మొదటి పెళ్ళాం – రెండో కాపురం – భండారు శ్రీనివాసరావు
“వేరే ఆడదానితో అక్రమ సంబంధం వున్నట్టు భార్యకు తెలియనంత కాలం భర్తకు స్వర్గమే . తెలిసిన మరుక్షణం నుంచీ ప్రత్యక్ష నరకమే!” అన్నది దాని సారాంశం.
నేను జానకితో చనువుగా మసలుతున్న సంగతి తెలిసిన నా మిత్రుడు శంకరం- దేవరహస్యం పేరుతొ నాకీ హితబోధ చేసాడు. అయితే, జానకితో నేను సాగిస్తున్న వ్యవహారం గురించి మా ఆవిడకు తెలుసునని నాకు చాలాకాలం వరకూ తెలవదు. అయినా గుంభనగా వుండిపోయిందంటే శంకరం చెప్పిన సూత్రం అందరు భార్యలకు వర్తించదని అనుకోవాలి.
రోజులు గడుస్తున్నకొద్దీ జానకి నుంచి రోజురోజుకూ నామీద వొత్తిడి పెరిగిపోతోంది. ఇక ఆ పోరుపడలేక లాయరుతో మాట్లాడడం, ముగ్గురు పిల్లల తల్లి అని చూడకుండా మా ఆవిడకి విడాకుల నోటీసు ఇప్పించడం కూడా జరిగిపోయింది.
నోటీసు పంపిన రోజు నేను కావాలనే బారులో పీకలదాకా తాగి ఇంటికి బయలుదేరాను. జానకి పరిచయం అయిన తరవాత ఆలస్యంగా ఇంటికి చేరడం అన్నది అప్పటికే నాకు అలవాటుగా మారింది. ఆఫీసు నుంచి నేరుగా జానకి పనిచేసే చోటుకు వెళ్లడం, ఆమెను స్కూటర్ పై ఎక్కించుకుని వాళ్లింటికి వెళ్లి అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి చేరడం నాకు దినచర్యలో భాగమయిపోయింది. అదేమిటో, పెళ్ళాం పిల్లలున్న నేను ఇలా చేయడం తప్పని నాకు కానీ, జానకికి కానీ ఒక్కనాడూ అనిపించకపోవడం విచిత్రం.
మా ఆవిడ సీతతో నేను మాట్లాడాల్సిన తీరు గురించి జానకి నాకు ముందుగానే బాగా తర్పీదు ఇచ్చింది. ఇలాటి సందర్భాలలో ఇల్లాలు పెట్టుకునే కళ్ళనీళ్ళకు కరిగిపోకూడదని హితబోధ చేసింది. ముందు ముందు భార్యగా తననుంచి అందబోయే సుఖాలను మనసులో వుంచుకుని సీతతో కఠినంగా ప్రవర్తించమనీ దాదాపు ఆర్డర్ మాదిరిగానే చెప్పింది.
ఇంటికి వెళ్లేసరికి పరిస్తితి నేను అనుకున్నట్టుగా లేకపోవడం చూసి ఆశ్చర్య పోయాను. పిల్లలు నిద్రపోతున్నట్టున్నారు. ఎప్పటిమాదిరిగానే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. భోజనం తిననని తెలిసి కూడా వడ్డించమంటారా అని అడిగింది . వద్దని సైగ చేసి నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.
నేను పంపిన విడాకుల నోటీసు సీత అందుకున్న సంగతి ధ్రువపరచుకున్న తరువాతనే ఇంటికి వచ్చాను. అయినా ఇల్లు ప్రశాంతంగా వుంది. ఏడుస్తూ నానా యాగీ చేస్తుందనుకున్న ఇల్లాలు మామూలుగా వుండడం చూసి ఆశ్చర్యపోవడం నావంతయింది.
మా ఆవిడ భోజనం పెట్టింది. తిని చేతులు కడుగుకున్నతరవాత ఆమె చేయిపట్టుకున్నాను. నా కళ్ళల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా చేయి విడిపించుకుంది. ఆమె వంక చూడడానికి గిల్టీ గా అనిపించి తల దించుకున్నాను. ఏదో చెప్పాలని వుంది. ఎంతో చెప్పాలని వుంది. కానీ నోరు పెగలడం లేదు.మాట రావడం లేదు. ఆమె మెల్లగా లేచింది. మౌనంగా ప్లేటులో వడ్డించుకుంది. మాటా పలుకూ లేకుండా భోజనం అయిందనిపించింది. ఆమె కళ్ళల్లో నీరు వూరుతూ వుండడం నాకు కనిపిస్తూనే వుంది.
ఆమెనుంచి నాకు విడాకులు కావాలి. సీతను ఎలాగయినా వొప్పించి తీరాలి. కానీ మనసులోని ఈ మాటను చెప్పడం ఎలా? పక్కకు తిరిగి గొంతు సవరించుకున్నాను. మనసులోని భావాలను మాటల్లోకి మార్చి గోడతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఆమెకు ఎరుక పరిచాను. చిత్రం ఏమిటంటే నా మాటలు వింటున్నప్పుడు, విన్నతరవాత కూడా ఆమె ఎలాటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా, విడాకులా?ఎందుకు? అని ముక్తసరిగా అడగడం నన్ను మరింత ఆశ్చర్యపరచింది. ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలి? అందుకే విననట్టు నటించాను. దానితో అంతవరకూ బిగపట్టుకునివున్న ఆమె కోపం కట్టలు తెంచుకుంది.
‘నువ్వొక మగాడివేనా?’ – అంటూ ఒక్కసారిగా ఆమె అరవడంతో నిద్రపోతున్న పిల్లలు లేచారు. మా ఇద్దరి మధ్యా ఏదో జరిగిందని గ్రహించి ముగ్గురూ ఏడవడం మొదలుపెట్టారు. ఆ రోదనలతో ఇల్లు మార్మోగింది.
ఆ రాత్రి మా మధ్య మాటలు సాగలేదు. రాత్రల్లా ఆమె రోదిస్తూనే వుంది. మా వివాహ బంధం ఇలా ఎందుకు తెగిపోయిందో తెలుసుకోవాలన్నది ఆమె తపనగా నాకు అర్ధం అయింది. కానీ, ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర వుంటేగా. తన మీద వున్న నా ప్రేమ ఇప్పడు జానకి వైపు మళ్లి౦దని ఎలాచెప్పను ?
విడాకుల ఒప్పంద పత్రంలో ఇల్లూ, కారూ, కంపెనీ ఇచ్చిన షేర్లలో మూడో వంతు ఆమె పేరిట, పిల్లల పేరిట రాసాను. ఇది కాక నెల నెలా కొంత మొత్తం చేతికందేలా ఏర్పాటు చేసాను. ఈ విషయంలో మిగిలిన మొగాళ్ళ కంటే నేనే నయమని నేననుకుంటున్నాను.
తెల తెల వారుతుండగా నేను ఆమె ముందు విడాకుల అంగీకార పత్రాన్ని వుంచాను. అది చూడగానే ఆమె కళ్ళు విస్పులింగాల్లా మారాయి. ఒప్పంద పత్రాన్ని ముక్కలు ముక్కలు గా చించి విసిరివేసేంతగా ఆమె కోపం తారాస్తాయికి చేరుకుంది.
పదేళ్లకు పైగా నాతో జీవితాన్ని పంచుకున్న సీత ఈ రోజు పరాయి వ్యక్తిలా మారిపోయింది.
ఇంతకాలం నా సమయాన్ని, ధనాన్ని, శక్తి యుక్తుల్ని ఈమె కోసమా వెచ్చించింది అని బాధపడ్డానే కాని ఆమె పడుతున్న క్షోభను పట్టించుకునే పరిస్తితిలో నేను లేను. ఎంత త్వరగా సీతను విడాకులకు ఒప్పించి ఆ చల్లని కబురు జానకికి చేరవేద్దామా అని అనుకుంటున్నానే కాని సీత మనస్సులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని నేను ఏమాత్రం పట్టించుకునే పరిస్తితిలో లేను.
పైగా ఆమె రోదన నాకు స్వాంతన కలిగిస్తోంది. విడాకులకు ఒప్పుకుంటుందన్న ఆశను రగిలిస్తోంది. దానితో, సీతతో తెగతెంపులు చేసుకోవాలనే నా కోరిక మరింత బలపడసాగింది. ఎంత త్వరగా ఈమెని వొదుల్చుకుని జానకి చెంతకు చేరగలనా అన్నఆత్రుత నాలో పెరిగిపోసాగింది.
మర్నాడు కూడా ఇంటికి పొద్దు పోయే వచ్చాను. నిజానికి అది నా ఇల్లన్న అభిప్రాయం నానుంచి ఎప్పుడో తొలగిపోయింది.
సీత భోజనాల బల్ల వద్ద కూర్చుని ఏదో రాస్తోంది. నా రాక గమనించి ప్లేట్లు సదరబోయింది. కానీ, అన్నం తినడానికి మనస్కరించక నేరుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. అప్పటికే పగలంతా జానకి సమక్షంలో గడిపివచ్చాను. అలసటతో వొల్లెరుగని నిద్ర పట్టింది.
తెల్లవారు ఝామున మెలకువ వచ్చి చూస్తే ఇంకా ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరే రాస్తూ కనిపించింది. ఆమెను పట్టించుకోనట్టుగా పక్కకు తిరిగి నిద్రపోయాను.
ఉదయం నేను లేచేసరికల్లా సీత తయారయివుంది.
“విడాకులు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు.” ఆమె నోట్లో నుంచి వచ్చిన ఈ మాటలతో నోట్లో పంచదార పోసినట్టు ఫీలయ్యాను. నెత్తిమీది బరువు సగం దిగిపోయింది.
“ మీ ఇల్లూ, కారూ, ఆ డబ్బూ కూడా నాకక్కరలేదు.” సీత కంఠం నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో మారు మోగింది.
“అయితే ఒక కండిషన్. దానికి ఒప్పుకుంటే విడాకుల అంగీకారపత్రం పై సంతకం చేయడానికి నేను సిద్ధం.”
ఆ షరతు ఏమిటో వినడానికి నా చెవులు వెంటనే నిక్కబొడుచుకున్నాయని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.
“నాకొక నెల వ్యవధానం కావాలి. ఆ నెల రోజులు ఇష్టం వున్నా లేకపోయినా మీరు నాతో, పిల్లలతో మామూలుగా మునపటి మాదిరిగా గడపాలి.”
ఇందుకు ఆమె చూపించిన కారణాలు కూడా ఆక్షేపించదగినవిగా లేవు. పెద్ద పిల్లాడి పరీక్షలు నెలరోజుల్లో అయిపోతాయి. ఈ విడాకుల వ్యవహారం అతడి చదువును చెడగొట్టడం ఆమెకు ఇష్టం లేదు.
నెల అంటే ఎంత ముప్పయి రోజులు.
ఇట్టే గడిచిపోతాయి. దీన్ని కాదనుకుని విడాకులకోసం ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం కంటే నెల రోజుల ‘బలవంతపు కాపురమే’ నయమన్న నిర్ధారణకు వెంటనే వచ్చాను. ఈ షరతుకు జానకి కూడా సులభంగా వొప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది.
‘మరో సంగతి” సీత స్వరం లో చిన్న మార్పు.
“ఇది షరతు కాదు. ఇన్నేళ్ళు మీతో కాపురం చేసిన భార్యగా ఓ కోరిక కోరుతున్నాను. మన్నిస్తే అదృష్టవంతురాలినని అనుకుంటాను.”
ఆ స్వరంలోని మృదుత్వం నన్ను కరిగించింది. వరాలిచ్చే దేవుడి ఫోజులో సరే! అన్నాను.
ఆమె కోరిన ఆ కోరిక విన్న తరువాత – విడాకుల షాక్ లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నదేమో అన్న అనుమానం కలిగింది. కానీ, జానకితో నా రెండో పెళ్లి త్వరగా జరగాలంటే ఇలాటి ఒకటి రెండు కోర్కెలు ఒప్పుకోక తప్పదు.
నేను మర్నాడు వెళ్లి సీత పెట్టిన షరతులు గురించీ, ఆమె అడిగిన కోరిక గురించి జానకితో చెప్పాను. ఆమె ఒక్క పెట్టున నవ్వి సీతను ఓ పిచ్చిదానికింద జమకట్టి సరిపుచ్చుకుంది. అన్నీ సవ్యంగా జరుగుతూ వుండడంతో ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాను.
సీతకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి వొచ్చినప్పటినుంచి ఆమెతో ఎడమొగం పెడమొగమే. పడక గదులే వేరయిపోయాయి. ముద్దుముచ్చట్ల సంగతి దేవుడెరుగు ఆమెతో మాట్లాడడానికే నాకు మనస్కరించేది కాదు. ఇప్పుడు మళ్ళీ సీతకు ఇచ్చిన మాట ప్రకారం ‘తొలి రాత్రి’ సన్నివేశాన్ని రిపీట్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. తనకూ కొంత ఇబ్బందికరం గానే వున్నట్టు అనిపించింది. కాకపొతే, ఇంట్లో సన్నిహితంగా మసలుతున్న మమ్మల్ని చూస్తూ మా పిల్లలు మాత్రం ఎంతో సంతోషపడ్డారు. చాలా రోజుల తరువాత మళ్ళీ మేము మా పడక గదిలోకి వెళ్లడం చూసి మా పెద్ద పిల్లవాడు వెనుకనుంచి చప్పట్లు కొట్టాడు. మనసు మూలల్లో ఏదో కదిలిన ఫీలింగ్. మంచం మీదకు చేరగానే సీత కళ్ళు మూసుకుని నెమ్మదిగా అంది. “దయచేసి మన విడాకులు గురించి పిల్లలతో అనకండి.”
పైకి తల వూపాను కాని మళ్ళీ ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. పదేళ్లనాటి చీరెను భద్రంగా దాచి ఆ రాత్రి కట్టుకోవడం చూసి తల దించుకున్నాను.
మర్నాడు నా స్కూటర్ మీదనే సీతను తన ఆఫీసులో దింపాను. దారిపొడుగునా భుజం మీద తల వాల్చి మాట్లాడుతూనే వుంది. నా నడుం చుట్టూ బిగించి పట్టుకున్న చేతిని దిగేదాకా వొదలలేదు. నేను నా ఆఫీసుకు వెళ్ళిపోయాను.
సీతకిచ్చిన మాట ప్రకారం వెనుకటి రోజుల్లోలాగా సాయంత్రం తన ఆఫీసుకుకు వెళ్లి ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాను. మా ఇద్దర్నీ మునుపటిలా చూడడం కోసమే అన్నట్టు పిల్లలందరూ గుమ్మం ముందరే కనబడ్డారు.
రెండో రోజు మా ఇద్దరి నడుమా మరికొంత సాన్నిహిత్యం పెరిగినట్టనిపించింది. స్కూటర్ మీద వెడుతున్నప్పుడు తను నాకు మరింత హత్తుకుని కూర్చుంది. ఆమె నుంచి వెలువడుతున్న పల్చటి పరిమళం నా మెడను దాటుకుని నెమ్మదిగా వ్యాపిస్తోంది. సీతను అంత దగ్గరగా చూసిన జ్ఞాపకం ఈ మధ్య లేదు. పెళ్ళయిన కొత్త రోజులు మనసులో మెదిలాయి. స్కూటర్ దిగి ఆఫీసులోకి వెడుతున్నప్పుడు కాకతాళీయంగా ఆమె వైపు చూసాను. గంభీరతతో కూడిన మందహాసం మేళవించి నాకు చెయ్యి వూపి వీడుకోలు పలికింది. ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ అనుభవంలోకి వచ్చిన సన్నివేశం.
నాలుగో రోజున నేనే చేయి అందించి ఆమెను స్కూటర్ పై కూర్చోపెట్టుకున్నాను. నాకు భార్యగా వుంటూ, నా పిల్లలకు తల్లిగా వుంటూ మరోపక్క ఉద్యోగం చేస్తూ ఇంటి పనీ, బయట పనీ సంభాలించుకుంటూ ఇన్నేళ్ళు చాకిరీ చేసిన మనిషి ఈమేకదా అనిపించింది. ఎప్పుడన్నా, ఏనాడన్నా తన గురించి పట్టించుకున్నానా అని ఒక్క క్షణం చివుక్కుమనిపించింది.
రోజులు మారుతున్న కొద్దీ సీతను గురించి నా అభిప్రాయాలు కొద్ది కొద్దిగా మారుతుండడం గమనించాను. అదేమిటో కానీ ఇవేవీ జానకికి చెప్పాలనిపించలేదు.
క్రమంగా ఇంట్లో నేను గడిపే సమయం పెరుగుతూ వస్తున్న సంగతి నేను గమనించనే లేదు. పిల్లలతో ముచ్చట్లు, పెద్ద పిల్లవాడి పరీక్షలు గురించి ఆరా తీయడం వీటన్నిటితో మళ్ళీ ఇంటి పెద్ద పాత్రలో వొదిగిపోయాను. ఓ రోజు ఏకాంతం దొరికినప్పుడు పెళ్ళికిముందు నేను రాసిన ప్రేమలేఖలు చూపించింది. నా ఉత్తరాలను పదేళ్లుగా తాను పదిలంగా దాచుకున్న తీరు నన్ను నివ్వెరపరచింది. తను రాసినవి నేను ఏం చేసానని అడగలేదు. అడిగివుంటే ఏం జవాబు చెప్పాలా అని కొద్ది సేపు మధన పడ్డ మాట వాస్తవం.
వారం రోజులు గడిచాయో లేదో పిల్లవాడి పరీక్షల పేరుతొ నేను పదిరోజులు సెలవుపెట్టాను. ఈ సంగతి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కాని తను కూడా లాంగ్ లీవ్ పెట్టింది. అందరం కలసి ఇంట్లో చాలాసేపు గడపడం చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ మొదలయింది.
ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
శ్మశాన నిశ్శబ్దానికి అలవాటుపడ్డ ఇంటిని మాటలు, ముచ్చట్లు, నవ్వులు మళ్ళీ మనుషులు తిరిగే ‘నివాసం’ గా మార్చాయి. తెలియకుండానే చోటుచేసుకుంటున్న మార్పులన్నీ నన్ను కొత్త మనిషిగా మార్చడం తెలియకుండానే జరిగిపోతోంది.
పాత సంగతులు గుర్తుకొస్తున్నాయి. కొత్త విషయాలు మరపున పడుతున్నాయి.
జీవితం పాత బాటలో కొత్త పరుగు తీస్తోంది. సీతతో కాపురం సరికొత్త మధురిమను అందిస్తోంది.
ఒక్క నెల రోజుల్లో ఇది సాధ్యమా అంటే సాధ్యమే అనిపిస్తోంది.
సీత పెట్టిన గడువు పూర్తవుతున్న విషయం నాకు గుర్తుకు రాలేదు. చిత్రం ఏమిటంటే, గత కొద్ది రోజులుగా ఒక్క రోజు కూడా జానకి గుర్తుకు రాలేదు.
ఓ రోజు సీత తను సంతకం చేసిన విడాకుల అంగీకార పత్రాన్ని నాకు అందించింది. అప్పుడు కానీ నెల రోజుల గడువు పూర్తయిన విషయం నాకు తట్టలేదు.
కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ ఆమె అందించిన కాగితాలను తీసుకున్నాను. అవే చేతులతో ఆమెను పొదివి పట్టుకున్నాను. నా గుండెలపై తల ఆన్చి మౌనంగా రోదిస్తున్న సీతకు తన వీపును చుట్టుకున్న నాచేతులు ఏం చేస్తున్నాయో తెలిసే వీలు లేదు.
ఇక జీవితంలో సీతను విడిచి పెట్టేది లేదు అన్న నా దృఢ నిశ్చయానికి అనుగుణంగా నా చేతులు అంతే బలంగా మా విడాకుల పత్రాన్ని నలిపి నాశనం చేస్తున్నాయి.
(కలిసివున్నప్పుడు విడి విడిగా మసిలే భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. సన్నిహితంగా మెలగడం ద్వారా విడిపోవాలనే కోరిక దూరం చేసుకోవచ్చన్నదే ఈ కధలో నీతి. విడిపోవాలనుకున్న దంపతులు ఈ కధలో లాగా తిరిగి ఒకటవడం సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు.)
(19-07-2011)
కలియుగం నాలుగోపాదంలో ఒకానొక ధూర్తుడు, రౌరవాది మహా రాక్షస గణాలకు ఓ దేవ రహస్యం తెలియచేసాడట.

కొన్ని రోజులనుండీ మీ పోస్టు లు చదువుతుంటే కొత్త దేదో వస్తోంది అనిపించింది. ఇవ్వాళ నిజమయ్యింది. కధ బాగుంది.
రిప్లయితొలగించండికథా శైలి బాగుంది.
రిప్లయితొలగించండి$భండారు శ్రీనివాస రావు గారు
రిప్లయితొలగించండికథా బావుంది. నీతీ బావుంది.అంతకు మించి మీ శైలి అదరహో :) అసలా శీర్షిక/టపా పేరుతోనే మీరు ఆకర్ష్ బాణం వేసారు. శీర్షికలో మీ పేరు౦డడం నాకేక్కడో కొద్దిగా అనుమానంగా ఉంది..తడుతుంది :)
@Rao S Lakkaraju - ధన్యవాదాలు లక్కరాజు గారు.- భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి@oremuna - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి@రాజేష్ జి - మీ స్పందనకు ధన్యవాదాలు. మీ అనుమానాన్ని పెరగనివ్వకండి. అక్కడే తుంచేయండి - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి