఒక అబద్దం.

    రిప్లయితొలగించండి
  5. భండారి గారు: తప్పకుండా.. 1956 కు -4056 కు సంబంధం ఏమిటండి.. నిజంగా అదే అయి ఉంటే తప్పక తెలంగాణ ఇవ్వాల్సిందే..

    రిప్లయితొలగించండి
  6. మీ పోస్ట్ లో మేటర్ క్లియర్ గా వున్నా మధ్యలో ఈ కాయ(కి) గోల ఏవిటో ఒక్క అక్షరం అర్ధం అయితే ఒట్టు..

    రిప్లయితొలగించండి
  7. మీ పోస్ట్ లో మేటర్ క్లియర్ గా వున్నా మధ్యలో ఈ కాయ(కి) గోల ఏవిటో ఒక్క అక్షరం అర్ధం అయితే ఒట్టు..

    రిప్లయితొలగించండి
  8. ఇదే తలతిక్క తర్కంతో ప్రస్తుత సమస్యకు ఒక అందమయిన పరిష్కారం ఇదిగో:

    1. పది జిల్లాలతో ఏర్పడే తెలంగాణా రాష్ట్రాన్ని వేరే పేరు (ఉ. అంబేద్కర్ ప్రదేశ్) పెడదాం
    2. మిగిలిన పదమూడు జిల్లాలకు సమైక్యాంధ్ర అనే పేరు పెట్టుకుందాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వారి కోరిక ఇలా నెరవేరుతుంది
    3. హైదరాబాద్ మీద మాకు హక్కులు ఉన్నాయంటూ వాపోయే వారిని సంతోషపరచడానికి "సమైక్యాంధ్ర" రాష్ట్రానికి రాజధాని అయిన కర్నూల్ పేరును హైదరాబాద్ చేద్దాం
    4. ఎ కాంపుకు జూబిలీ హిల్స్, బీ కాంపుకు పంజగుట్ట, సి కాంపుకు కూకట్పల్లి అని పేర్లు మారుద్దాం
    5. కొండారెడ్డి బురుజును గోల్కొండ అని పిలుద్దాం
    6. జిన్నా టవర్ పేరు మార్చి చార్మినార్ అనేద్దాం

    I know these look ridiculous but it fits well with the frivolity of the blog post.

    రిప్లయితొలగించండి
  9. అబ్బ అబ్బ అబ్బ గొత్తి ముక్కల గారు అధ్భుతంగా చెప్పారు
    మొదటి పాయింట్ ఒక్కటి తప్ప మిగతావన్ని జయహూ

    రిప్లయితొలగించండి
  10. Jai,
    I don't understand why you would see the author's post as frivolous. He didn't share any of his opinions, neither did he draw any conclusions. As I see it, it was just a reproduction of a news article from a certain time in the past. The way he left it, it's up to the readers to draw their own conclusions. I guess it's a mute point by now, that there is hardly anyone that hasn't made up his/her mind on the issue.

    రిప్లయితొలగించండి
  11. @Amar:

    The blogger finds only semantics in the movement. His contention is that naming AP as Telangana in 1956 would have met the aspirations for the state of Telangana.

    If this is not trivialization, I don't know what is.

    I know this is claimed to be an article from a past Andhra paper. Therefore I guess the charge of trivialization is better laid at the past Andhra "journalist".

    The chances of the blogger finding "just this one article" among the hundreds of more serious ones (including anti-Telangana stories) is near zero.

    Gandhi is said to have said: "First they ignore you, then they laugh at you, then they fight you, then you win".

    This blogger is trying to bring the debate to stage # 2 when the truth is at # 3.

    రిప్లయితొలగించండి
  12. Jai,

    I disagree. I see that the post highlighted the role semantics played in the decision making process of naming the unified state. I don’t see how anyone could reasonably derive from the post that the blogger reduced the movement to just semantics.

    Same thing goes for the Andhra paper and Andhra journalist. If you are saying the purpose of the original article was to trivialize any movement then or now, you are stretching your imagination too much. I think it is genuinely newsworthy to report and to record for history what transpired.

    I am sure you would agree with me if you give it an agnostic consideration.

    రిప్లయితొలగించండి
  13. @Edge:

    Semantics may have played a part in the naming of the state. But the alternate name suggested (and not finalized) was Ändhra-Telangana", not "Telangana".

    రిప్లయితొలగించండి