tag:blogger.com,1999:blog-5449765236436053761.post4852583652080085485..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మ్యూజియంలో కృతజ్ఞత - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-21554744911802082322010-08-20T08:31:44.387+05:302010-08-20T08:31:44.387+05:30మీ స్పందనకు కృతజ్ఞతలు. అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజ...మీ స్పందనకు కృతజ్ఞతలు. అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయరంగంలో లుప్తమవుతున్న కృతజ్ఞతాభావాన్ని లేదా లాయల్టీ గురించి ఆవేదనని వ్యక్తం చేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. ఆయా వ్యక్తుల గురించిన ప్రస్తావన కేవలం కాకతాళీయం. వ్యక్తులను వ్యాసాలలో ప్రస్తావించి కీర్తించడం – తూలనాడడం వంటివి మంచి జర్నలిజం అని నేను అనుకోను. ఉదయం వేళల్లో తెలుగు టీవీల్లో ప్రసారం అయ్యే విశ్లేషణల కార్యక్రమాల్లో పాల్గొనే యాంకర్లు కానీ, విశ్లేషకులు కానీ - సాధ్యమయినంతవరకూ వ్యక్తుల ప్రస్తావన తీసుకురాకుండా వుంటే – వ్యక్తిగత విమర్శలకు దిగకుండా వుంటే - ‘తమలపాకుతో నేనిట్లంటే తలుపు చెక్కతో తానిట్లనే’ పద్ధతిలో బాహాబాహీ చర్చలకు అవకాశం వుండదు అని అందరూ పైకి ఒప్పుకుంటారు. కానీ టీఆర్పీ రేటింగులే అందరి ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నాయి.చర్చలు ఆ స్తాయిలో ఉద్రేకపూరితంగా లేకపోతె జనం చూడరని చానళ్ళు, అలా మాట్లాడకపోతే మళ్ళీ పిలవరేమోననీ కొందరు విశ్లేషకులూ పోటీలు పడి వాటి స్తాయిని దిగజారుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అన్ని చానళ్ళు ఇలా చేస్తున్నాయని నా ఉద్దేశ్యం కాదు. కానీ వాటి ఉనికికి అవసరమయిన రేటింగులు వాటినికూడా దిగ జార్చవన్న హామీ ఏమీ లేదు. ‘ సమాజంలో ఏ రంగంలో అవకతవకలు వున్నా సరిదిద్ద డానికి మీడియా వుంది’ అన్న భరోసావుండి తీరాలి. నిప్పుకి చెదలంటకూడదన్నది మాత్రమే నా ప్రధాన ఉద్దేశ్యం. మీడియాలో ఇప్పుడు కానవస్తున్న విపరీతధోరణులు సరిదిద్దుకోలేనంత పెద్దవేమీ కావు. కాకపొతే ఈనాటి పోటాపోటీ పోటీయుగంలో వెనక్కి తిరిగి చూసుకునే ఓపికా తీరికా ఎవ్వరికున్నాయి? పునరుక్తి దోషం అయినా పరవాలేదు. గతంలో అనేక చానళ్ళ చర్చలలో పాల్గొన్నప్పుడు మీడియా విషయం వచ్చినప్పుడల్లా ఒక ఉదాహరణ చెబుతూ వచ్చాను. ‘శ్రీరాముడు వనవాసం చేస్తూ ఒకచోట తన ధనుర్భాణాలనువుంచి విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక కప్ప వాటికింద వుండిపోతుంది. శ్రీరాముడు నిద్రలేచిన తరవాత ఆ కప్ప దురవస్తను గమనించి ఎంతో చింతించి –‘బాణం పెడుతున్నప్పుడే నాతో చెప్పివుంటే ఈ బాధ నీకు కలిగేది కాదు కదా’ అని ఓదార్చబోగా – ‘సర్వలోకాలను కాపాడే శ్రీరాముడే - నా ఈ స్తితికి కారణమయినప్పుడు ఇక నా దుస్తితి ఎవ్వరితో చెప్పుకోవాలని’ ప్రశ్నిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ప్రజలను కనిపెట్టి చూడాల్సిన మిగిలిన అన్ని రంగాలు శిధిలమవుతున్నప్పుడు - వాటిని పరిరక్షించి పునరుద్ధరించాల్సిన బాధ్యతా శక్తీ కలిగిన మీడియా కూడా ‘నలుగురితో నారాయణా ‘అని తానూ ఒక రాయి విసిరే పనికి పూనుకుంటే ఇక ఈ జాతిని కాపాడేది ఎవరు? – భండారు శ్రీనివాసరావు, క్యాంపు : సియాటిల్ (యుఎస్ ఏ)భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-81918107821537959292010-08-18T21:35:43.613+05:302010-08-18T21:35:43.613+05:30Please read this link. about 108 five year day cel...Please read this link. about 108 five year day celebration.<br />Raju is on Bail now.<br />Jwala<br />http://jwalasmusings.blogspot.com/2010/08/108.htmlJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-63759572414133878712010-08-18T01:49:50.584+05:302010-08-18T01:49:50.584+05:30thanks - bhandaru srinivasraothanks - bhandaru srinivasraoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-89400825017223647882010-08-17T09:47:57.026+05:302010-08-17T09:47:57.026+05:30Excellent post..Excellent post..Rajhttps://www.blogger.com/profile/05662648155798902590noreply@blogger.com