కన్నుకొట్టని కరెంటు దీపాలు
ఒక నగరం నగరాన్ని ఆ మాటకు వస్తే ఒక దేశం దేశాన్నీ అందులోనూ నీళ్ళు గడ్డకట్టే వాతావరణం కలిగిన దేశాన్ని వెచ్చగా వుంచడం అక్కడే చూసాను. ఏడాదిలో దాదాపు పదినెలలు మంచు దుప్పటి కప్పుకుండే మాస్కోలో దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోవడం అక్కడే సాధ్యం.
అలాగే రాత్రల్లా కురిసిన మంచుతో కప్పుకుపోయిన రహదారులను తెల్లవారేసరికల్లా వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఒక దారికి తీసుకురావడం , అందుకు పడుతున్న శ్రమా, పెడుతున్న ఖర్చూ చూసేవాళ్ళకు కళ్ళు తిరగక మానవు. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటిన తరవాత అంటే సుమారు రెండుగంటలనుంచి ఓ రెండు మూడు గంటలపాటు రహదారులపై బస్సులు, ట్రాములు మొదలయిన వాహనాలతో పాటు మెట్రో రైళ్ళ రాకపోకలను నిలిపివేస్తారు. అక్కడినుంచి మొదలవుతుంది యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై మంచు తొలగించే కార్యక్రమం. వార్ ఫుటింగ్ అన్న పదానికి సరయిన అర్ధం తెలుసుకోవాలంటే దీన్ని ఒక సారి పరిశీలించాలి. మొత్తం మూడు రకాల వాహనాలను ఇందులో వాడతారు. ముందు ఒక వాహనం ఉప్పు కలిపిన ఇసుకను రోడ్లపై చల్లుకుంటూ వెడుతుంది. దానితో గట్టిగా పేరుకుపోయిన మంచు నీళ్లగా కరుగుతుంది. రెండో వాహనం కింద అమర్చిన చీపురు యంత్రాలు ఆ ఇసకను, నీటిని చిమ్మివేస్తాయి. మూడో వాహనం నీటితో రోడ్లను శుభ్రంగా అద్దంలా కడిగేస్తుంది. ఇది ఏదో బాగా వర్షం పడినప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకోవడంలాంటిది కాదు. ఇది సంవత్సరం అంతా జరిగే కార్యక్రమం. పైగా నిత్య కృత్యం
'జీవితమే ఉచితమూ..'
మాస్కో గురించిన మరపురాని అనుభవం మాకు మంచినీళ్ళతో మొదలయింది.1987 లో మాస్కో బయలుదేరినప్పుడు హైదరాబాద్ లో మంచినీళ్ళకు బాగా కటకటగా వుండేది. తెల్లవారుఝామున ఎప్పుడో ఒక గంటసేపు నల్లాల్లో నీళ్ళు వొదిలేవాళ్ళు. అదీ రెండురోజులకోమారు. తాగే నీళ్ళనూ వాడే నీళ్ళను పరమపొదుపుగా వాడుకునేవాళ్ళం. అలాటి పరిస్తితుల్లో మాస్కో వెళ్ళిన మాకు రాత్రీ పగలూ అని లేకుండా కొళాయిల్లో నీళ్ళు రావడం చూసి మతి పోయింది. బాతురూముల్లో, వంటింటిలో ఎక్కడ చూసినా మంచినీళ్ళ పంపులే. ఒకటి తిప్పితే ఫ్రిజ్ వాటర్ లాంటి చల్లటి, శుభ్రమయిన మంచినీళ్ళు. మరోదాంట్లో పొగలుగక్కే వేడినీళ్ళు. ఈ ఏర్పాటు ఏటిపోడుగునా అందుబాటులో ఉండడమే కాదు, పూర్తిగా ఉచితం కూడా. మాస్కో జీవితంలో మేము ఎన్నో ఉచితాలు రుచి చూసాము. అసలక్కడ- 'జీవితమే ఉచితమూ.. ' అని పాడుకోవచ్చు అని మిత్రులకు ఉత్తరాల్లో రాసేవాడిని.
పోతే, మాస్కో విషయాలు ముచ్చటించుకునేటప్పుడు మరచిపోకుండా చెప్పుకోవాల్సింది అక్కడి కరెంటు గురించి. మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడివారికి తెలియదు. వంటింట్లో వాడే గ్యాస్ కూడా పైపుల్లో సరఫరా అయ్యేది. సిలిండర్ అయిపోతే ఎట్లారా అన్న బెంగ లేదు. పైగా కరెంటు, నీళ్ళు, గ్యాస్, ఫోన్ అన్నీ ఉచితం. ఇంటి సంగతి సరేసరి. అంత పెద్ద అపార్ట్ మెంటుకు చెల్లించాల్సిన నెల కిరాయి పది రూబుళ్ళు దాటదు. జీతం మాత్రం అటూ ఇటూగా వెయ్యి రూబుళ్ళు.
( స్త్రీబాలవృద్ధులదే అక్కడ అసలు హవా - అదేమిటో ఇంకో మారు)
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
--
ఇంత చక్కని రాజ్యాన్ని రష్యన్లు తరువాతికాలం లో పాడుచేసుకున్నారా?
రిప్లయితొలగించండిkvsv gaaru . naa abhiprayam koodaa ade. anduke akkada nenu choosina paristitulu mundu raasi, kramagaa yela maaripoyaayo teliyacheppadame ee 'maarpu choosina kallu' rachana lakshyam. gata sataabdhamlo ide goppa maarpu ani nenu anukuntunnaanu. - bhandaru srinivasa rao
రిప్లయితొలగించండిఆరో భాగం ఇప్పుడే చదివాను. రెండు రోజుల క్రితం నా కిష్టమైన బ్లాగుల్లో నీది, చందమామది పెట్టాను. వెంటనే నువ్వేది రాసినా అది నాకు కనిపిస్తుంది. చాలా బాగుంది. అంతకు ముందు డీ. జీ. పి మీద రాసిన వ్యాసం కూడా బాగుంది.
రిప్లయితొలగించండిజ్వాలా నరసింహా రావు వనం
thanks jwala
రిప్లయితొలగించండివిదేశీ పర్యటనలు,విహారాలపై గతంలో ప్రముఖుల వ్యాసాలు, యాత్రా విశేషాలు ఎన్నో చదివాను. కాని వాటిలో చాలావరకు ఫలానా ప్రాంతం చూశామని, పలాని విశేషాన్ని తిలకించామని, పలానా కట్టడాన్ని చూశామని చెప్పేవారే తప్ప ఓ నగరజీవితాన్ని, ఓ వ్యవస్థ పనితీరును ఇంత హృద్యంగా, ఇంత ఆసక్తికరంగా రాయడాన్ని ఇంతవరకు నేను చూడలేదు. మీ అయిదేళ్ల మాస్కో జీవితాన్ని ఔపోసన పట్టినట్లు రాస్తున్నారు. ఒక వ్యవస్థ మంచిని చూడడానికి, గుర్తించి ప్రకటించడానికి మనం సిద్ధాంతాలు వల్లెవేయవలసిన అవసరం లేదు. ముద్రలు తగిలించుకోవలసిన అవసరమూ లేదు. మీలా ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా, పలవరించి రాస్తే చాలు. సోవియట్ వ్యవస్థ లోపాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ ప్రజలందరికీ మంచి జీవన ప్రమాణాలను అందించడంలో అది సక్సెస్ అయినంతగా భూమ్మీద మరే దేశం కూడా కాలేదని మీ కథనాలబట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు వ్యవస్థ గొప్పతనాన్ని సిద్ధాంతాల ద్వారా మాత్రమే చదువుకున్న నాలాంటివారందరికీ మీరు ప్రత్యక్షంగా ఓ భూతల స్వర్గాన్ని కళ్లకు కట్టిస్తున్నారు. జీవితంలో సమానత్వాన్ని ఇంత గొప్పగా ఆచరణలో చేసిచూపించిన ఆ గొప్ప దేశంలో మీరు కొన్నేళ్లు బతికారు. ఎంత అదృష్టవంతులు మీరు. అదృష్టానికి మారుపదం దొరకడం లేదు నాకు. శ్రీనివాసరావు గారూ.. మీరు ఇలాగే రాస్తూ పోండి. వీలయితే మీరు మాస్కో జీవితంలో ఫోటోలు తీసుకుని ఉంటే వాటినే ఓ కథనంగా కూడా ప్రచురించండి. చిన్న క్యాప్షన్లతో అయిదారు ఫోటోలను ఒకే ఆర్టికల్‌గా పోస్ట్ చేయవచ్చు.
రిప్లయితొలగించండిభవిష్యత్తరాలకు మానవ సమాజంలో ఒకనాడు వెలిగిన భూతలస్వర్గాన్ని మీరు బ్లాగీకరించి భద్రపరుస్తున్నారు. దయచేసి వెంటనే విశాలాంధ్రవారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ మాస్కో అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురండి. కళ్లకు అద్దుకుని తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
అలాగే మాస్కో జీవితంలో మీరు చూసిన లోపాలను కూడా తప్పక రాయండి. లోపాలను కూడా మీరు రాయకపోతే అది ఎప్పటికీ లోటుగానే ఉంటుది.
ప్రేమతో, అభిమానంతో..
Really it's amazing.
రిప్లయితొలగించండిWhen Water, Electricity, Gas, Education & Health and everything is free, what would we say?
When Children, Women & Elders are in safe mode, what would we say? Other than saluting the great Architects of Lenin & Stalin.
Forgetting their role in making People's Russia, people are getting realisation now & remembering them. Hmm! Even though it's welcoming thing!!