లయ సుమాలు
లయ సుమాలు
దీపము
వలసిందెప్పుడు
తిమిరమునందే
విజ్ఞాని ముందు
నిలచిన
అజ్ఞాని నోరు బందే
కలలు పొర్లు కనులు
నడుపు
కాలు ముళ్లమీదే
తలలు మార్చువాని
సలహా
మంచికెపుడు కాదే
ఇత్తడి బంగారమనే
వానిదె ఈ లోకం
పుత్తడి పూర్ణల బ్రతుకె
రిత్త కడుపు శోకం
-కీర్తిశేషులు భండారు
పర్వతాలరావు (ఫిబ్రవరి,1956)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి