ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 6 - భండారు శ్రీనివాసరావు
షరా 'మామూలు'
పండుగ మామూలేమో మనదగ్గర వసూలుచేసి
మనకొచ్చే ఉత్తరాలేమో ఎదురింట్లో ఇచ్చేసి
చక్కాపోయే పోస్ట్ మాన్ని చూసి
పుట్టుకురాదా వొళ్ళంతా కసి
(జూన్, 14, 1975, ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
పరీక్షిత్తులు
అర్ధరాత్రి దాకా నిద్దుర కాచి కాచి
చదివిన ఫలితం కోసం వేచి వేచి
పండయితే ఆనందం విరగపూచి
కాయయితే తలిదండ్రితో తప్పదు పేచి
(జూన్, 18, 1975, ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి