25, ఏప్రిల్ 2010, ఆదివారం

దరిద్ర నారాయణులు - భండారు శ్రీనివాసరావు

దరిద్ర నారాయణులు - భండారు శ్రీనివాసరావు

దేశంలో దరిద్ర నారాయణుల లెక్కలు లెక్కించే కార్యక్రమం జోరుగా సాగుతోంది.
దారిద్ర్యరేఖ (బీపీఎల్)కు దిగువన జీవిస్తున్న కుటుంబాల అంచనా జాబితాను పదిరోజుల్లోగా ప్రభుత్వానికి అందిస్తామని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా సెలవిచ్చారు.

 దేశంలో ఆరున్నర కోట్ల నిరుపేద కుటుంబాలు వున్నట్టు గతంలో తాము వేసిన అంచనాకు కాస్త ఎక్కువగా అంటే సుమారు ఎనిమిది కోట్ల బీపీఎల్ కుటుంబాలు వున్నట్టు లెక్క తేల్చిన టెండూల్కర్ కమిటీ నివేదికను పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు.పత్రికలలో ఈ వార్త వచ్చిన రోజునే ‘రాజ్య సభలో వందమంది కోటీశ్వరులు’ వున్నారన్న సమాచారం కూడా ప్రచురించారు.

మన రాష్ట్రానికి చెందిన టి. సుబ్బరామిరెడ్డి కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న విషయం ఆయనకు పెద్ద విశేషం కాకపోవచ్చు. ఎందుకంటె వేదికలనుంచి వేడుకల దాకా ప్రముఖ స్తానంలో కానవచ్చేవారికి మూడో స్తానం లో నిలవడం అంత ముచ్చట కలిగించే అంశం అంతకంటే కాకపోవచ్చు. ఇక్కడ కోటీశ్వరులంటే ఏదో ఒక్క కోటి మాత్రమె సంపాదించారని అర్ధం కాదు. వందల కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళని అర్ధం చేసుకోవాలి. అంతే కాదు ఈ మొత్తం అంతా కూడా లెక్కల్లో చూపించగల ‘తెల్ల ధనం’ మాత్రమె అన్న మరో పరమార్ధాన్ని కూడా గుర్తించగలగాలి. ఇంకా కానరాని ‘నల్ల డబ్బు’ యెంత వెనకేసుకునివుంటారో అన్నది ఆ ఈశ్వరుడికే తెలియాలి. లేదా ఆ ఘనత వహించిన ఆ ఆహ్లూవాలియా మహాశయులవారే తీరిక చేసుకుని ఆరా తీయిస్తే బాగుంటుంది.
 బీపీఎల్ కుటుంబాల విషయానికి వస్తే –
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ‘ధరలు పెరగడము తధ్యము సుమతీ’ అన్నది ప్రపంచీకరణ సిద్ధాంతకర్తల సాధారణ ఉవాచ. ధరలు పెరగడం వల్ల ఉత్పత్తిదారుడికి గిట్టుబాటు ఆదాయం లభిస్తుంది. ఆదాయం పెరగడం వల్ల లాభాలు పెరుగుతాయి. పెరిగిన లాభాల్లో కొంత మేరకు తిరిగి పెట్టుబడులరూపం లోకి మల్లించడం వల్ల ఉత్పత్తి మరింత పెరిగి వస్తులభ్యత గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా మార్కెట్ శక్తుల ప్రభావంతో ధరల స్తిరీకరణ జరిగి వినియోగదారుడికి ధరలు అందుబాటులోకి వస్తాయి
.ఏసీ గదుల్లో కూర్చుని చేసే ఇలాంటి ఊహాపోహలన్నీ ఆచరణ వద్దకు వచ్చేసరికి ఆవిరయిపోవడం కళ్ళారా చూస్తున్నదే. ఎందుకంటె- ఎలాటి పధకాలకయినా చిల్లులు పొడిచి పబ్బం గడుపుకునే ఘనులెప్పుడు సమాజంలో సిద్దంగానే వుంటారు. ఇందుకు మంచి ఉదాహరణ మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘తెల్ల రేషన్ కార్డుల పధకం’.
భుత్వాలు మారినప్పుడల్లా ఈ కార్డుల రంగులు మారుతూరావడం మన రాష్ట్రంలో ప్రత్యేకత. దీన్నిబట్టి పార్టీల వోటు బ్యాంకుల నిర్మాణంలో వీటి ప్రాధాన్యత యెంత వుందో అర్ధం చేసుకోవచ్చు. పేదలకోసం ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పధకాలకన్నింటికీ ఈ తెల్లకార్డు ఒక్కటే కీలకం కావడంతో వీటికి ప్రాధాన్యతా, గిరాకీ రెండూ విపరీతంగా పెరిగిపోయాయి.

 కార్పొరేటు ఆస్పత్రులలో ఉచిత వైద్యానికి పనికివచ్చే ఆరోగ్యశ్రీ కార్డుని పొందాలన్నా కూడా ఈ తెల్లకార్డే దిక్కు కావడంతో దీని డిమాండ్ ఆకాశం అంచుల్ని తాకింది. సబ్సిడీ బియ్యం, ఇళ్ళ పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు- ఇలా ఇదీ అదీ అనే తేడా లేకుండా అన్నింటితో ఈ తెల్ల కార్డుని ముడిపెట్టడం వల్ల ఇది నల్ల బజారు సరుకుగా మారిపోయింది. పేదవారి కోసం వుద్దేశించిన ప్రయోజనాలన్నీ పేదవారుగా మారడంవల్ల పొందవచ్చనే పేరాశ కలవారిలో సయితం కలిగిన ఫలితంగా బోగస్ తెల్లకార్డులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి.

మధ్యలో వున్నది మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు

 రాష్ట్రంలో వున్న రెండుకోట్ల నలభయి లక్షల కార్డుల్లో ఇప్పటివరకూ పందొమ్మిది లక్షల బోగస్ కార్డులు వున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రాజకీయంగా చూస్తే బోగస్ కార్డుల ఏరివేత అన్నది ఒక రకంగా సాహసమనే చెప్పాలి. ఎన్నికలకు వ్యవధి చాలా ఎక్కువ వుండడం కూడా ఈ దుస్సహాసానికి పూనుకోవడానికి కారణమయివుంటుందని ఆక్షేపించేవారు కూడా లేకపోలేదు. బోగస్ కార్డులవల్ల ఖజానాపై పడుతున్న అలవికాని భారం కూడా ప్రభుత్వాన్ని ఇందుకు ప్రేరేపించి వుండి వుండవచ్చు. ఏదిఏమైనా, బోగస్ కార్డుల ఏరివేత వ్యవహారం వివిధ పదకాలవల్ల లబ్ది పొందుతున్నవారిలో గుబులు కలిగిస్తోందన్నది కాదన లేని సత్యం. భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం తమ కార్డులు లాగేసుకుంటుదన్న అభిప్రాయం వారిలో కలిగితే అందులో తప్పు పట్టాల్సిన పనిలేదు. భారీ ఎత్తున జరిగే ఇలాటి ఏరివేత కార్యక్రమాల్లో అక్రమార్కులకు, అక్రమాలకూ కళ్ళెం వేయడం అంత సులభమేమీ కాదు. గ్రామసభలలో చర్చించిన తరవాతనే కార్డుల రద్దుపై తుదినిర్ణయం తీసుకోవడం జరగగలదని ప్రభుత్వం ఇస్తున్న భరోసాపట్ల లబ్ధిదారులలో నమ్మకం పెంపొందించడానికి చేపట్టిన చర్యలు గురించిన సమాచారం ఏదీ లేదు. తొంభయి అయిదు శాతం కార్డులు సరిగానే వున్నాయన్న మంత్రి ప్రకటనను బట్టి చూస్తే- ఏరివేతలో అర్హులయిన వారికి అన్యాయం జరిగిన దాఖలా కానరావడం లేదు. మొత్తం సమాచారాన్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి ఆన్ లయిన్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామనీ, కార్డుల వ్యవస్తని నూటికి నూరు శాతం పక్కాగా నిర్వహించేందుకు ‘బయో మెట్రిక్’ విధానాన్ని ప్రవేశపెడుతున్నామనీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇస్తున్న హామీలు అమల్లోకి వచ్చిన పక్షంలో పారదర్శకత పెరిగి సంక్షేమ ఫలాలు అర్హులయిన పేదవారికే దక్కే అవకాశం వుంటుంది.
లబ్ధిదారుల్లో అర్హులయిన పేదలను సరిగ్గా గుర్తించి, అనర్హులయిన వారి కార్డులను నిష్కర్షగా, నిజాయితీగా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలను లెక్కచేయకుండా రద్దు చేయగలిగిననాడే బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమానికి అర్ధం పరమార్ధం సిద్దిస్తాయి. కాని పక్షంలో ఏరుదాటి తెప్ప తగలేసారనే అపప్రధను ప్రభుత్వం మూటగట్టుకోకతప్పదు.

(25-4-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

14, ఏప్రిల్ 2010, బుధవారం

ముఖ్య మంత్రులు

ముఖ్య మంత్రులు
(హైదరాబాద్ స్టేట్, ఆంద్ర, ఆంద్ర ప్రదేశ్)  
హైదరాబాద్ స్టేట్ :
వెల్లోడి        26 జనవరి 1950  నుంచి 6  మార్చి 1952 వరకు  (కేరళ రాష్ట్రం)       మొత్తం  770 రోజులు
బూర్గుల  
డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు - మార్చి ఆరు 1952 నుంచి  31 అక్టోబర్ 1956 వరకు  మొత్తం 1855 రోజులు
ఆంద్ర రాష్ట్రం

టంగుటూరి
టంగుటూరి ప్రకాశం పంతులు  -  1 అక్టోబర్ 1953 నుంచి  27 మార్చి 1955 వరకు మొత్తం 631 రోజులు
గోపాలరెడ్డి

బెజవాడ గోపాలరెడ్డి  - 28 మార్చి 1955 నుంచి 1 నవంబర్ 1956 వరకు మొత్తం 584 రోజులు
ఆంద్ర ప్రదేశ్

సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి 1 నవంబర్ 1956 నుంచి 11 జనవరి 1960 వరకు మొత్తం 1166 రోజులు
దామోదరం

దామోదరం సంజీవయ్య 11 జనవరి 1960 నుంచి  12 మార్చి 1962  వరకు మొత్తం 791  రోజులు
సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి – 12 మార్చి  1962  నుంచి  29 ఫిబ్రవరి 1964  వరకు -  మొత్తం  719 రోజులు(రెండో పర్యాయం

బ్రహ్మానందరెడ్డి

కాసు బ్రహ్మానందరెడ్డి  - 29 ఫిబ్రవరి 1964  నుంచి 30 సెప్టెంబర్ 1971  వరకు -  మొత్తం  2770 రోజులు

పీవీ నరసింహారావు


పీవీ నరసింహారావు  - 30 సెప్టెంబర్ 1971 నుంచి  10 జనవరి  1973 వరకు -  మొత్తం – 468  రోజులు
                                         రాష్ట్రపతి పాలన - (11-01-1973 TO 10-12-1973 -  మొత్తం  335 రోజులు)
జలగం

జలగం  వెంగళరావు 10 డిసెంబర్ 1973 నుంచి  6 మార్చి 1978 వరకు మొత్తం  1547 రోజులు
చెన్నారెడ్డి

మర్రి చెన్నారెడ్డి -  6 మార్చి 1978 నుంచి  11 అక్టోబర్ 1980  వరకు మొత్తం – 950 రోజులు
అంజయ్య

టి . అంజయ్య  -    11 అక్టోబర్ 1980 నుంచి  24 ఫిబ్రవరి  1982 వరకు మొత్తం – 501 రోజులు
భవనం

భవనం వెంకట్రాం  -  24 ఫిబ్రవరి  1982 నుంచి  20 సెప్టెంబర్ 1982 వరకు మొత్తం – 208 రోజులు
కోట్ల

కోట్ల విజయ భాస్కరరెడ్డి  -  20 సెప్టెంబర్ 1982 నుంచి  9 జనవరి 1983 వరకు మొత్తం – 111 రోజులు
ఎన్టీ రామారావు

                                                          
ఎన్టీ రామారావు  -  9 జనవరి 1983 నుంచి  16 ఆగష్టు 1984  వరకు మొత్తం – 585 రోజులు
నాదెండ్ల

నాదెండ్ల భాస్కర రావు  -  16 ఆగష్టు 1984 నుంచి  16  సెప్టెంబర్ 1984  వరకు మొత్తం – 31 రోజులు
ఎన్టీయార్

ఎన్టీ రామారావు  - 16  సెప్టెంబర్ 1984 నుంచి  2 డిసెంబర్ 1989 వరకు మొత్తం – 1903 రోజులు (రెండో పర్యాయం)
చెన్నారెడ్డి

మర్రి చెన్నారెడ్డి  - 3 డిసెంబర్ 1989 నుంచి  17  డిసెంబర్  1990  వరకు మొత్తం- 379 రోజులు (రెండో పర్యాయం)
జనార్ధనరెడ్డి

నేదురుమల్లి  జనార్ధనరెడ్డి  -  17  డిసెంబర్  1990 నుంచి  9 అక్టోబర్  1992 వరకు మొత్తం- 662  రోజులు
విజయభాస్కరరెడ్డి

కోట్ల విజయభాస్కరరెడ్డి  - 9 అక్టోబర్  1992 నుంచి  12 డిసెంబర్ 1994  వరకు మొత్తం – 794 రోజులు
ఎన్టీ రామారావు

ఎన్టీ రామారావు 12   డిసెంబర్ 1994 నుంచి 1 సెప్టెంబర్ 1995 వరకు మొత్తం – 263 రోజులు (మూడో పర్యాయం)
చంద్రబాబు  

నారా చంద్రబాబు నాయుడు -    1 సెప్టెంబర్ 1995 నుంచి  14  మే  2004 వరకు మొత్తం 3178 రోజులు (రెండు పర్యాయాలు)
రాజశేఖరరెడ్డి

వైఎస్ రాజశేఖరరెడ్డి -  14  మే  2004 నుంచి 2 సెప్టెంబర్ 2009 తేదీన హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించే  వరకు మొత్తం- 1938 రోజులు (రెండు పర్యాయాలు)

రోశయ్య
కొణిజేటి రోశయ్య  - 3 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు  ( 2010  మార్చినాటికి ఆరుమాసాల పదవీ కాలం పూర్తీ చేసుకున్నారు)
(సంకలనం భండారు శ్రీనివాసరావు 14-04-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


13, ఏప్రిల్ 2010, మంగళవారం

Jagan’s juggernaut scare rivals - Bhandaru Srinivasrao (I.I.S.)

Jagan’s juggernaut scare rivals - Bhandaru Srinivasrao (I.I.S.)




The “Odarpu Yatra” of the Kadapa MP, Y S Jaganmohan Reddy, appears to have not only sent shivers down the spines of the main Opposition Telugu Desam party, but also the former chief minister’s baiters, who successfully stalled the young scion ‘succession’ efforts after his father and former chief minister Dr Y S Rajasekhara Reddy’s death in a chopper crash..



Realizing possible opposition within the party’s rank and file, the young scion, in a calculated move, choose to take the nod of Chief Minister K Rosaiah as well the PCC Chief D Srinivas, besides the state’s political affairs in-charge and Union Law Minister Veerappa Moily, before taking up his “Odarpu Yatra’ (Consoling those who laid down or lost lives in the form of either ‘shock’ or ‘suicide’ on hearing the tragic news of his father and former chief Minister Y S Rajasekhara Reddy’s death in a chopper crash).

However, the programme had to be put off for a while due to political turmoil in the state over bifurcation issue. With dust being somewhat settled with the Centre constituting Srikrishna Committee to begin the ‘consultation’ process to accomplish ‘consensus’, Jagan too got clearance from the party higher ups to show his family’s gesture to all those died on hearing his father’s chopper crash news.


 His first-leg whirlwind four day tour of West Godavari proved to be a grand success with crowds milling at every of his meeting and all through the route he traveled. Though, he initially restrained himself not to talk politics, but the unprecedented crowds he drew made him speak about his father’s achievements. He described his late father first five-year tenure as ‘Swarna yugam’ (meaning golden era). He said his father, who strived for the uplift of poor, ensured all his schemes benefit them one way or the other. He vouched to strive for continuance of all those schemes.

The developments in the state congres during the post YSR era,made themain opposition TDP to expect intra squabbles within the Congress over the ‘succession’ issue will weaken the ruling party. The party was also quite happy for the Congress high command foisting K Rosaiah as Chief Minister, as they construed him as a ‘weak-knead’ leader.

That their calculations have gone hay-wire is evident from the fact that Rosaiah not only asserting himself and gaining control over the administration as day passes, but also the Jagan’s juggernaut receiving such tumultuous response, has become a major worrying factor.

Added to this, the Opposition TDP party is also pushed to the wall as it has to take a final call on the state’s bifurcation issue. In fact, the Telugu Deam party was born to promote unity of Telugus and protect their ‘self-respect.’ But, today, the party, like congress, is virtually divided on state’s bifurcation issue and while one section supports the ‘separate statehood for Telangana”, the other group strongly voicing for “integrated’ state.

Well, state bifurcation issue might have taken back seat for few more months as the Srikrishna Committee has begun the process, but with the by elections to 12 assembly constituencies which fell vacant due to the resignations of Telangana Rastra Samiti and Praja Rajyam, besides lone BJP member resigning, due sometime later, indeed put Naidu in a ‘fix’. If Jagan continue to get same response from the people in Telangana as he started distributing Rs 1 lakh compensation to each bereaved family, then even it may pose a serious threat to even TRS. Though the TRS has expressed its opposition to Jagan touring Telangana, can it stop its people from losing the benefit of compensation from Jagan? That’s the million dollar question only time will tell.

As far as Jagan is concerned, he got a great opportunity to travel length and breathe of the state under the ‘garb’ of ‘Odarpu Yatra’ to move closer to masses and win their hearts. Whether the slogans being rented air during his ‘yatra’ will be heard by the party high command or not, but he can boast of emerging himself as a mass leader like his father. Neither any one in Congress, nor in the Opposition could boast of such a claim. Chiranjeevi may be an exception as his yesteryear’s ‘mega star’ craze somewhat in tact.(13-04-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

7, ఏప్రిల్ 2010, బుధవారం

No role for media in Sania-Shoaib marriage!

No role for media in Sania-Shoaib marriage!- Bhandaru Srinivasrao




I am rather amazed that Indian media is unwilling to learn lessons from the past and reluctant to draw their own self-regulatory methods to restrain from overstretching their brief. This was evident from the recent ongoing tennis star Sania’s marriage with Pakistani cricketer Shoaib Malik.

Should such an attention be paid to a star’s personal life? After all, she is a human and she had every right to choose her partner? If she is willing and knew well of her partner’s past personal life, who’s the media to question? Who gave the media right to park themselves near house days together and cause embarrassment as well inconvenience to her family members? Does it also cause inconvenience to those living next door of the star?

If this is not nauseating of media then what else is? Till recently, I though it was only the regional media, which shows over enthusiasm as neither staff were trained well or known of their limitations. But, what happened to the so called national media? How come they become so irresponsible? Aren’t they entrenching into the human rights of Sania?

Well, if Shoaib has indeed violated and any religious marriage acts, law can take its own course. Police, Courts and religious heads can help solve the problem. As a media, we have to restrain ourselves while covering such events which are too personal. As long as Shoaib is proved legally guilty, what right the Media has to disturb his peace. Similarly, when Sania, time again reiterates that she was well aware of the Shoaib and Ayesha, affair, besides her entire family, who the hell Media to poke their noses?

The City Police had taken cognizance of the FIR filed by Ayesha, alleged first wife of Shoaib, whom the latter apparently married over ‘phone’. Now, Ayesha and her parents wanted Shoaib to give first divorce and go ahead wedlock with Sania. And, Shoaib claims that he had already given ‘Talak’ over phone. All this looks very complicated and only the religious heads can clarify and give guidance, while the law can its own course as set guidelines in the Religious Marriage Rule Book.

Whether Sania and Shoaib determined to go ahead with their marriage (or Nikah) on set April 15 or not are their look out and the legal agencies botheration. The Media has no role, whatsoever to play, except remain as a ‘watch dog’ and report the developments as they unfold. As a journalist, that’s the way I feel. Till that time, none of my colleagues in the visual and print media has right to pitch their camps anywhere near Sania’s house and create inconvenience not only to her family, but to those who are living nearby.

As far as two individuals marriage is concerned there is no great investigation is required as facts are clear for everyone to see. Ayesha, the alleged first wife of Shoaib feels ‘cheated’ or ‘duped’ by the latter and wanted justice to be done. She has already knocked the doors of ‘justice’ by filing a police complaint. Contrary to this, Shoaib claims that he is innocent and dragged into the controversy with ulterior motives. To cap it all, Sania boasts that she and her family are well aware of Shoaib-Ayesha affair and they see no hanky-panky in it. Thus far, the problem lies between Shoaib and Ayesha and both of them have to prove they are not guilty. As far as Sania is concerned, knowing well about the earlier affair of his new found love, she decided to marry.

Can media writings or overenthusiastic acts help prevent scheduled Sania-Shoaib wedding on April 15 or any other date they fixed so? Certainly, not! Only, if the police find some prima facie and the judiciary intervenes, only then the marriage can be postponed or deferred for some more time.

Hence, I prey for better wisdom prevail on my own medi -dog’, they should better concentrate more on issues pertaining to people’s day-to-day problems, rather than get indulged in unwarranted issues like Sania-Shoaib marriage. Their over indulgence in the issue, in fact, had also drawn the two governments – India and Pakistan – which are already under great amount of strain.



If the media in our country failed to change its professional approach, then I am scared, one day a strong government at the Centre may crack a whip.(07--4-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.









--------------------------------------------------------------------------------

The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

28, మార్చి 2010, ఆదివారం

శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)



శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు  (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)


చాలా ఏళ్ళ క్రితం -
అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో  రేడియో, దూరదర్శన్ లలో ఒక రోజుముందు - 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే  శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో - ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు- ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాతగానీ ప్రసారం చేసేవాళ్ళు  కాదు. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది. 
ఇక ప్రస్తుతానికి వస్తే-
టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు.అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే - ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి - టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దే సించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని అవి అలవరచుకోవాలి. అదేసమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌద పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.(28-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                                      


Y