31, జులై 2019, బుధవారం
Debate On AP Assembly Budget Sessions 2019 | News & Views#2 | hmtv
ప్రతి బుధవారం మాదిరిగానే ఈరోజు ఉదయం HMTV లో ఛానల్ సీయీఓ శ్రీ శ్రీనివాసరెడ్డి నిర్వహించిన News & Views చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : డాక్టర్ శ్రీదేవి(వైసీపీ), శ్రీ రామానుజయ (టీడీపీ)
Debate On AP Assembly Budget Sessions 2019 | News & Views#1 | hmtv
ప్రతి బుధవారం మాదిరిగానే ఈరోజు ఉదయం HMTV లో ఛానల్ సీయీఓ శ్రీ శ్రీనివాసరెడ్డి నిర్వహించిన News & Views చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : డాక్టర్ శ్రీదేవి(వైసీపీ), శ్రీ రామానుజయ (టీడీపీ)
29, జులై 2019, సోమవారం
సమర్ధత, సచ్చీలతలకు చిరునామా జైపాల్ రెడ్డి
( శనివారం28-07-2019 తేదీ అర్ధరాత్రి హైదరాబాదులో కన్నుమూసిన ప్రముఖ రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ఎస్. జైపాల్ రెడ్డి గురించి రాసిన ఈ వ్యాసాన్ని సోమవారం సూర్య దినపత్రికలో ప్రచురించారు)
ప్రభుత్వాలను కార్పొరేట్లు శాసిస్తాయనే అపవాదు ఒకటి వుంది. కార్పొరేట్లను అదుపుచేయాలని చూసే కేంద్ర మంత్రులను అడ్డు తొలగించుకునే శక్తి సామర్ధ్యాలు వాటికి పుష్కలం అని చెప్పుకోవడం కద్దు. ఉత్తమ పార్ల మెంటేరియన్ గా పురస్కారం అందుకున్న శ్రీ ఎస్. జైపాల్ రెడ్డికి కూడా ఈ బెడద తప్పలేదు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అంతవరకూ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ వచ్చిన జైపాల్ రెడ్డి పెట్రోలియం మంత్రిగా వున్నారు.
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే ఉత్తరాది మీడియా బాంబు లాంటి వార్త పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని.
పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారంలో అగ్రగామిగా వున్న రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి అనుకూలమయిన నిర్ణయాలు తీసుకోవడంలో జైపాల్ రెడ్డి విముఖత ప్రదర్శిస్తూ వుండడమే దానికి కారణమని కొన్ని పత్రికలు ముక్తాయింపు కూడా ఇచ్చాయి.
మీడియా వూహాగానాలను నిజం చేస్తూ జైపాల్ రెడ్డి శాఖ మారింది. చాలా చిన్న శాఖగా పరిగణించే శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను జైపాల్ రెడ్డి వంటి సీనియర్ కు వొప్పగించిన తీరు చూసి నివ్వెర పోవడం అందరి వంతు అయింది. ఆయన మాత్రం నిబ్బరం కోల్పోలేదు. ‘పెట్రోలియం శాఖ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తికి గురయ్యాను కాని ఇప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ కేటాయించినప్పుడు ఎలాటి అసంతృప్తి లేద’ని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పండిపోయిన మనిషి. యెలా స్పందించాలో ఆ మాత్రం తెలియని వ్యక్తి కాదు కదా. కానీ ఆ అవకాశాన్ని కేజ్రీవాల్ అందిపుచ్చుకున్నారు. ఆయన అప్పటికి ఇంకా పేరుపెట్టని ఓ కొత్త పార్టీ పెట్టి అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులపై అవినీతి ఆరోపణాస్త్రాలు గుప్పిస్తూ మీడియాలో వెలిగిపోతున్న రోజులవి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు కదా!
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఇందులో భాగంగానే జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని కేజ్రీ వాల్ ఆరోపణ.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనకు విరుద్ధంగా రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేసి ధర పెంచాలని అడ్డదారిలో వొత్తిడి తెస్తోందని అంటూ, సరకును దాచి పెట్టి కృత్రిమంగా రేట్లు పెంచాలని చూసే చిల్లర వ్యాపారుల నైజంతో రిలయన్స్ దిగ్గజం వ్యవహారాన్ని కేజ్రీ వాల్ పోల్చారు.
ముఖేష్ అంబానీ డిమాండ్లను అంగీకరిస్తే రిలయన్స్ సంస్థకు అదనంగా 43 వేల కోట్ల రూపాయల అదనపు లాభం రాగలదని., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై 53 వేల కోట్లు అదనపు భారం పడగలదని జైపాల్ రెడ్డి తయారుచేసిన నోట్ లో పేర్కొన్నారని కేజ్రీ వాల్ వెల్లడించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ అన్వేషణ విషయంలో ప్రభుత్వంపై అధిక భారం పడగల అనేక రాయితీలను గతంలో బీజేపీ సారధ్యంలోని ఎన్ డీ యే ప్రభుత్వం కూడా సమకూర్చి పెట్టిందని ఆయన గుర్తుచేశారు.
కేజ్రీవాల్ ఆరోపణలు ఎలావున్నా, వాటిపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం గమనార్హం.
సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి అయిదేళ్ళు దాటిపోయింది. విభజనకు పూర్వం చాలా కాలం, తరువాత కొన్నాళ్ళు విభజానంతర పరిణామాల పట్ల చాలామందిలో, ప్రత్యేకించి హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రుల మనస్సుల్లో వున్న భయసందేహాలు చాలా వరకు సద్దుమణిగాయి. ఏవో రాజకీయ సంబంధమయిన చిటపటలు మినహా మొత్తం మీద చూస్తే అటూ, ఇటూ జనాలు సర్దుకుపోయారనే చెప్పాలి. ఇలాంటి నేపధ్యంలో విభజన కధ పేరుతొ అలనాటి విషయాలను తవ్వి తీస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏకంగా ఒక పుస్తకం రాశారు.
ఈ పుస్తకంలో ఎస్. జైపాల్ రెడ్డి ప్రస్తావన అనేక పర్యాయాలు రావడమే ఈ ప్రసక్తి తీసుకురావడానికి కారణం.
ఆ రోజుల్లో తాను డైరీలో రాసుకున్న విశేషాల ఆధారంగా ఉండవల్లి ఈ పుస్తకం రాశారు. మరి కొన్నిటితో తనకు సంబంధం లేని, అంటే తాను ప్రత్యక్షంగా లేని, చూడని సన్నివేశాలను, సంభాషణలను తన ఊహాశక్తితో రచించానని ఆయనే చెప్పుకున్నారు. ఆయా వ్యక్తుల స్వభావాలను అర్ధం చేసుకున్న వ్యక్తిగా, వారు కొన్ని సందర్భాలలో ఎలా, యేమని మాట్లాడుకుని వుంటారో ఊహించి రాయడం, అదీ జీవించి వున్న వ్యక్తుల విషయంలో ఇటువంటి ప్రయోగం చేయడం నిజంగా సాహసమే. ముఖ్యంగా విభజన బిల్లు ఓటింగు విషయంలో స్పీకర్ ఛాంబర్లో జరిగిన సమావేశం. స్పీకర్, జైపాల్ రెడ్డి నడుమ జరిగిన సంభాషణ ఉండవల్లి కల్పనాశక్తికి చక్కని ఉదాహరణలు. కొన్ని పేజీలకు విస్తరించిన ఈ సంభాషణల పర్వం ఈ పుస్తకానికి హైలైట్. ఉండవల్లి నిజంగానే పరకాయ ప్రవేశం చేసి రాశారా అన్నట్టుగా వుందా ఘట్టం. విషయ విస్తరణ భీతి వల్ల ఆ మొత్తం వ్యవహారాన్ని యథాతధంగా పేర్కొనడానికి వీలుండదు కనుక, మచ్చుకు కొన్ని మాత్రమే ప్రస్తావించాల్సి వస్తోంది. (ఒక స్థాయిలో రాజకీయాలు ఏ తీరుగా సాగుతాయో అనడానికి ఇవి తార్కాణం కూడా).
తాను లేని స్పీకర్ ఛాంబర్లో జై పాల్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని ఉండవల్లి ఎలా ఊహించి రాశారో గమనించండి.
జైపాల్ రెడ్డి: (స్పీకర్ ను ఉద్దేశించి) : “కంగారు పడకమ్మా! ఫిఫ్టీ యియర్స్ ఇక్కడ. యాభయ్ ఏళ్ళ ఎక్స్ పీరియన్స్ తో చెబుతున్నా. నువ్వు అధ్యక్ష స్థానంలో కూర్చోగానే అకస్మాత్తుగా టీవీ ప్రసారాలు ఆగిపోతాయి. అవి బాగు చేసేలోగా బిల్లు పాసయిపోతుంది. కొత్త లోక సభ ఏర్పడి ఎంక్వయిరీ చేస్తారనే భయం అక్కరలేదు. యూపీఏ, కాకపొతే ఎన్డీయే. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ బిల్లు విషయం ఇంతటితో ముగిసిపోతుంది”
“కట్టేకాడ్ ప్రాంతంలో ఒక తెగ వాళ్ళు ఆడపిల్ల పుట్టగానే నోట్లో, ముక్కులో బియ్యం గింజలు వేసి చంపేస్తారు. తల్లీ తండ్రీ ఏకమై పసిగుడ్డును చిదిమేస్తే ఎవరేం చేయగలరు. కంప్లైంట్ లేనప్పుడు విచారణ ఏమిటి? శిక్ష ఎక్కడ?
“ఇంత దారుణమైన పోలిక తెస్తున్నందుకు బాధపడకండి. ఈ పార్లమెంటు కూడా ఆ తెగ లాంటిదే.
“తండ్రి లాంటి అధికారపక్షం, తల్లి లాంటి ప్రతిపక్షం కలిసి బిడ్డను చంపేయాలని అనుకుంటే స్పీకర్ ది మంత్రసాని పాత్రే అమ్మా!
“అంచేత మీ విధి మీరు నిర్వర్తించండి. మొదట్లో అదోలా అనిపించినా తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత సులువా అని.
“ఆఖరి మాట. మీరేం తప్పు చేయడం లేదు. రూల్ ప్రకారం తలలు లెక్క పెడుతున్నారు. ఎవరి సీట్లలో వాళ్ళు ఉంటేనే లెక్కపెడతామని మధ్య మధ్యలో చెబుతూ వుండండి.
“....బిల్లు పాసయి రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని గురించి మాట్లాడేవాళ్ళు కానీ, అసలు ఆలోచించేవాళ్ళు కానీ ఉండనే ఉండరు.
“పదేళ్ళు ఉమ్మడి రాజధాని సరిపోదేమో అనుకుంటున్నారు. పది నెలల్లో రాజధాని మార్చేస్తామనకపొతే నన్నడగండి.
“నేను చెప్పిన దాంట్లో ఏదైనా కటువుగా, రాజ్యాంగ విరుద్ధంగా, అధర్మంగా మీకనిపిస్తే అది మీ అవగాహనాలోపమే తప్ప, నా ఆలోచనా అపరికత్వత మాత్రం కాదు.
“నేను చెప్పదలచుకున్నది ఇంతే!”
ఇలా చెప్పాల్సింది నీళ్ళు నమలకుండా చెప్పేసి, జైపాల్ రెడ్డి స్పీకర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన తరువాత టీ. కాంగ్రెస్ ఎంపీలతో ఆయన చెప్పిన మాటలు కూడా ఉండవల్లి ఊహాగానమే. అది ఇలా సాగింది ఈ పుస్తకంలో:
“స్పీకర్ చాంబర్లో జరిగింది మరిచిపొండి. ఆ మాటలు నేను అనలేదు, మీరు వినలేదు. ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. నేనూ అదే చేసాను. తెలంగాణా ఏర్పడడం తక్షణ అవసరంగా భావించే ఇలా ప్రవర్తించాను. నౌ ఆర్ నెవ్వర్. ఇప్పుడు అయితే అయినట్టు. లేకపోతే తెలంగాణా ఎప్పటికీ రాదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించడమే మీ బాధ్యత. ఆ పని చేయండి”
జైపాల్ రెడ్డి మాటల్ని ఊహించి రాసినట్టు ఉండవల్లి మరోమారు చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి ఉపన్యాస శైలి తో పరిచయం వుండడం చేత, ఆఖరి గంటలో స్పీకర్ చాంబర్లో ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించి రాసానని పేర్కొన్నారు. కానీ నైతికంగా ఆలోచించినప్పుడు ఉండవల్లి అనుసరించిన ఈ విధానం వ్యక్తుల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వుందని చెప్పక తప్పదు. తన వాదనకు బలం చేకూర్చేందుకు ఇలా ఊహాగానాలతో గ్రంథరచన చేయడం సబబు అనిపించదు.
కాంగ్రెస్ హయాములో న్యూఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ జరిగినప్పటి మాట. ఇందులో కూడా జైపాల్ రెడ్డి సమర్ధతతకు అద్దం పట్టే ఓ ఉదంతం వుంది. ఈ క్రీడలు ప్రారంభం కాకమునుపే అనుమానపు మబ్బులు కమ్ముకున్నాయి.
ఈ క్రీడలు మొదలు కావడానికి రెండు రోజులు ముందువరకు కూడా అందరి మనసుల్లో నూటొక్క సందేహాలు. నిర్వాహకుల నిర్వాకంపై వేయిన్నొక్క అనుమానాలు.
అవినీతి పునాదులపై స్టేడియాల నిర్మాణం జరిగిందనీ, అతిధులకూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకూ సరయిన వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ,
భద్రతా ఏర్పాట్ల పట్ల శ్రద్ధ కరువయిందనీ,
ఉగ్రవాదులనుంచి పెను ముప్పు పొంచివుందనీ,
ఇలా ఎన్నో ఆరోపణలు.
ఎన్నెన్నో విమర్శలు.
ఈ నేపధ్యంలో –
దేశ ప్రతిష్ట మసకబారబోతోందనే దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చక చకా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలకు కేంద్ర బిందువయిన క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అనుదిన జోక్యంపై అంట కత్తెర వేసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన బాధ్యతలన్నీ అప్పగించింది. ప్రారంభ సంరంభానికి పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేని స్తితిలో, పరిస్తితులను చక్కదిద్దే భారాన్ని జై పాల్ రెడ్డి బృందం భుజస్కందాలపై మోపింది.
పనులు ఓ గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో క్రీడోత్సవ నిర్వహణలో భాగంగా నిర్మిస్తున్న ఒక వంతెన హఠాత్తుగా కూలిపోవడంతో విమర్శల జడివాన మళ్ళీ మొదలయింది. అయితే, జైపాల్ రెడ్డి పూనికతో ప్రధాని కల్పించుకుని సైన్యాన్ని రంగం లోకి దింపి, వంతెన నిర్మాణాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేయించడంతో ఆరోపణల కారు మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి.

Will Yeddyurappa Government Proves No Confidence Motion In Assembly ? | ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24X 7 న్యూస్ ఛానల్లో యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ నాగుల్ మీరా (టీడీపీ), శ్రీ శ్రీనివాస రాజు (బీజేపీ), శ్రీ రామచంద్రా రెడ్డి (వైసీపీ).
Why Government Fails To Give Reservation To Kapu Caste ? | The Debate | ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24X 7 న్యూస్ ఛానల్లో యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ నాగుల్ మీరా (టీడీపీ), శ్రీ శ్రీనివాస రాజు (బీజేపీ), శ్రీ రామచంద్రా రెడ్డి (వైసీపీ).
AP24x7 And Leaders Special Tributes To Former Union Minister Jaipal Redd...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24X 7 న్యూస్ ఛానల్లో యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ నాగుల్ మీరా (టీడీపీ), శ్రీ శ్రీనివాస రాజు (బీజేపీ), శ్రీ రామచంద్రా రెడ్డి (వైసీపీ).
28, జులై 2019, ఆదివారం
27, జులై 2019, శనివారం
Discussion on Three News Channels Ban In AP Assembly | Public Point | AB...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ లో శ్రీ నివాస్ నిర్వహించిన పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో....
26, జులై 2019, శుక్రవారం
జగన్ గోదావరి జిల్లాల భవిష్యత్తును కేసీఆర్ ముందు తాకట్టు పెట్టారా? | Hot ...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీడీపీ), శ్రీ వేణుగోపాల్ (వైసీపీ), శ్రీ సలీం (ముస్లిం సామాజిక వేత్త), శ్రీ ప్రసాద్ (జనసేన)
ఇస్లాంలో ఇన్ని దుర్మార్గాలు ఆడవాళ్లపై జరుగుతుంటే మత పెద్దలేం చేస్తున్నార...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీడీపీ), శ్రీ వేణుగోపాల్ (వైసీపీ), శ్రీ సలీం (ముస్లిం సామాజిక వేత్త), శ్రీ ప్రసాద్ (జనసేన)
ఇదంతా మా పై మోడీ చేస్తున్న కుట్ర : ముస్లిం మత పెద్ద | Hot Topic with Jou...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీడీపీ), శ్రీ వేణుగోపాల్ (వైసీపీ), శ్రీ సలీం (ముస్లిం సామాజిక వేత్త), శ్రీ ప్రసాద్ (జనసేన)
మోడీ ట్రిపుల్ తలాక్ పై సరిగా వ్యవహరించకనే ఇన్ని ఇబ్బందులు | Hot Topic wi...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీడీపీ), శ్రీ వేణుగోపాల్ (వైసీపీ), శ్రీ సలీం (ముస్లిం సామాజిక వేత్త), శ్రీ ప్రసాద్ (జనసేన)
జగన్ పిచ్చి నిర్ణయం గోదావరి జిల్లాలని ఎడారిగా మారుస్తుంది : బాబు | Hot T...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీడీపీ), శ్రీ వేణుగోపాల్ (వైసీపీ), శ్రీ సలీం (ముస్లిం సామాజిక వేత్త), శ్రీ ప్రసాద్ (జనసేన)
ఆంధ్రాలో జరుగుతుంది అసెంబ్లీనా ? కురుక్షేత్రమా ? | Hot Topic with Journa...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీడీపీ), శ్రీ వేణుగోపాల్ (వైసీపీ), శ్రీ సలీం (ముస్లిం సామాజిక వేత్త), శ్రీ ప్రసాద్ (జనసేన)
మోడీ ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ పేరుతో నిజంగానే న్యాయం చేసున్నాడా? |...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 న్యూస్ ఛానల్ Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీడీపీ), శ్రీ వేణుగోపాల్ (వైసీపీ), శ్రీ సలీం (ముస్లిం సామాజిక వేత్త), శ్రీ ప్రసాద్ (జనసేన)
25, జులై 2019, గురువారం
Special Discussion On Ankapur Villagers Protest At Pragathi Bhavan | Goo...
ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం V 6 టీవీ లో భరత్ నిర్వహించిన Good Morning Telangana చర్చాకార్యక్రమంలో ......
24, జులై 2019, బుధవారం
Debate On 3 TDP Members Suspended From AP Assembly | News & Views #2 | hmtv
సంకల్ప సిద్ధిరస్తు
హెచ్ ఎం టీవీ సీఈఓ శ్రీ శ్రీనివాసరెడ్డికి ఓ మంచి సంకల్పం కలిగింది. వివిధ పత్రికల్లో కానవచ్చిన ఓ మంచివిషయంతో, ఓ మంచి కబురుతో ఉదయం చర్చాకార్యక్రమాన్ని చేపట్టాలన్నది ఆయన ఉద్దేశ్యం. మంచిదే. కానీ శ్రమపడి వెతికితే కాని ఈనాటి పత్రికల్లో అటువంటి వార్తలు దొరకవు. ఉద్దేశ్యం మంచిది కనుక ఆయన సంకల్పం నెరవేరాలని కోరుకుందాం!
ప్రతి బుధవారం మాదిరిగానే ఈ ఉదయం హెచ్ ఎం టీవీ ఛానల్ లో శ్రీ శ్రీనివాసరెడ్డి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ రఘునాధ బాబు (బీజేపీ), శ్రీ జవహర్ (టీడీపీ), శ్రీ గోవిందరెడ్డి (వైసీపీ)

Debate On 3 TDP Members Suspended From AP Assembly | News & Views #1 | hmtv

23, జులై 2019, మంగళవారం
KSR Live Show | 50 percent reservation in nominated positions: YS Jaga...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రాజశేఖర రెడ్డి (వైసీపీ), శ్రీ జి. వి. రెడ్డి (కాంగ్రెస్), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ)
ISRO Creates World Record : ISRO Launches Chandrayan -2 | Mahaa News
నిన్న సోమవారం రాత్రి మహా న్యూస్ చానల్లో Executive Editor అజిత నిర్వహించిన Editors Time ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ....
21, జులై 2019, ఆదివారం
వివాదగ్రస్తమవుతున్న స్పీకర్ల పాత్ర – భండారు శ్రీనివాసరావు
(Published in SURYA daily on 21-07-2019, SUNDAY)
జులై 19 వ తేదీ శుక్రవారం మధ్యాన్నం
ఒంటి గంటా ముప్పయి నిమిషాలు.
ఇదేమీ ఇస్రోలో రాకెట్ ప్రయోగానికి
నిర్ణయించిన ముహూర్తం కాదు.
అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి
కుమారస్వామికి రాష్ట్ర గవర్నర్ వజూ భాయ్
వాలా విధించిన గడువు.
జులై పందొమ్మిది వచ్చింది. మధ్యాన్నం
ఒంటిగంట కూడా అయింది. ముఖ్యమంత్రి వైఖరితో గవర్నర్ ఆదేశం బుట్టదాఖలు అయింది.
గవర్నర్ ఓపికస్తుడు కనుక నొచ్చుకోకుండా
గడువును పొడిగించారు.
ఈసారి శుక్రవారం ఆరు గంటలలోగా బల
నిరూపణ జరిగి తీరాలని ఆదేశిస్తూ గవర్నర్ నుంచి ముఖ్యమంత్రికి మరో శ్రీముఖం.
నిజానికి ఇది మూడో గడువు. మొదటి గడువు
గురువారం నాడు స్పీకర్ రమేష్
కుమార్ కు రాసిన లేఖ. ఆ రోజునే బలపరీక్ష పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశం. దాన్ని
స్పీకర్ నిర్ద్వందంగా త్రోసిపుచ్చారు.
ఈ వ్యాసం రాసే సమయానికి మూడో గడువు
కూడా ముగిసింది. స్పీకర్ దాన్ని ఖాతరు చేయకుండా అసెంబ్లీ సమావేశాన్ని
కొనసాగిస్తున్నారు.
అయినా గవర్నర్ గడువును మరోసారి
పొడిగిస్తారా? లేదా ధిక్కారమున్ సైతునా అనే రీతిలో ఆయన మరేదైనా కఠిన నిర్ణయం
తీసుకుంటారా? కేంద్రంతో సంప్రదించి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా? లేదా
ఈలోగా సుప్రీం కోర్టు కెక్కిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపాన్ని
అత్యున్నత న్యాయ స్థానం పరిగణన లోకి తీసుకుని విప్ విషయంలో ఏదైనా స్పష్టమైన వివరణ
ఇస్తుందా? ముఖ్యమంత్రి కుమార స్వామి,
కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య పదేపదే
చెబుతున్నట్టు సభలో విశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయిన తర్వాతనే ఓటింగు జరుగుతుందా?
అప్పటిదాకా స్పీకర్ సభను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తారా?
అన్నీ ప్రశ్నలే! దేనికీ జవాబులు లేవు.
రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎవరు
అధికులు? గవర్నరా? ముఖ్యమంత్రా? అసెంబ్లీ స్పీకరా?
ఎవరి మాట చెల్లుతుంది? చెల్లుబాటు
కావాలి?
ప్రజాస్వామ్యంలో వివిధ రాజ్యాంగ
వ్యవస్థల నడుమ ఆధిక్యతకు సంబంధించిన వివాదం తలెత్తితే దాన్ని తీర్చేవారెవరు?
క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ చాలా రోజులుగా
కర్ణాటకలో రాజకీయ అవనికపై సాగుతున్న నాటకం. ఇది ముగింపు ఇప్పట్లో లేని టీవీ సీరియల్
మాదిరిగా కొనసాగుతుందా? లేక ఎక్కడో ఒకచోట ఆగుతుందా?
ఎలాగు సమాధానాలు లేవు కాబట్టి,
వర్తమానాన్ని ప్రస్తుతానికి వదిలేసి గతాన్ని అవలోకిద్దాం.
దాదాసాహెబ్ గణేష్ వాసుదేవ్ మావలంకర్.
లోకసభ మొట్టమొదటి స్పీకర్ (1952-1956). మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఒక రోజు ప్రధాని
నెహ్రూ, స్పీకర్ ను తన ఇంటికి పిలిచారు. పిలిచింది సాక్షాత్తు ప్రధాని. ఆనాటి
రాజకీయాల్లో శిఖరసమానుడు. పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడు. కానీ పిలుపు
అందుకున్నది మావలంకర్. ఆయనా సామాన్యుడు కాదు. తనకు అందిన ఆహ్వానానికి ఆయన నెహ్రూకు
కృతజ్ఞతలు తెలుపుతూ జవాబు పంపారు. ఏమనీ!
“మీరు పంపిన ఆహ్వానానికి మావలంకర్ అనే
నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిన మాట వాస్తవం. అయితే, మరో వాస్తవం మీ దృష్టికి తేవడానికే ఈ లేఖ.
నేనిప్పుడు కేవలం మావలంకర్ ని మాత్రమే
కాదు. మన దేశపు అత్యుత్తమ రాజకీయ వేదిక అయిన పార్లమెంటుకు స్పీకర్ ని కూడా. ఆ హోదాలో నేను
మీ ఇంటికి రావడం కుదరని పని. గమనించగలరు”
వర్తమాన రాజకీయాల్లో లోక సభ, శాసన సభల
స్పీకర్ల వ్యవహార శైలితో పరిచయం ఉన్నవారికి ఎప్పుడో అరవై ఏడేళ్ళ క్రితమే స్పీకర్
అనే పదవి ఎంతటి అత్యున్నతమైనదో తెలియ చెప్పిన మావలంకర్ గురించి వింటే ఆశ్చర్యం కలగక మానదు.
మావలంకర్ అనుభవం నేర్పిన పాఠ౦ ఫలితమో ఏమో తెలియదు కానీ స్పీకర్ల విషయంలో ఆయన
వైఖరి పూర్తిగా మారిపోయింది. ఒక సందర్భంలో ప్రధానిగా నెహ్రూ చెప్పిన మాటలు ఇలా
వున్నాయి.
‘స్పీకర్ అంటే గౌరవానికి ప్రతీక. సభా
గౌరవానికి, సభకు వున్న స్వేచ్చాస్వాతంత్రాలకు కూడా ఆయన ప్రతినిధి. పార్లమెంటు
అనేది అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, అది యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
దానికి సర్వాధికారి అయిన స్పీకర్ సయితం మొత్తం దేశానికి ప్రతినిధి. స్పీకర్ స్థానం
అత్యంత గౌరవప్రదమైనది. ఆ పదవిని అలంకరించేవారు అత్యద్భుతమైన స్థోమత, మొక్కవోని
నిష్పాక్షికతలకు ప్రతిరూపంగా వుండాలి. వారికి స్వేచ్చగా వ్యవహరించగల పరిస్తితులు
వుండాలి.’
సరే! అలనాటి రోజులు గుప్తుల స్వర్ణ
యుగం మాదిరిగా ఊహించుకోవాల్సిందే కాని ఆచరణ సాధ్యం అయ్యే రోజులు కావివి.
చట్టసభల స్పీకర్లు ఎంత ఉదాత్తంగా
ఉండాలో, వారిని ఎలా గౌరవించాలో పండిట్ జవహరలాల్ నెహ్రూ చెబితే, భారత దేశపు
అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు, స్పీకర్లకు వుండే విశేషాధికారాలు ఎలాంటివో
తెలియచెప్పింది.
2016 లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ
రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించిన కేసులో అసెంబ్లీ స్పీకర్ కు ఉన్న అధికారాలను కోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ సుప్రీం అని
సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
అసెంబ్లీకి సంబంధించిన కొన్ని విషయాల్లో తప్ప గవర్నర్ పాత్ర చాలా స్వల్పమని
పేర్కొన్నది. పదో షెడ్యూల్ లోని పార్టీ
ఫిరాయింపుల వంటి అంశాలలో స్పీకర్ దే తుది
నిర్ణయం అంటూ తీర్పు వెలువరించింది. ఈ విషయాల్లో గవర్నర్ కు ఎలాటి పాత్రా,
అధికారాలు ఉండవని అందులో స్పష్టం చేసింది.
అంతకు ముందు 2010లో సుప్రీంకోర్టు గవర్నర్ల అధికారాలను నిర్వచిస్తూ ఒక తీర్పు
ఇచ్చింది.
‘గవర్నర్లు రాష్ట్రాలకు రాజ్యాంగ
అధినేతలు మాత్రమే. గవర్నర్ కేంద్ర
ప్రభుత్వానికి ఏజెంట్ కాదు. జీతం తీసుకునే ఉద్యోగి కూడా కాదు. అంతేకాదు, గవర్నర్
అనేవాడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కూడా కాదు, కాకూడదు’
స్పీకర్లకు మాత్రం రాజ్యాంగం
విశేషాధికారాలు కల్పించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూలిపోవడానికి చట్ట
సభల్లో వాటి ఆధిక్యం సింపుల్ మెజారిటీకి తగ్గితే చాలు. ప్రభుత్వం పడిపోతుంది. స్పీకర్ ని తొలగించాలంటే సింపుల్ మెజారిటీ
సరిపోదు. సభలోని మొత్తం సభ్యుల్లో సగానికి పైగా స్పీకర్ కు వ్యతిరేకంగా ఓటు
వేసినప్పుడే అది సాధ్యం అవుతుంది.
లోకసభ స్పీకర్ గా పనిచేసిన సోమనాధ
చటర్జీ కూడా స్పీకర్ల పాత్రపై సందేహాలు వ్యక్తం చేయడం విశేషం.
పదో షెడ్యూల్ లో పార్టీ ఫిరాయింపుల
విషయంలో స్పీకర్లకున్న విశేషాధికారాలను ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తి చేతిలో ఒక
ప్రభుత్వం మనుగడకు సంబంధించిన అధికారాన్ని వుంచడం మంచిది కాదని సోమనాధ చటర్జీ
అభిప్రాయం. స్పీకర్ కు బదులు ఈ అధికారాలను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన
వ్యవస్థకు అప్పగించాలని ఆయన సూచించారు.
చివరాఖరుకు నిస్సంశయంగా ఒక విషయం
చెప్పవచ్చు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి
తూట్లు పొడవడంలో స్పీకర్లకు ఉన్న విచక్షణాధికారాలకు స్వస్తివాచకం పలకాల్సిన తరుణం మాత్రం ఆసన్నమైందని కర్ణాటక
ఉదంతం తెలుపుతోంది.
బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత
రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ విభాగాలకు విధులను నిర్దేశించింది.
అంతరిక్షంలో తిరుగాడుతున్న అనేక గ్రహాలు ఒకదానినొకటి తాకని రీతిలో నియమిత కక్ష్యలో
పరిభ్రమిస్తున్నట్టు రాజ్యంగ మూలస్థంభాలయిన శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలు తమ తమ పరిధులలో
కర్తవ్య నిర్వహణ సాగిస్తున్నంత కాలం ప్రజాస్వామ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా
విలసిల్లుతుంది. అలా కాకుండా ఒకదానితో మరొకటి విబేధించుకున్నా, ఒకదాని పనిలో
మరొకటి జోక్యం చేసుకున్నా ప్రజాస్వామ్యసౌద పునాదులకే ముప్పు వాటిల్లుతుంది.
ఒక ప్రధానమంత్రి, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక
గవర్నర్, ఒక స్పీకర్, ఒక ముఖ్యమంత్రి, ఒక కేబినెట్ సెక్రెటరీ, ఒక ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి వీరందరూ వారి వారి పరిధుల్లో పనిచేసినప్పుడే పరిపాలన సజావుగా
సాగుతుంది. సామాన్యుడి జీవితం సాఫీగా సాగుతుంది. అశాశ్వతమైన అధికారాన్ని అంటిపెట్టుకుని
నేనే సర్వం సహా చక్రవర్తిని అనే భావన ఏ
ఒక్కరు పెంచుకున్నా ఇక ఇంతే సంగతులు.
ఏపీలో బీజేపీ పోరుబాట మొదలైందా? | News Scan Debate With Vijay | TV5
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 న్యూస్ ఛానల్ లో Executive Editor శ్రీ విజయనారాయణ్ News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: డాక్టర్ ఎన్. తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ కాశీ విశ్వనాద్ (బీజేపీ)
20, జులై 2019, శనివారం
Discussion | World Bank Drops Amaravati Project | Part -1 | Public Point...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ తో ....
Discussion | World Bank Drops Amaravati Project | Part - 2 | Public Poin...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ తో ....
దినపత్రిక బతుకు అర్ధగంట- గోరాశాస్త్రి చమత్కారం
దినపత్రిక బతుకు అర్ధగంట- గోరాశాస్త్రి చమత్కారం – భండారు శ్రీనివాసరావు
(గోరాశాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేడు ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితం సమాచార సేకరణలో ఉపకరించిన ఎన్. ఇన్నయ్యగారికి కృతజ్ఞతలు)
ఖాసా సుబ్బారావు గారు. పేరొందిన పాత్రికేయుడు. జగమెరిగిన జర్న్నలిస్ట్.
గోరాశాస్త్రిగారి గురించి మొదలు పెట్టి ముందుగా ఖాసా గారి ప్రసక్తి
ఎత్తుకోవడం ఎందుకంటే, తెలుగువారం అందరం గర్వించే ప్రసిద్ధ పాత్రికేయుడు
గోరాశాస్త్రి గారు జర్నలిజం రంగంలోకి రావడానికి ఖాసా సుబ్బారావుగారే
ప్రధాన కారణం. అంతవరకూ గోవిందు రామశాస్త్రిగా రైల్వేలో బుద్ధిగా ఉద్యోగం
చేసుకుంటున్న ఆ పెద్దమనిషిని పిలిచి మరీ స్వతంత్ర (ఇంగ్లీష్) పత్రికలో
ఉద్యోగం ఇచ్చారు. జర్నలిజం అంటే ఏమిటి, పత్రికలంటే ఏమిటి ఇవేవీ
రామశాస్త్రి గారికి అంతవరకు ఏమీ తెలియదు. అయినా ధైర్యంగా చేస్తున్న
ఉద్యోగాన్ని వదిలిపెట్టి మద్రాసు చేరారు. చేరి ఖాసా సుబ్బారావు గారు
ఎంతో నమ్మకం పెట్టుకుని తనకు అప్పగించిన పాత్రికేయ కొలువులో చేరిపోయారు.
అంతే వెనుతిరిగి చూసుకోలేదు. వృత్తికి ప్రవృత్తి తోడయింది. కలంలోని బలం
అర్ధమయ్యాక గోవిందు రామ శాస్త్రి గారు గోరాశాస్త్రిగా మారిపోయారు. అదే
పేరుతొ జర్నలిజంలో కొత్త శిఖరాలకు ఎగబ్రాకారు. స్వతంత్ర మేగజైన్ ఎడిటర్
గా ఎంతో మంది వర్ధమాన రచయితలను ప్రోత్సహించారు. అలా ఆయన వెన్నుతట్టి
పెన్ను పట్టించిన వారిలో అనేకమంది తదనంతరకాలంలో సుప్రసిద్ధ రచయితలుగా,
పత్రికారచయితలుగా రూపొందారు. ఆంధ్రభూమి ఎడిటర్ గా చేరినప్పటి నుంచి
ఆయనలోని ప్రజ్ఞాపాటవాలు మరింతగా వెలుగు చూశాయి. కేవలం సంపాదకీయం చదవడం
కోసమే పత్రిక కొనే సంప్రదాయం గోరాశాస్త్రి గారితో మొదలయ్యిందంటే
అతిశయోక్తి కాబోదు.
పత్రికా రచయిత, సంపాదకుడు అనేవి ఆయనలో ఒక కోణం మాత్రమే. శ్రవ్య మాధ్యమం
రేడియోకి నాటకం ఎలా రాయాలి అనే విషయాన్ని ఆయన కాచి వడబోశారు. ఆ చేత్తోనే
మరెన్నో అపురూప రచనలు చేస్తూ నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సారస్వత
మాగాణాన్ని పండించారు.
జర్నలిజానికి సంబంధించిన ఓనమాలు తెలియకుండానే ఆ రంగంలో ప్రవేశించి, తనంటే
ఏమిటో నిరూపించుకుని తెలుగు పత్రికలను గురించి తయారుచేసిన పరిశోధనా పత్రం
సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. తెలుగులో
పత్రికా రచయితలు కావాలనే అభిలాష కలిగిన వారికోసం సుబోధకమైన శైలిలో అనేక
పుస్తకాలు రాశారు.
అనువదించడం ఎలా? మీరూ జర్నలిస్ట్ కావచ్చు అనే శీర్షికలతో రాసిన వారి
రచనలు విశేష ప్రాచుర్యం పొందాయి.
గోరా శాస్త్రి గారు పుట్టింది ఇప్పుడు ఒడిషా అని పిలుచుకుంటున్న ఒకప్పటి
ఒరిస్సాలో. కోరాపుట్ జిల్లాలోని తోరామాల్ గ్రామంలో 1919 అక్టోబర్ మూడో
తేదీన జన్మించారు. చదివింది బియ్యే వరకే. మంచి ఉద్యోగం అని ఎదురు
చూడకుండా ఎదురొచ్చిన ప్రతి చిన్నా చితాకా ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళారు. ఆ
అనుభవాలు అన్నీ ఒక పత్రికా రచయితగా, ఒక సాహిత్యకారుడిగా ఆయనకు
ఉపయోగపడ్డాయి కూడా. ఖుర్దా రోడ్ స్టేషన్ లో రైల్వే గుమాస్తాగా చేస్తున్న
రోజుల్లో ఉబుసుపోకకు ఆంద్ర, ఆంగ్ల భాషల్లో రచనలు చేయడం మొదలు పెట్టారు.
వాటిల్లో అనేకం ఆనందవాణి, ‘కథానిక’ ఆంధ్రపత్రిక, దీపిక, నవశక్తి,
శ్రమజీవి మొదలయిన పత్రికలలో ప్రచురణకు నోచుకునేవి.
ఆనందవాణి సంపాదకులు ఉప్పులూరి కాళిదాసు గారు వాటిని చదివి కుర్ర శాస్త్రి
గారిలోని రచనా శైలికి ముగ్ధులై ఆయన గురించి ఖాసా సుబ్బారావు గారికి
ఎరుకపరిచారు. శాస్త్రి గారి ఆంగ్ల రచనలు సుబ్బారావు గారికి బాగా నచ్చాయి.
ఆయన తెలిగ్రము ఇచ్చి శాస్త్రి గారిని పిలిపించుకుని స్వతంత్ర పత్రికలో
ఉద్యోగం ఇచ్చారు.
ఆంగ్ల స్వతంత్ర కు తోడుగా ప్రారంభించిన తెలుగు స్వతంత్ర పత్రికలో
శాస్త్రి గారు మొదలు పెట్టిన ‘వినాయకుడి వీణ’ శీర్షిక తెలుగు
పత్రికాలోకంలో ఒక సంచలనంగా మారింది. శాస్త్రి గారికి విశేషమైన పేరు
ప్రఖ్యాతులు కట్టబెట్టింది.స్వతంత్ర పత్రిక మూతపడిన తర్వాత శాస్త్రి గారి
మకాము హైదరబడుకుకు మారింది. ఆంధ్రప్రభలో ప్రత్యేక ప్రతినిధిగా కొంతకాలం
పనిచేసిన పిమ్మట ఆంద్ర భూమి సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు.
అప్పటినుంచి మరణించేవరకు అదే బాధ్యత త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు.
ప్రముఖ హేతువాది ఎన్.ఇన్నయ్య ఒక వ్యాసంలో శాస్త్రిగారిని గురించి రాస్తూ
సంపాదకుడు అనేవాడికి సమయ జ్ఞానం అవసరం అని శాస్త్రిగారు చెబుతుండేవారని
పేర్కొన్నారు. ‘దినపత్రిక బ్రతుకు అర్థగంట. ఆ తర్వాత పకోడీ పొట్లాలకే
పనికొస్తుంది’ అనేవారట శాస్త్రి గారు.
YCP Leader Pallam Raju Said TDP Govt Fails To Complete Polavaram Project...
నిన్న శుక్రవారం రాత్రి మహా న్యూస్ ఛానల్ లో అజిత నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ బ్రహ్మయ్య (టీడీపీ), శ్రీమతి గాయత్రి (బీజేపీ)
Journalist Srinivas Rao Says YSR Is First Leader To Start Polavaram Proj...
నిన్న శుక్రవారం రాత్రి మహా న్యూస్ ఛానల్ లో అజిత నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ బ్రహ్మయ్య (టీడీపీ), శ్రీమతి గాయత్రి (బీజేపీ)
19, జులై 2019, శుక్రవారం
The Fourth Estate | CM YS Jagan Fire's On Chandrababu House - 18th July ...
ప్రతి గురువారం మాదిరిగానే నిన్న రాత్రి సాక్షి టీవీ లో Amar's Fourth Estate చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అనుమోలు గాంధి (పర్యావరణ వేత్త), శ్రీ కోటేశ్వర రావు (బీజేపీ), శ్రీ అప్పలరాజు (వైసీపీ, ఎమ్మెల్యే)
బాబు గారు కట్టిన సింగపూర్ ఇదేనా? ఎక్కడ కనిపించదే ? Hot Topic with Journ...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 TV ఛానల్ లో Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘు (టీడీపీ), శ్రీ నాగార్జున యాదవ్ (వైసీపీ), శ్రీ శ్రీరాం (బీజేపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన)
ఎక్కడా కనిపించని ఆంధ్రా సింగపూర్, మరి బాబు ఏం చేసినట్టు ? | Hot Topic wi...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 TV ఛానల్ లో Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘు (టీడీపీ), శ్రీ నాగార్జున యాదవ్ (వైసీపీ), శ్రీ శ్రీరాం (బీజేపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన)
18, జులై 2019, గురువారం
Special Discussion, CM KCR Comments On Narendra Modi | Good Morning Tela...
ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం V6 టీవీ ఛానల్ లో భరత్ నిర్వహించిన గుడ్ మార్నింగ్ తెలంగాణా చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి (బీజేపీ), డాక్టర్ మల్లు రవి (కాంగ్రెస్)
కర్నటక లో పాలనా గాలికొదిలేశారు....! Sr Journalist Bandaru Srinivasa Rao ...
నిన్న బుధవారం రాత్రి Bharath Today టీవీ లో శివ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ......
16, జులై 2019, మంగళవారం
KSR Live Show | కరెంట్ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా - 16th July ...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ జీవీ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ).
Discussion over TDP Vs YCP war of words on KIA Motors | Part 1 | ABN Telugu
15-07-2019 సోమవారం రాత్రి ABN Andhra Jyothy చర్చాకార్యక్రమంలో ......
Discussion over TDP VS YCP war of words on KIA Motors | Part 2 | ABN Telugu
15-07-2019 సోమవారం రాత్రి ABN Andhra Jyothy చర్చాకార్యక్రమంలో ......
15, జులై 2019, సోమవారం
What Indicates To AP Public Over Twitter War Between TDP Leaders ? | The...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ లో రవి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ మల్లికార్జున యాదవ్ (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీమతి పద్మజ రెడ్డి (వైసీపీ).
Did AP CM Jagan Doing Caste Politics In AP ? | The Debate | AP24x7
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ లో రవి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ మల్లికార్జున యాదవ్ (టీడీపీ), శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీమతి పద్మజ రెడ్డి (వైసీపీ).
14, జులై 2019, ఆదివారం
మాటలే తప్ప చేతల్లేవా..? | News Scan LIVE Debate With Vijay | 14th July 2...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 న్యూస్ ఛానల్ లో Executive Editor విజయ నారాయణ్ నిర్వహించిన News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ జీ.వీ. రెడ్డి (కాంగ్రెస్),శ్రీ బండారు సత్యనారాయణ (టీడీపీ.మాజీ మంత్రి), శ్రీ రమేష్ నాయుడు (బీజేపీ)
13, జులై 2019, శనివారం
Discussion | FM Buggana Rajendranath Reddy First Budget For 2019-20 | Pu...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy న్యూస్ ఛానల్ లో యాంఖర్ శ్రీనివాస్ నిర్వహించిన Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో...
నవరత్నఖచిత బడ్జెట్ - భండారు శ్రీనివాసరావు
ఎన్నికల ప్రణాళికే తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్
అంటుంటారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన రెడ్డి. అందుకు తగ్గట్టే
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి, తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచిన
నవరత్న హామీలనే బడ్జెట్లో పొదిగి శాసనసభకు సమర్పించారు.
బడ్జెట్ అంచనా రు. 2, 27, 975
కోట్లు, రెవెన్యూ
వ్యయం రు. 1,80, 475 కోట్లు, మూలధన వ్యయం రు. 32,293 కోట్లు, వడ్డీల చెల్లింపులు రు. 8,994
కోట్లు, ఆరోగ్యశ్రీ రు. 1740 కోట్లు,
ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకీకరణ కోసం రు. 1500
కోట్లు, కాపుల సంక్షేమం రు. 2000 కోట్లు, సాగునీరు రు. 13,139 కోట్లు, బీసీల అభివృద్ధి కోసం రు. 15,061 కోట్లు, వై.ఎస్.ఆర్. రైతు భరోసా రు. 8750
కోట్లు, జల యజ్ఞం రు. 13, 139
కోట్లు, వై.ఎస్.ఆర్.
గృహ నిర్మాణం రు. 8,615 కోట్లు, అమ్మవొడి రు. 6,455 కోట్లు,
వ్యవసాయ బడ్జెట్ అంచనా వ్యయం రు. 28,866 కోట్లు.
స్థూలంగా చూసినప్పుడు ఈ కేటాయింపులు, అంచనాలకు
సంబంధించిన అంకెలు ఘనంగానే కనిపిస్తున్నాయి. ఆచరణలోకి వచ్చినప్పుడు కానీ ఫలితాలు
గురించి చెప్పలేని పరిస్తితి. అన్నిటికంటే ముందు ఆదాయానికీ, వ్యయానికీ నడుమ
విపరీతంగా కానవస్తున్న వ్యత్యాసం. ఎలా పూడ్చుకుంటారు అనేది జవాబు దొరకని ప్రశ్న.
జనం కోరేది మనం శాయడమా! మనం చేసేది జనం చూడడమా! అలనాడు 'పాతాళభైరవి' సినిమాలో మాంత్రికుడి నోట వినిపించిన
మాట ఇది. జనానికి కావాల్సింది చేయడమే ఈనాటి రాజకీయ పార్టీలు తమ విద్యుక్త ధర్మంగా
భావిస్తున్నాయి. బడ్జెట్లు కూడా అందుకు అనుగుణంగా తయారవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్
మోహన రెడ్డి ఈ విషయంలో లేనిపోని భేషజాలకు పోతున్నట్టు లేదు. తన పాదయాత్ర సందర్భంలో
ప్రజలకు ఇచ్చిన మాటే వేదంగా ఆయన భావిస్తున్నారు. ఆ నవరత్నాలే ఈనాడు బుగ్గన గారి
బడ్జెట్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అగ్రాసనాన్ని అలంకరించాయి.
ఉమ్మడి రాష్ట్రంలో లక్షలతో మొదలయిన బడ్జెట్
అంచనాలు, రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత అవి
కాలక్రమంలో పెరిగి పెరిగి లక్షల కోట్లల్లోకి చేరుకున్నాయి. ప్రతియేటా బడ్జెట్
పరిమాణం పెరుగుతూ పోవడం తప్పనిసరిగా
తయారయింది. ఆర్ధిక ప్రగతికి ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక కొలమానంగా
పరిగణిస్తున్నాయి. బడ్జెట్ అంచనా మొత్తం
యెంత గొప్పగా వుంటే అభివృద్ధి కూడా ఆ స్థాయిలో ఉంటుందని నమ్మే రోజులు వచ్చాయి.
వాస్తవానికి ప్రతి ప్రభుత్వం, అది ఏ పార్టీ
ప్రభుత్వం అయినా సరే ప్రతి ఏటా బడ్జెట్ పై గట్టి కసరత్తే చేస్తుంది. తమ విధానాలకు
అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో
కేటాయింపులు చేస్తుంది. యెంత ఖర్చు చేయాలన్నా ఎంతో కొంత రాబడి వుండాలి.
ఖజానాలో చేరే రూపాయలు తగ్గిపోయి పెట్టే ఖర్చు పెరిగిపోతే అదనపు ఆదాయ వనరుల అన్వేషణ
తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం అప్పులన్నా చేయాలి. లేదా పన్నులన్నా వేయాలి. మొదటిది
దొరకడం కష్టం. రెండోది వేయడం తేలికే కాని, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కొంత ఇబ్బందికరమైన
వ్యవహారం. ఎన్నికలకు ముందు బడ్జెట్ అయితే ఇక చెప్పే పనిలేదు. సాధ్యమైనంత ఉదారంగా
పన్ను భారం ప్రజలపై వేయకుండా చూడడం ఆర్ధిక మంత్రుల ప్రధమ ప్రాధాన్యం.
జగన్ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్ కాబట్టి ఈ
సమస్య లేదు.
సమస్య లేదు సరే! మరి ఇంత లోటు పూడ్చుకోవడం ఎలా!
ఇలాంటి సందర్భాల్లో దొరికినంత అప్పులు చేయడం,
విధి లేకపోతే పన్నులు వేయడం అనేది ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. అయితే, బడ్జెట్లో పన్నులు వేయడం అన్న పద్దతికి
పార్టీలు, ప్రభుత్వాలు ఏనాడో స్వస్తి పలికాయి. ఏడాది పొడుగునా వేయగల వెసులుబాటు
వున్నప్పుడు బడ్జెట్లో చూపించి లేని తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకన్న
నిర్ధారణకు వచ్చేసాయి.
చాలా ఏళ్ళ క్రితం బడ్జెట్ పై ఒక టీవీ చానల్ వారు
నిర్వహించిన డిబేట్ లో నాతోపాటు పాల్గొన్న
ప్రొఫెసర్ హర గోపాల్ చెప్పారు. ‘గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో
సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాల పొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్త పన్నులు వేస్తే
పాత రేటుకు కొన్న సరకులు కొత్త రేట్లకు అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని
వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న రోజులవి.
ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!’
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే
ప్రభుత్వ కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద
మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే
రేడియో పెట్టుకుని వినేవారు. గాస్ సిలిండర్
ధరలు, పెట్రోలు ధరలు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, ఫ్రిజ్ ల ఖరీదులు పెరిగాయా అనే ఆసక్తితో. ఇప్పుడు
బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర'
మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!
ఏపీ బడ్జెట్ పై శాసన సభలో చర్చలు ఎలా సాగుతాయో
తెలియదు కానీ, టీవీ ఛానళ్ళలో మాత్రం చర్చోపచర్చలు సాగిపోతూనే వున్నాయి. అసలు
బడ్జెట్ అంటే ఏమిటి అని ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అడిగారు. చిత్రం ఏమిటంటే బడ్జెట్లు రూపొందించి, ఆమోదించే
చట్టసభలో ఆయన సభ్యుడు.
బడ్జెట్ అంటే కొన్ని ఆలోచనలు, ఆలోచనలకు తగ్గ
అంచనాలు, అంచనాలకు తగిన కేటాయింపులు. అంతటితో బడ్జెట్ పని పూర్తి చేసామని
చెప్పుకోవచ్చు. అయితే, కేటాయింపులకు అనుగుణంగా
ఆ నిధులను సకాలంలో విడుదల
చేసి ఖర్చు చేస్తున్నారా అంటే అవునని చెప్పడం ఏ ప్రభుత్వానికయినా కష్టమే.
ఆర్ధిక సంవత్సరం ముగియవచ్చే తరుణంలో హడావిడిగా నిధులు ఇబ్బడిముబ్బడిగా విడుదల
చేయడం, సకాలంలో వాటిని ఖర్చు చేయలేక మురగబెట్టడం ఓ ఆనవాయితీగా మారిపోయింది. ఖర్చు చేయనిదానికి కేటాయింపులు చేయడం ఎందుకు?
కేటాయింపులు చేయలేదని, లేదా సరిగా చేయలేదని ప్రశ్నించడం ఎందుకు? అటు చూసినా, ఇటు
చూసినా, అటుఇటు చూసినా రాజకీయమే!
లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పాలకుల
కంటికి ఆనడం లేదు. అంకెలు కొట్టొచ్చినట్టు పెద్దవిగానే కనబడుతున్నాయి. ప్రాధాన్యతల
దగ్గరే పాలక ప్రతిపక్షాలకు శృతి కుదరడం
లేదు. అంకెల గారడీ అని విపక్షాలు విమర్శిస్తుంటే, వాటి మాటల్ని అవగాహనా రాహిత్యంగా
పాలకపక్ష సభ్యులు కొట్టి పారేస్తున్నారు. చెప్పింది ఏమిటి చేస్తున్నది ఏమిటి?
సరయిన వనరులు లేకుండా చేసే ఈ కేటాయింపులతో
ఏవి సాధిస్తారు అని ప్రతిపక్షాల ప్రశ్న. మనసుంటే మార్గం వుంటుంది అని సర్కారు వారి షరా మామూలు జవాబు.
వినేవారికి చెప్పేవారు లోకువ అంటారు. కానీ ఈ నానుడి తిరగబడింది. తమ మాటలతో, తమ
పధకాలతో ప్రజలను ఊహాలోకాల్లో తిప్పి
చూపించే ప్రభువులకు చూసే జనాలు లోకువ.
బడ్జెట్ పై పాలక, ప్రతిపక్షాల స్పందనలు వింటుంటే
మాయాబజార్ చిత్రంలో ప్రియదర్శిని పేటిక సన్నివేశం గుర్తుకురాక మానదు. అందులోని దర్పణంలో
ఎదురుగా నిలబడ్డవారి మొహం కాకుండా వారి మనసులో ఉన్నవారి ప్రతిబింబం కనిపిస్తుంది.
అలాగే పాలక ప్రతిపక్షాలు, వాటి అభిమానులు. అక్షరం పొల్లుపోకుండా అవే వ్యాఖ్యానాలు మార్చి మార్చి చేస్తుంటారు.
రాజకీయాల్లో వుండే కిక్కు అలాంటిది మరి.
బడ్జెట్ ప్రసంగం పేరుతొ ప్రతి ఆర్ధిక మంత్రి
యాభయి అరవై పేజీల పుస్తకం శాసన సభలో చదవడం
రివాజు. మరో రెండు పేజీలు అదనంగా జత చేసి, నిరుడు బడ్జెట్లో, కనీసం కొన్ని
ప్రధాన రంగాలకు యెంత కేటాయించారు, వాటిల్లో యెంత ఖర్చు పెట్టారు అనే వివరాలు
జోడిస్తే, లక్షల కోట్ల బడ్జెట్లకు అంకెల అలంకారంతో పాటు కొంత నిజాయితీ తోడవుతుంది.
సరే! వైఎస్ ఆర్ సీపీ ప్రభుత్వానికి ఇది మొట్టమొదటి బడ్జెట్ కాబట్టి ఒక ఏడాది ఆగి ఈ
విషయం అడగొచ్చు.
ఉపశ్రుతి:
చాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు
ముఖ్యమంత్రిగా పాలిస్తున్నప్పుడు మహేంద్ర నాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా
వుండేవారు. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ
పాఠం నెమ్మదిగా చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో
ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం
తీసేసి నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.