ఔనంటారా! కాదంటారా!
మట్టే బంగారం అనుకునే ఖరీదయిన చోట్ల కోట్లు
పోసి కట్టిన లంకంత కొంప
కానీ కాపురం వుండేది మాత్రం లింగూ లిటుకూ మంటూ ఓ ముసలి జంట
రెక్కలొచ్చిన పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఎక్కడో, సుదూరంగా ఏ దేశంలోనో –
‘అమ్మా నాన్నా ఓ పనమ్మాయి’
ఏదయినా సినిమా టైటిల్ గుర్తొస్తోందా!
బియ్యేలు, ఎమ్మేల
కాలం కాలగర్భంలో కలసిపోతోంది. అంతూ పొంతూ లేని చదువులు అంగట్లో అమ్మకానికి
సిద్ధం.
కానీ ఏం లాభం?
చదవేస్తే వున్న మతి పోయినట్టు పేరుకు పక్కన
డిగ్రీలే కానీ మెదడులో అసలు జ్ఞానం సున్నా.
బతుక్కు పనికొచ్చే పరిజ్ఞానం మొత్తంగా గుండు సున్నా.
ఎక్కడ చూసినా రమ్యహర్మ్యాలను తలదన్నే కార్పొరేట్
ఆస్పత్రులు.
పెరిగిపోతున్న జబ్బులకు కొత్త పేర్లు పెట్టి
డబ్బులు గుంజడం మినహా నాడి చూసి వైద్యం చేయగల నాధులే లేరు.
నెల జీతాలు అయిదంకెల్లో.
మనశ్శాంతి మాత్రం అధః పాతాళంలో.
చంద్రుడి మీద కాలుమోపడం తెలుసు. పక్కింటి వాడు మాత్రం పరాయి మనిషి. ఎవడి
బాగోగులు వాడివే. ఎవడి గోల వాడిదే.
పుట్టుకతోనే పుట్టుకొస్తున్న తెలివితేటలు అనన్యం.
స్పందించే హృదయమే శూన్యం.
దేనికీ కొరతలేని జీవితాలు.
కానీ జీవితాలే
వెలిసిపోతున్న రంగు కాగితాలు.
ఇవే ఈ నాటి నూతన జీవన సత్యాలు. (18-08-2012)
బాగుంది...ఇవే నగ్న సత్యాలు...ఇవి చెప్పేవాళ్లు కరువయ్యారు...జ్వాల
రిప్లయితొలగించండిచెప్పేవాళ్ళూ కరువయ్యారు, చెబితే వినేవాళ్ళెవరు?
రిప్లయితొలగించండి@JWALA and @ Kastephale - THANKS
రిప్లయితొలగించండి