tag:blogger.com,1999:blog-5449765236436053761.post9054918869628024700..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: వై2కె – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-56319685961951854942020-05-08T21:07:35.346+05:302020-05-08T21:07:35.346+05:30Y2k సమస్య వస్తుందని భయపడడానికి ఆ రోజుల్లో చెప్పిన ...Y2k సమస్య వస్తుందని భయపడడానికి ఆ రోజుల్లో చెప్పిన కారణం ఏమిటంటే .... కంప్యూటర్ లో మెమరీ, స్టోరేజ్ స్పేస్ ఆ కాలంలో చాలా పరిమితంగా ఉండేవి, ఎందుకంటే ఆ రోజుల్లో అవి కాస్ట్లీ గా ఉండేవి (ఇప్పుడు బాగా చౌక అయిపోయాయి లెండి). కాబట్టి వీలైన చోటల్లా పొదుపుగా వాడేవారు. ఒక పొదుపు ఏరియా ఏమిటంటే సంవత్సరాన్ని కుదించి నాలుగు అంకెల బదులు (ఉదా; 1980) రెండంకెలే (ఉదా: 80) స్టోరేజ్ స్పేస్ కేటాయించేవారు కంప్యూటర్ ప్రోగ్రామర్లు తాము వ్రాసే ప్రోగ్రామ్స్ లో. అందువల్ల 99 (1999) తరువాత 00 అవుతుంది, దాన్ని కంప్యూటర్ 2000 బదులు 1900 గా భావించుకుంటుంది, ఆ రకంగానే కాల్-క్యులేషన్స్ చేస్తుంది, దాంతో అంతా తప్పుల తడక అయిపోతుంది అని భయపడ్డారు. దాన్ని సరి చేయాలంటే మొత్తం అణువణువూ చూసుకుంటూ ఎక్కడెక్కడైతే రెండంకెల స్పేస్ కేటాయించి ఉందో అక్కడల్లా దాన్ని నాలుగంకెల స్పేస్ కేటాయింపుగా మార్చాలనీ, చేసిన మార్పుల్ని క్షుణ్ణంగా టెస్ట్ చేయాలనీ (31 డిసెంబర్ 1999 అర్థరాత్రి లోగా), అదంతా బృహత్ కార్యక్రమం కాబట్టి వేలమంది ప్రోగ్రామర్ల అవసరం ఉందనీ అనేవారు (అది కూడా మెయిన్ ఫ్రేం, AS400 కంప్యూటర్ల పరిజ్ఞానంతో). ఆ రకంగా చాలా మందికి విదేశీ అవకాశాలు వచ్చాయి, మీరన్నట్లు అమీరుపేట-మైత్రీవనం సందుల్లోని కంప్యూటర్ కోచింగ్ సెంటర్లకు లాభసాటి వ్యాపారం దొరికింది 🙂. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com