tag:blogger.com,1999:blog-5449765236436053761.post9189092792297228110..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: బెడ్రూంకు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోందిభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-16867991531315900682021-09-15T05:54:00.618+05:302021-09-15T05:54:00.618+05:30మదర్ థెరిస్సా, గాంధీలతో తన ఇంటర్వ్యూలను ఆయన పేర్కొ...మదర్ థెరిస్సా, గాంధీలతో తన ఇంటర్వ్యూలను ఆయన పేర్కొంటారు

ఈ ముఖాముఖి విషయాలు పోస్ట్ చేయండి.

2 సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?

తెలియకుండానే భారతదేశ జనాభా ఇంత ఉందంటారా ?

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-54735382075100005722021-09-15T01:30:01.046+05:302021-09-15T01:30:01.046+05:30శ్రీనివాసరావు గారు,
౧. ఆడ మొగ పిల్లలు ఒకళ్ళనొకరు ...శ్రీనివాసరావు గారు,
౧. ఆడ మొగ పిల్లలు ఒకళ్ళనొకరు ముట్టుకోకుండా ఉండి పెళ్ళిసమయానికి వారి స్పర్శ వల్ల వచ్చే అనుభూతిని, మనం ఒకరికొకరు ప్రత్యేకం, ఒకరికొకరు బద్దులం, పెళ్లయిన తర్వాత మరో వ్యక్తిని చూడకూడదు అన్న నియమాలని ఏర్పరిచిన ధర్మాన్ని విస్మరించాం. దాని వల్ల జీవితానికి ఏది ముఖ్యమో తెలియకుండా పోయింది.
౨. మీ పెళ్లి వివరాలు ఇంతకు ముందు కూడా వ్రాసారు. ఈసారి చెప్పిన ముఖ్య విషయం - జ్ఞాపకాలు. ఫోటోలు లేవని మీరు ఏమూలో విచారపడ్డట్టున్నారు. కానీ దాని కంటే జ్ఞాపకాలే చాలా సుఖం. ఇప్పటి పరిస్థితి చూడండి. ఎక్కడ చూసిన ఫోటోలు, వీడియోలు మనస్సు మరెక్కడో. వాటిని చూసే నాథుడు కూడా లేదు. తక్కువ ఉంటేనే అపురూపం అవుతాయేమో!

ఎప్పటి లాగే మీ వ్యాసం, ఇంటర్వ్యూ చాలా బావున్నాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-51678213211617203732021-09-14T19:06:00.723+05:302021-09-14T19:06:00.723+05:30విన్నకోట నరసింహారావు గారికి : 1971 డిసెంబరు 15 వ త...విన్నకోట నరసింహారావు గారికి : 1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు. మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టు తో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి బయలుదేరి రైల్లో మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లోద్దు పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా. బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో ఆంద్ర జ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము. నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.

తోకతపా: ఇలాంటి పెళ్లిళ్లకు ఫోటోలు వుండవు, జ్ఞాపకాలు తప్ప.
(16-12-2016)
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-8262556918281611052021-09-14T19:03:19.316+05:302021-09-14T19:03:19.316+05:30విన్నకోట నరసింహారావు గారికి ధన్యవాదాలు విన్నకోట నరసింహారావు గారికి ధన్యవాదాలు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-32594065865476471992021-09-14T13:39:12.458+05:302021-09-14T13:39:12.458+05:30నిరాడంబరంగా పెళ్ళి చేసుకోవడం గురించి మీ అభిప్రాయమే...నిరాడంబరంగా పెళ్ళి చేసుకోవడం గురించి మీ అభిప్రాయమే నా అభిప్రాయమున్నూ. కాకపోతే మీరు సాధించుకో గలిగారు, నేను సాధించుకోలేక పోయాను. మనలో మన మాట మీది ప్రేమ వివాహం అనిన్నీ, అందువల్లే మీ మాట నెగ్గించుకోగలిగారనిన్నీ నేను అనుకుంటున్నాను. నాలాగా అరేంజడ్ పెళ్ళి చేసుకున్న వాళ్ళు రిజిష్టర్డ్ పెళ్ళి అని పట్టుబట్టినా ఇరుపక్షాలనీ ఒప్పించగలగడం సాధారణంగా (90%) జరగదు. సంస్కరణ మార్గంలో మీరు సాధించిన ప్రగతిని తక్కువ చెయ్యడం లేదు, పట్టుదల నెగ్గించుకోలేక పోయానని ఏదో నా స్వఘోష అంతే.

ఇక ఈ కాలానికొస్తే పాశ్చాత్య సంస్కృతి, ఇటీవల పెచ్చు మీరి పోయిన వ్యాపార సంస్సృతి, సినిమాల్లో బాధ్యతారహితంగా చూపించే ఆర్భాటపు పెళ్ళిళ్ళు (పెళ్ళిచూపుల కార్యక్రమాన్ని కూడా ఫైవ్-స్టార్ లెవెల్లో చూపిస్తున్నారు) బాగా బుర్రకెక్కిపోయిన ఈ తరం కుర్రకారుకు నిరాడంబరత విలువ తెలియదు, పట్చించుకోరు కూడా. ఎంత షో చేస్తే అంత గొప్ప. ఎంత “డిఫరెంట్” గానూ “వెరైటీ” గానూ చేస్తే అంత గొప్ప, అన్ని “లైకులు”.

తతిమ్మా అంశాలు కూడా మీరు బాగా ప్రస్తావించారు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-76042161336136529492021-09-14T10:39:10.248+05:302021-09-14T10:39:10.248+05:30అప్పరసు శ్రీనివాసరావు గారికి (రెండు మార్లు) ధన్యవ...అప్పరసు శ్రీనివాసరావు గారికి (రెండు మార్లు) ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42606035686549024972021-09-14T09:46:08.567+05:302021-09-14T09:46:08.567+05:30నిర్మొహమాటంగా చెప్పారు, భండారు గారూ!నిర్మొహమాటంగా చెప్పారు, భండారు గారూ!అప్పరసు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/17734473343759415442noreply@blogger.com