కానీ ఈసారి అమెరికాలో వున్నాము.
‘ఎలా?’ అనే ప్రశ్నకు సియాటిల్ లోని హిందూ టెంపుల్ పూజారి సుధీర్ ఝా రూపంలో జవాబు లభించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ హిందూ దేవాలయ సముదాయం నిర్మాణానికి భూరివిరాళం ఇవ్వడంవల్ల దీన్ని మైక్రోసాఫ్ట్ టెంపుల్ అని పిలవడం కద్దు.( హైదరాబాదులో ‘బిర్లా టెంపుల్ మాదిరిగా )
ఎక్కడున్నా ఏడుకొండలవాడికి యెనలేని వైభోగమే
ఈ దేవాలయం విశాలమయిన ప్రాంగణంలో వుంది. ఒక ఎత్తయిన వేదిక మీద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గణేష్ మొదలయిన దేవతామూర్తులను కొలువు తీర్చారు. పుష్పశోభితమయిన ఉద్యానవనం నడుమ నిర్మించిన ఈ దేవాలయం ప్రశాంతతకు, పరిశుభ్రతతకు నిలయంగా వుంది.
మనుషులను కలిపేదే దైవత్వం
శని ఆదివారాల్లో నగరంలోని భారతీయ కుటుంబాల వాళ్ళు ఈ మందిరాన్ని సందర్శించి పూజాదికాలు నిర్వహిస్తూ వుంటారు. గతంలో ఈ గుడిలో దీక్షితులుగారనే తెలుగు పూజారి వుండేవారు. ఇప్పుడాయన సియాటిల్ లోనే రెడ్మండ్ అనే ప్రాంతంలో వున్న మరో హిందూ టెంపుల్ లో పనిచేస్తున్నారు.భజగోవిందం
అసలు ఆబ్దీకాలవంటి కర్మకాండలపై అంతగా నమ్మకం లేనిస్తితిలో గత యాభయి సంవత్సరాలకు పైగా మా నాన్న గారి తద్దినాలు పెడుతూ వస్తున్నాము. ఒక పండగ మాదిరిగా ఏటా జరిగే ఈ కార్యక్రమానికి చుట్ట పక్కాలందరూ వచ్చేవాళ్ళు. ఏడాదికొకసారి కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలుసుకునే సందర్భంగా భావిస్తూ దాన్ని ఒక ఆనవాయితీగా మార్చేసారు. ఈ కర్మ కాండ మొత్తంలో ఒక ఆసక్తికరమయిన విషయం నేను గమనిస్తూ వచ్చాను. అదేమిటంటే మనకు జన్మ నిచ్చిన తలిదండ్రులతో పాటు మూడు తరాల పూర్వీకులను సయితం పేర్లతో సహా స్మరించుకునే సందర్భం ఇది. తండ్రి, తండ్రి తండ్రి పేరు చెప్పగలిగినవాళ్ళు కూడా తాత తండ్రి పేరు గుర్తుకుతెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వంశాన్ని ఉద్ధరించడం సంగతి ఏమో కానీ వంశస్తులను ఏడాదికి ఒక్కమారయినా స్మరించుకునే అవకాశం ఇచ్చే తద్దినాలు పెట్టడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయం క్రమంగా మనస్సులో పడిపోయింది.
తల్లీ నీకు వందనం
ఉత్తరాది పద్దతిలో నిర్వహించినా సుధీర్ ఝా గారు - ఎంతో సంతృప్తికరంగా మా తల్లిగారు వెంకట్రావమ్మ, పితామహి రుక్మిణమ్మ, ప్రపితామహి చెల్లాయమ్మలకు తర్పణ క్రియలు నాచేత జరిపించారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తరవాత – ఇంటి నుంచి తయారు చేసుకొచ్చిన గారెలు, పరవాన్నం ఇతర పదార్ధాలను గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా అందచేసి – అమెరికాలో ఇటువంటి క్రతువులు సాధ్యమా అని మొదట్లో కలిగిన సందేహాలను పటాపంచలు చేసుకుని ఇంటి దారి పట్టాము.
చెప్పడం మరిచాను. ఇటువంటి కార్యక్రమాలకు అవసరమయిన సమస్త సామాగ్రి సియాటిల్ లో వున్న ఒక ఇండియన్ స్టోర్ లో లభించింది.
ఇక పేరెందుకు - మన బజారే!
ఇక్కడివారు సంప్రదాయ వేడుకలను యెంత శ్రద్ధగా జరుపుకుంటున్నారో అర్ధమవుతుంది.
ఏమిలేదో చెప్పండి?
NOTE:All images in the blog are copy righted to respective owners
మీరు చక్కగా వ్రాస్తున్నారు. థాంక్స్. ఈ మధ్యనే మాకు తెలిసిన వాళ్ళు పిట్ట్సుబర్గు నుండి మీ వూరు మారారు. తెలుగు గుడి కోసం వెతుకుతున్నారు. రెడ్మాండ్ లో తెలుగు బ్రాహ్మణ గుడి ఉందన్నారు. వివరాలు చెప్ప గలరా. పిట్ట్సుబర్గు లో వారికి గుడికి వెళ్లటం బాగా అలవాటు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
రిప్లయితొలగించండిలక్కరాజు రావు గారికి నమస్కారాలు. నేను వుండేది హైదరాబాదులో . ప్రస్తుతం సియాటిల్ లో (బెల్ వ్యూ – రెడ్మాండ్ లాగే ఒక ప్రాంతం) మా అబ్బాయి దగ్గర వుంటున్నాను. సెప్టెంబర్ లో తిరిగి వస్తున్నాము. కాలక్షేపానికి ఈ కబుర్లు. పొతే రెడ్మాండ్ లో వేదిక్ టెంపుల్ ఒకటి వుంది. అడ్రసు కింద ఇస్తున్నాను. లోగడ బోతెల్ హిందూ టెంపుల్ లో పని చేసిన దీక్షితులు గారనే పూజారి గారు ప్రస్తుతం రెడ్మాండ్ వేదిక్ టెంపుల్ లో పనిచేస్తున్నారని విన్నాను. నమస్కారాలతో – భండారు శ్రీనివాసరావు – VEDIK TEMPLE, 2877 152nd Avenue, NE, REDMOND – WA (SEATTLE) –USA, Tel No: 425-749-7073
రిప్లయితొలగించండిశ్రీనివాసరావు గార్కి, వెంటనే స్పందించినందుకు థాంక్స్. పుట్టిపెరిగిన అలవాట్లను ఎక్కడున్నా వదలలేము. నేను నలభై సంవత్సరాల నుండి ఈ దేశం లో ఉంటున్నాను. నేను చికాగో దగ్గర ఉంటాను.సియాటిల్ కి నేను చాలా సార్లు వచ్చాను. ఈ తడవ నేను వచ్చినప్పుడు వీలుంటే కలుద్దాము. బెల్ వ్యూ లో నివసించే వారికి సీనియర్ సెంటర్ ఒకటి ఉన్నది. నేను అక్కడికి వెళ్లాను కానీ మీలాగా వ్రాయలేను.అక్కడికి వెళ్లి చూసి ఒక చిన్న వ్యాసము వ్రాయండి.సీనియర్ కున్న సవుకర్యాల గురించి అందరికీ తెలుస్తుంది/ఉపయోగ పడుతుంది.
రిప్లయితొలగించండిలక్కరాజు రావు గారికి – ధన్యవాదాలు. నలభయ్ ఏళ్లుగా ఇక్కడ వుంటూ వున్నారంటే బహుశా కొద్దో గొప్పో మీరు నా వయసు వారే అయివుంటారని అనుకుంటూ వున్నాను. నా కిప్పుడు అరవై అయిదు. బెల్ వ్యూ లోనే వుంటున్నాము. మా అబ్బాయి సందీప్ ఇంటికి కూతవేటుదూరంలో ( సర్రీ డౌన్స్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ఎదురుగా - కాంభర్ రోడ్ లో ) ఓల్డ్ ఏజ్ హోం ఒకటి వుంది. మీరు వెళ్ళివచ్చిన సీనియర్ సిటిజన్ సెంటర్ అడ్రసు ఏమిటో – అందులోకి వెళ్ళడానికి విధివిధానాలు ఏమిటో తెలియచేస్తే తప్పకుండా చూసివస్తాను. మేము ఇక్కడ సెప్టెంబర్ ఇరవై మూడువరకూ వుంటాము. – భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండిశ్రీనివాసరావు గారూ నా స్నేహితుని దగ్గరనుండి ఇన్ఫర్మేషన్ రావటానికి కొద్దిగా టైం తీసుకుంది. దానికి సభ్యత్వము ఉన్నది కానీ మీరు తెలుసుకోటానికి వచ్చానంటే తప్పకుండా అన్ని విషయాలూ చెబుతారు. మీరు అనుకున్నట్లు మనవయసులు దగ్గరలోనే ఉన్నాయి. నా ఆంధ్రా విశ్వవిద్యాలయం లో రూమ్మేటు ప్రసాద్ అక్కడ ఉన్నాడు.
రిప్లయితొలగించండిThe name of the community center is North Bellevue Community
Center. It was near your friends apartment in Bellevue.
The address and phone number are here. 425 - 462 - 7681
4063, 148th Ave. N.E.,
Bellevue, WA
శ్రీనివాసరావు గారూ ఇంకొకటి - రెడ్మొండ్ లైబ్రరీ లో మన న్యూస్ పేపర్స్ వస్తాయని విన్నాను. మీరు బస్సు ఎక్కి కూడా వెళ్ళవచ్చు అక్కడకి.
రిప్లయితొలగించండిలక్కరాజు గారికి - మేము ఇప్పుడే అక్కడిదాకా అంటే ఆ హోం వరకూ (క్రాస్ రోడ్స్) వెళ్ళి వచ్చాము. ఇంటికి రాగానే మెయిల్ చూసాను. చాలా సంతోషం. తప్పకుండా వెడతాను. పోతే, పేపర్లు చదవడమంటారా. దాదాపు నలభయ్ ఏళ్ళ జీవితం జర్నలిజం లోనే గడిచిపోయింది. ఇక్కడ వున్న నాలుగురోజులయినా ఆ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్ కి దూరంగా వుందామని అనుకుంటున్నాను. కాకపొతే, న్యూస్ మాన్ ని కాబట్టి అక్కడి వార్తలు వద్దనుకున్నా తెలుస్తూనే వుంటాయి. బెల్ వ్యూ లో వున్న మీ స్నేహితుదు ప్రసాద్ గారి ఈ మెయిల్ - ఆయనకు అభ్యంతరం లేకోపోతే ఇవ్వండి. వూళ్ళోనే వున్నాను కనుక ఓసారి తెలుగులో పలకరిస్తాను. నా మెయిల్ : bhandarusr@yahoo.co.in, bhandarusr@gmail.com
రిప్లయితొలగించండి