"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"
(మాజీ డీజీపీ
హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం నుంచి మరి కొన్ని భాగాలు)
“......ఎన్టీఆర్ కు
అసలు దేవుడన్నా, పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఏ వ్రతం కానీ, పూజలు కానీ జరగ్గా నేను చూడలేదు.
ఒక్క వేంకటేశ్వరస్వామి ఫోటో మినహా మరే దేవుడి ఫోటో ఆయన ఇంట్లో కనిపించేది కాదు.
తిరుమలకు తప్ప రాష్ట్రం లోని మరే ఇతర దేవాలయానికి ఆయన వెళ్లగా చూడలేదు......
“.......పూజలు
పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా, ఎన్టీఆర్ జ్యోతిష్యాన్ని, వాస్తుని
మాత్రం బాగా నమ్మేవారు. ఎవరయినా జ్యోతిష్కుడు వచ్చి పలానా రాయి వున్న వుంగరం
పెట్టుకొమ్మని చెబితే దాన్ని తు చ తప్పకుండా పాటించేవారు. అలా ఆయన చేతి వేళ్లకి
ఏడెనిమిది ఉంగరాలు వచ్చి చేరాయి.......
“..... సినిమా
షూటింగులకి బయట వూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద హోటళ్ళలో బస చేసేవారు కాదు. హైదరాబాదు
వస్తే , సారధీ స్టూడియోలో ఓ మూల చిన్న గదిలో సర్దుకునేవారు. చిన్నపాటి పరుపు, ఓ
దిండు ఇస్తే చాలు, కింద వేసుకుని పడుకునేవారు.....
“.....ఎన్టీఆర్ కి
బాగా దగ్గరగా మసలిన వ్యక్తి బీవీ మోహనరెడ్డి. ఒకసారి దైవ దర్శనం కోసం ఎన్టీఆర్-
బీవీ తో కలసి తిరుపతి వెళ్లి వస్తున్నారు. వీళ్ళ కారు వెనకనే వస్తున్న వీఐపీ కారు
ఒకటి సైరన్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయిందట. ఆ వీఐపీ కారుకు అటూ ఇటూ మరికొన్ని కార్లు. ఈ హంగామాను ఎన్టీఆర్
ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు, బీవీ కలగచేసుకుని ‘మీ కారు కూడా ఎనభైలో ఇలాగే సైరన్,
పైలట్ హంగామాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇది తధ్యం అని జోస్యం చెప్పారట........
“......రామారావుది
మొదటి నుంచి ఒకటే ఫిలాసఫీ. ఏదయినా వ్యాపారం అంటూ చేస్తే సొంత డబ్బు పెట్టాలి. ప్రభుత్వ
రాయితీలు, ఉచిత స్తలాలు ఎందుకనే వారు. అక్కినేని నాగేశ్వరరావుకు స్టూడియో
నిర్మాణానికి (ప్రభుత్వం) ఉచితంగా ఇచ్చిన స్తలంలో వేరే వ్యాపారాలు చేయడం ఎన్టీఆర్
కి నచ్చలేదు. ‘వారికి నోటీసులు పంపండి. ఏం పర్వాలేదు’ అని ఆదేశాలిచ్చారాయన......
“.......తన సినీ
జీవితం తొలినాళ్ళలో ఆత్మాభిమానం మెండుగా వున్న ఈ నిండు మనిషి, ఒకసారి నడుచుకుంటూ
షూటింగుకు వెళ్లడం చూసి ఆ సినిమా నిర్మాత ఆయనకు ఒక కొత్త కారు కొని ఇంటికి పంపారట.
ఆ రోజుల్లో కొత్త కారు ఖరీదు పదిహేను వందల రూపాయలు. తరువాత తనకు డబ్బు సమకూరాక
నందమూరి ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కారు డబ్బులు తిరిగి ఇచ్చేశారట......
ఎమ్జీఆర్ (అప్పట్లో
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్ ) ఢిల్లీ వెళ్ళే సందర్భాలలో ఆయన విమానం
హైదరాబాదులో నలభై అయిదు నిమిషాల పాటు ఆగేది. ఎన్టీఆర్ టిఫిన్ క్యారియర్ పట్టుకుని నేరుగా బేగం పేట
ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళేవారు. అక్కడ తన మద్రాసు మిత్రుడితో కాసేపు ఆప్యాయంగా
కబుర్లు చెప్పేవారు. ఇలా చాలా సార్లు జరిగింది.......(21-12-2011)
""ఎన్టీఆర్ ని చాలా దగ్గ్గర గా గమని౦చిన వాళ్ళు చాలా మ౦ది ఇదే విషయ౦ చెప్పారు...
రిప్లయితొలగించండి@Kodad -Thanks
రిప్లయితొలగించండి"పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు"
రిప్లయితొలగించండిThis statement is ambiguous. Please explain further.
@అజ్ఞాత -"This statement is ambiguous. Please explain furthur" అని అడిగారు. ఆ స్టేట్ మెంట్ నాది కాదు. ఆ పుస్తకం రాసిన రచయితది. పూర్తిగా కాకపోయినా కొద్దిగానయినా నా బ్లాగు చదవండి ప్లీజ్.ఇటువంటి అనుమానాలు రావు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిI don't believe NTR returns money back...
రిప్లయితొలగించండి@అజ్ఞాత - "I dont believe NTR returns money back" అని రాసిన అజ్ఞాత గారికి -నిర్మాతకు కారు డబ్బు వాపసు చేసినట్టు రాసింది ఎన్టీఆర్ తో బాగా పరిచయం వున్న మాజీ డీజీపీ దొర గారు.
రిప్లయితొలగించండిannagaaraa, majaakaanaa... egoistic,selfrespect personality.
రిప్లయితొలగించండిNTR devudini baabaalani pichigaa namamdu ani.......kshudra poojalu chese manstatvam asalu kaadani......ayanaki dagagar gaa vunna vaallu chaala mandhi chepaaru.....Innayya gaari blog lo choodandi kaavlante....
రిప్లయితొలగించండిJotishyaalanu nammuthaadani NTR swayangaane cheppukonatlunaadu appatlo.....
Very nice information, Sir. Thanks
రిప్లయితొలగించండి@భాస్కరరామిరెడ్డి,వర,కృష్ణ A -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిNTR ఓ మూర్ఖ అహంభావి, పిసినారి అని విన్నాను.
రిప్లయితొలగించండిజీవితకథల బుక్కులు రాసేవాళ్ళు తిడుతూ రాస్తే పరువునష్టాలు, అభిమానుల, పార్టీల దాడులు ఎదుర్కోవాల్సివుంటుంది. నాలుగు మంచి మాటలు రాస్తే ప్రభ్త్వ స్థలాలు, కాంట్రాక్టులో దొరుకుతాయేమో. :)
కృష్ణా గుంటూరు జిల్లా కమ్మవాళ్ళకు దేవుడిపై అంతగా నమ్మకం ఉండదు. అదంతా త్రిపురనేని రామస్వామి చౌధరి నిర్వహించిన నాస్తికవాదం పుణ్యమే. బహుశా అదే రామారావుని రామోజీరావుకి దగ్గరచేసి ఉంటుంది. పైగా వీళ్ళందరిదీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం. NTR పాలనలో బ్రాహ్మనులు చాలా కష్టాలు పడ్డారు. అందుకే ఎన్‌టీఆర్ తన చివరి రోజుల్లో దీనికి ప్రతిఫలం అనుభవించాడు.
రిప్లయితొలగించండిసరేపోయింది!! ఎవరికి ఏంముంచుకొచ్చినా ఆఖరుకి జ్వరంవచ్చినా "ప్రతిఫలం అనుభవించాడు" అని చెప్పడానికి ఇలాంతివాళ్ళు తయారుగా ఉంటారు. రోగాలు వృధ్ధాప్యంలో రావడం సహజం. అంతేకానీ అదేదో అద్భుతశక్తి ప్రభావంకాదు. ఒకవేళ ఏమీ "అనుభవించకపోతే", పూర్వజన్మలో చేసిన పుణ్యం కాన్సెప్టు ఎలాగూ ఉంటుంది. ఇంత రెండునాల్కలవాదం బహుశా మరికటి ఉండదేమో!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరి అయన ధరించిన రుద్రాక్షలూ కేవలం అలంకారం కోసమనా దొర అభిప్రాయం?..పౌరాణికాలు చేసే సమయాల్లో అయన మాంసాహారాన్ని త్యజించడం కూడా నాస్తిక వాదమేనా ?దొర గారు ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఇస్తే సరైన రచయుత లేకుంటే ఆ పుస్తకాన్ని తన కి-ఆయనకు పబ్లిసిటీ కోసం రాసుకున్ట లెక్కా.
రిప్లయితొలగించండినిజాలు నిప్పులా ఉంటాయి అందుకే నెమో భండారు వారు నేను పెట్టిన సేన్షేనల్ వ్యాఖ్యను వెంటనే తొలగించారు..ఈ పోస్ట్ లో తొలి వ్యాఖ్య నాదే సుమా...
రిప్లయితొలగించండి@ astrojoid - మీకు నా కంప్యూటర్ పరిజ్ఞానం మీద చాలా నమ్మకం వున్నట్టుంది. వ్యాఖ్యలు తొలగించడం లాటివి నేను ఇంకా నేర్చుకోలేదు.నమ్మినా నమ్మకునా ఇది పచ్చి నిజం. అసలింతకీ మీ పేరు తెలుగులో యెలా రాయాలి -ఇదో సందేహం.
రిప్లయితొలగించండిఆస్ట్రోజోయ్ఎడ్...
రిప్లయితొలగించండిరామారావుగారు ఎవరికైనా డబ్బు తిరిగిచ్చారంటే నమ్మడం చాలా కష్టం. వారు ఔదార్యమనేది మచ్చుకైనా కలికానికైనా లేని, దాని స్పెలింగే తెలియని మనిషి. (లేని/ తెలియని మనుషులు).
రిప్లయితొలగించండి@అజ్ఞాత "వీళ్ళందరిదీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం. NTR పాలనలో బ్రాహ్మనులు చాలా కష్టాలు పడ్డారు" -
రిప్లయితొలగించండిబహుశా ఈ విషయం శ్యామలీయం, విన్నకోట నరసింహారావు గార్ల లాంటి వారు బయటికి ఒప్పుకోరేమో! ఎందుకంటే మొత్తం తెలిసిన విజ్ఞులు వారు. ఒకవేళ తెలిసి కూడా తెలుగుదేశాన్నే సమర్ధిస్తున్నారంటే అది కేవలం జగన్రెడ్డి క్రైస్తవ వాది అవడం మాత్రమే అయుండాలి. దీన్ని వారివురూ వ్యక్తిగత విమర్శగా తీసుకోకుండా సమర్ధనకు సహేతుక కారణాలు వివరిస్తే బాగుంటుంది. అజ్ఞాతలకు చెప్పాల్సిన అవసరం లేదు అనేది జబాబు గనుక అయినట్లయితే - క్షమించగలరు.
అజ్ఞాత 20 జూన్, 2021 5:14 AM గారు,
రిప్లయితొలగించండిఉరుము ఉరిమి మంగలం మీద పడిందనే సామెత లాగా ఉంది।
NTR గారి మీద పుస్తకం వ్రాసిన దొర గారు బాగానే ఉన్నారు, ఆ పుస్తకంలో నుంచి ఈ అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేసిన ఈ బ్లాగ్ రచయిత భండారు వారు బాగానే ఉన్నారు, ఓ వెలుగు వెలిగిన NTR గారు పరలోకాల్లో ఎక్కడో బాగానే ఉండి ఉంటారు …. మధ్యలో నా మీద ఈ విసురు ఏమిటి?
NTR గారి బ్రాహ్మణ వ్యతిరేకత ఏపీలో జనాలకు విదితమే … ఆయన పాలనలో వేలాది బ్రాహ్మణ గ్రామోద్యోగులు వీధిన పడ్డారని కూడా తెలిసినదే … ఈ రోజు కొత్తగా కనిపెట్టేదేమీ లేదు. సదరు వ్యతిరేకత వారికి జన్మతః వచ్చిందా, ఆనాటి కొందరు ప్రముఖుల ప్రభావమా … ఏదైతేనేం.
ఇక ఫలానా పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారు అన్న ప్రశ్న. నేను ఏ పార్టీకి గానీ, ఏ సామాజిక వర్గానికి గానీ అభిమానిని కాదు అని స్పష్టం చేస్తున్నాను. దీంట్లో మీరు ప్రస్తావించిన మతం ప్రసక్తికి తావు లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. మీకా అభిప్రాయం ఎందుకు కలిగిందో నాకు తెలియదు, తెలుసుకోవాలనే కుతూహలమూ లేదు.
చివరగా … నన్ను “మొత్తం తెలిసిన విజ్ఞులు” అనే కోవలో చేర్చినందుకు థాంక్స్. కానీ I am neither a విజ్ఞుడు nor మొత్తం తెలిసిన వాడు. ఏదో మిడిమిడి జ్ఞానం మాత్రమే.