ఆనందమె జీవిత మకరందం
అందమే ఆనందం అని ఒకరంటే ఆనందమె జీవిత మకరందం అని మరొకరన్నారు.
ఆనందం అర్ణవమైతే ఇంకా కావాల్సింది ఏముంది అని కూడా ఇంకొకరన్నారు.
ఈ ఆనందాన్ని యెలా కోరుకోవాలి అన్నదానిపై ఈ మధ్య నెట్లో ఓ సూక్తి షికార్లు చేస్తోంది.
‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నారు కాబట్టి వింటే (చదివితే) ఓ పనయిపోతుంది.
ఆ ఇంగ్లీష్ సూక్తికి తెలుగు అనువాదం. అవధరించండి.
ఓ గంట సేపు ఆనందం కోరుకుంటే ఒక కునుకు తీయండి సరిపోతుంది.
కాదు కూడదు ఒక నెలపాటన్నా ఆనందం సొంతం కావాలనుకున్నారనుకోండి.
ఓ చక్కటి పిల్లను చూసి పెళ్లి చేసుకోండి ఆ కోరిక తీరిపోతుంది.
అలా ఇలా కాదు ‘జీవిత పర్యంతం’ ఆనందాన్ని అనుభవించాలని గట్టిగా అనుకుంటే మాత్రం అవసరంలో వున్న వారికి మీ చేతనయిన సాయం చేయండి. తద్వారా లభించే ఆనందం మాత్రం జీవితాంతం మీ వెంటే వుంటుంది.
కావాలంటే ప్రయత్నించి చూడండి!
(28-07-2011)
ఓ ఇలా చెప్పారా?
రిప్లయితొలగించండిఒక నెల పాటు ఆనందంగా ఎలా ఉండాలో చెప్పాక, జీవితాంతం ఆనందంగా ఉండడానికి, ప్రతి నెలా అదే పని చేయాలి కాబోలు అనుకున్నాను :) :)
$భండారు శ్రీనివాస రావు గారు
రిప్లయితొలగించండి#అలా ఇలా కాదు ‘జీవిత పర్యంతం’ ఆనందాన్ని అనుభవించాలని గట్టిగా అనుకుంటే మాత్రం అవసరంలో వున్న వారికి మీ చేతనయిన సాయం చేయండి. తద్వారా లభించే ఆనందం మాత్రం జీవితాంతం మీ వెంటే వుంటుంది.
మంచిమాట చెప్పారు. ధన్యవాదాలు. ఆచరణలో పెడుతున్నా!
$Rajesh Maram గారు
;))
@Rajesh Maram and @Rajesh G - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి